ఢిల్లీతో సహా ఉత్తర భారతంలో విపరీతమైన చలి నెలకొంది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఈరోజు(ఆదివారం) మైనస్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు దక్షిణ భారతంలోనూ ఇటువంటి వాతావరణం నెలకొంది. తమిళనాడులోని నీలగిరిలో ఈరోజు ఉదయం(ఆదివారం) ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు చేరుకుంది.
ఈ విధమైన వాతావరణం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వార్తా సంస్థ ఏఎన్‌ఐ షేర్ చేసిన వీడియోలో నీలగిరిలో భూమిపై మంచు వ్యాపించడాన్ని చూడవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా జంతువులు కూడా ఇబ్బంది పడుతుండటాన్ని గమనించవచ్చు. అయితే ఇక్కడి వాతావరణాన్ని చూసేందుకు జనం తరలివస్తున్నారు.
ఇదిలావుండగా గత కొన్ని రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వరదలు సంభవిస్తున్నాయి. గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు, వరదల కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: ఐదుగురు సీఈఓల అర్ధాంతర రాజీనామా.. 2023లో ఊహించని పరిణామం!
#WATCH | Nilgiris, Tamil Nadu: A layer of frost covered the Thalaikundha area of Nilgiris after 0 degrees Celcius temperature was recorded this morning. pic.twitter.com/Z43LzgaGvb
— ANI (@ANI) December 24, 2023
Comments
Please login to add a commentAdd a comment