స్వైన్ ఫ్లూ హెచ్చరికల నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో మాస్క్‌లు ధరించిన దృశ్యం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మంచు, చలితో జనం ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదవుతున్నాయి. మరిన్ని రోజులు చలి తీవ్రత కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. గడిచిన వారం రోజులుగా పడిపోతున్న పగటి పూట ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం తక్కువగా నమోదు అవుతున్నాయి. జనవరి 14 తర్వాత క్రమంగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఇటీవలి తుపాను కారణంగా మళ్లీ తగ్గాయి. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో 12.8 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. అది సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువ. పగటి పూట సైతం సగటు కంటే తక్కువగానే నమోదైంది. మంగళవారం నగరంలో 26.7 డిగ్రీలు నమోదు కాగా, ఇది కూడా సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువ. ఈ ఉష్ణోగ్రతలు స్వైన్ ఫ్లూకు కారణమయ్యే హెచ్1ఎన్1 వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తాయని వైద్యులు హెచ్చరించారు. నగర వాసులు స్వైన్‌ఫ్లూపై అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment