
♦ కళ్ల కింద ఉబ్బుగా కనిపిస్తుంటే (పఫ్పీ ఐస్) ఇలా చేయండి. వాడిన టీ బ్యాగ్ డీప్ ప్రిజ్‌లో పెట్టి చల్లబడ్డాక ఆ టీ బ్యాగ్‌తో కళ్ల కింద కాపడం పెడుతూ ఉండాలి. కను రెప్పల కింద, పైన ఇలా రెండు వైపులా 5 నుంచి 10 నిమిషాల సేపు చేస్తే ఉబ్బు తగ్గుతుంది.
♦ ముఖ చర్మం మృదువుగా ఉండాలంటే మృతకణాల సంఖ్య తగ్గాలి. దీనికోసం దానిమ్మ రసం, ద్రాక్షరసం టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి. దీంట్లో అర టీ స్పూన్ బాదం నూనె కలిపి బాగా కలిపి చర్మానికి పట్టించి, వేళ్లతో సున్నితంగా మర్దన చేయాలి. దానిమ్మ, ద్రాక్ష రసంలో పులుపు వల్ల మృతకణాలు తగ్గుతాయి. బాదం నూనెలోని ఇ–విటమిన్ వల్ల చర్మం మృదువుగా అవుతుంది.
♦ ముఖ చర్మం పొడిబారి నిస్తేజంగా కనిపిస్తుంటే కొబ్బరి నీళ్లను వేళ్లతో అద్దుకుని మసాజ్ చేసుకోవాలి. సబ్బుతో కాకుండా సోప్ లిక్విడ్ లేదా సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు ముఖచర్మాన్ని పొడిబారనీయకుండా చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment