
'మంచు'చేసింది
అసలే శీతాకాలం.. వణికించే చలి.. దానికితోడు దట్టమైన పొగమంచు దుప్పటి నగరాన్ని కప్పేసింది. భోగి పండుగ అయిన శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎనిమిది గంటల వరకు ఎదురుగా ఏముందో కూడా కనిపించనంతగా మంచుతెరలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నగరాన్ని మంచు ముంచేసింది.
దట్టమైన పొగమంచు భోగి పండగకు స్వాగతం పలికింది. సిటిజనులు మంచుకురుస్తున్న వేళ నిత్య కార్యక్రమాల్లో మునిగిపోయారు. – విశాఖపట్నం