
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పాత ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హె చ్చరించింది.
మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 2 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 6 డిగ్రీలు, మెదక్‌లో 9, భద్రాచలంలో 10, ఖమ్మం, రామగుండంలలో 11, హైదరాబాద్‌లో 12, నల్లగొండలో 13, హకీంపేట, హన్మకొండ, నిజామాబాద్‌లలో 14, మహబూబ్‌నగర్ లో 15 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment