వేసవి వచ్చిందంటే దాహార్తికి ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లే. కాస్త ఖరీదు ఎక్కువనిపించినా , కార్బోహైడ్రేట్లు, ముఖ్యమైన పోషకాలతో సహజంగా లభించే కొబ్బరి బోండాలు చాలా ఉత్తమం. ఇంకా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ పోషకాలు పుష్కలంగా వీటిల్లో లభిస్తాయి. అయితే మనం కొబ్బరి బోండాలో నీరు ఎంత ఉంది అనేది ఎలా గుర్తుపట్టాలి? ఒకసారి పరిశీలిద్దాం.
వామ్మో.. ఎండ సుర్రుమంటోంది.. దాహం.. కాస్త నీళ్లు ఎక్కువ ఉన్న బోండాం ఇవ్వు బాబు అనగానే.. కొబ్బరి బోండాలు అమ్యే వ్యక్తి ఏం చేస్తాడు? గుర్తుందా? కాయమీద కొట్టి చూస్తాడు.. లేదంటే కాయను పట్టుకొని ఊపి చూస్తాడు కదా. అంతే సింపుల్. దాదాపు మనం కూడా అలాగే చెక్ చేసుకోవచ్చు.
అలాగే సాధారణంగా కొబ్బరికాయ గుండ్రంగా, పెద్దగా ఉంటే అందులో నీరు ఎక్కువగా ఉంటుంది.ఆకుపచ్చ రంగులో కాకుండా, ముదురు గోధుమ రంగులో ఉండే(ఇపుడు మార్కెట్‌లో లభిస్తున్న బెంగళూరు కాదు) ముదిరిన లేదా పండు కొబ్బరికాయలో నీరు తక్కువగా ఉంటుంది. కొబ్బరికాయను తీసి బాగా కదిలించినపుడు కూడా నీటి శబ్దం వినిపిస్తే .. సో అది కూడా తీసుకోవచ్చు.
కొబ్బరి నీళ్లలో కొంచెం తీపి పుల్లని వగరు రుచి ఉంటుంది. త్వరగా పుల్లగా మారిపోతోంది. కాబట్టి తెరిచిన తర్వాత దానిని ఫ్రిజ్‌లో ఉంచి 24 గంటలలోపు తినాలి. అలాగే కొబ్బరి గుజ్జు సాంద్రతను కొలవడానికి టర్బిడిమీటర్‌ను ఉపయోగిస్తారట.ట్రాన్స్‌మిషన్ స్పెక్ట్రోఫోటోమీటర్‌గా, ‘‘విస్తా’’తో కొబ్బరినీళ్లను కొలుస్తారట.
మరో విషయం ఏమిటంటే, ఇపుడు కొబ్బరి బొండాలుగా కాకుండా బాటిళ్లతో అమ్ముతున్నారు కాబట్టి వాటిని తీసుకోవచ్చు. లేదా దుకాణ దారుడి వద్ద మనమే బోండాలు కొట్టించుకుని, బాటిల్‌లో నింపుకోవచ్చు. అయితే ఈ నీళ్లను సాధ్యమైనంత తొందరగా సేవించాలి. లేదంటే పోషకాలు నష్టపోతాం. నిల్వ ఉండటం, పులిసిపోవడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది.
నోట్: కొబ్బరి నీళ్ల రుచి, సాంద్రత, ఎంత ఉన్నాయి, అలాగే గుజ్జు , టేస్ట్ తదితర అంశాలన్నీ ఆయా రకాలను బట్టి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment