న్యూఢిల్లీ: ఢిల్లీలో చలి తీవ్రత మరింత పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 7.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్‌లో సగటు కంటే తక్కువగా ఉంది. పలు ప్రాంతాల్లో పొగ మంచు కారణంగా రైల్వే శాఖ 8 రైళ్లను రద్దు చేసింది. 15 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసింది. మబ్బులు వీడి 25 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కానుందని వాతావరణ శాఖాధికారులు తెలుపుతున్నారు. తేమ 73 శాతం ఉందని, 2,500 మీటర్ల దూరం వరకు ఉన్నవి మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 9.4 డిగ్రీలు కాగా, గరిష్టంగా 25.2 డిగ్రీలు నమోదైనట్లు వివరించారు.