బాగా జలుబు చేసినప్పుడు వేడి వేడి చికెన్‌సూప్‌ను చప్పరిస్తూ అలా కాసేపు తాగితే జలుబు తగ్గుతుందనేది చాలాకాలం నుంచి ఉన్న నమ్మకం. అయితే కాస్త ఘాటుగా ఉన్న వేడి వేడి చికెన్‌సూప్‌ను అలా ఆస్వాదించడం వల్ల జలుబు తగ్గిన అనుభూతితో కాస్త ఉపశమనం కలుగుతుంది కానీ... అది వాస్తవం కాదని కొందరంటారు. కానీ చికెన్‌సూప్ జలుబును తగ్గించడమే కాదు... దాని సువాసనలో ఉండే యాంటీ–ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఒనగూరుతాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కాకు చెందిన అధ్యయనవేత్త.
ఇప్పుడిది కేవలం చిట్కా వైద్యం కాదనీ... దీనికి సశాస్త్రీయ ఆధారాలున్నాయని పేర్కొంటున్నారు డాక్టర్ స్టీఫెన్ రెనార్డ్ అనే అక్కడి వైద్యపరిశోధకుడు. బామ్మ చేసే సూప్ అంటూ ‘గ్రాండ్ మా సూప్’ అని పిలిచే ఇందులో ఇన్ఫెక్షన్స్ తో పోరాడే గుణాలున్నట్లు తాను గుర్తించానని చెబుతున్నారాయన, చికెన్ సువాసన (అరోమా)తో సైనసైటిస్ తగ్గుతుందనీ, శ్వాసకోశవ్యవస్థ పైభాగంలో ఏదో అడ్డుకున్నట్లుగా ఉండి గాలి ఆడనట్లుగా ఉండే ఫీలింగ్ కూడా తగ్గుతుందని చెబుతున్నాడు పరిశోధకుడు.
Comments
Please login to add a commentAdd a comment