measure
-
అప్రమత్తత అంతంత మాత్రమే..ఆడపిల్లల రక్షణ గాలికి!
దాదర్: విద్యార్ధులపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నప్పటికీ అనేక బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) స్కూళ్లలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ ఇంతవరకూ పూర్తికాలేదు. దీంతో విద్యార్ధుల భద్రత ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ గాలికి వదిలేసినట్టైంది సుమారు నాలుగు నెలల కిందట బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడుల ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ముంబైసహా తూర్పు, పశ్చిమ ఉప నగరాల్లో ఉన్న అన్ని బీఎంసీ పాఠశాలల్లోని తరగతి గదుల్లో, కాంపౌండ్, పాఠశాల ఆవరణలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బీఎంసీ పరిపాలనా విభాగం నిర్ణయం తీసుకుంది. కానీ ముంబై సిటీ పరిధిలో ఉన్న బీఎంసీ పాఠశాలల్లో మాత్రమే సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. పశి్చమ, తూర్పు ఉప నగరాల్లోని 356 పాఠశాలల్లో ఇంతవరకు వాటి ఊసే లేదు. నిధుల కొరత వల్ల వాటిని ఏర్పాటు చేయలేదని బీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల భద్రత అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.‘బద్లాపూర్’ఘటనతో మళ్లీ తెరమీదకు... ముంబై, ఉప నగరాల్లో బీఎంసీకి చెందిన ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ఏడున్నర వేలకుపైగా ఉపాధ్యాయులు బీఎంసీ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నారు. వీరిలో పురుషులతో పోలిస్తే మహిళా ఉపాధ్యాయుల సంఖ్య అధికం. దీంతో వారికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత బీఎంసీపై ఉంది. పాఠశాల తరగతి గదుల్లో, కాంపౌండ్‌లో, ఆవరణలో విద్యార్ధులపై లైంగిక దాడులు, వేధింపులు చోటుచేసుకుంటే సీసీ టీవీ కెమరాల్లో రికార్డయిన వీడియో దశ్యాలు నిందితులను గుర్తించడానికి ఎంతో దోహద పడతాయి. దీంతో బీఎంసీకి చెందిన అన్ని పాఠశాలల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బీఎంసీ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన సంఘటనలతో అప్రమత్తమైన బీఎంసీ అన్ని స్కూళ్లలోనూ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్, గత మూడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న బీఎంసీ ఎన్నికలు, ఇతర అనివార్యకారణాలవల్ల కెమెరాల ఏర్పాటు ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. కానీ బద్లాపూర్ ఘటనతో ఈ అంశం మళ్లీ తెరమీదకు రావడంతో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు సలహదారుల కమిటీని నియమించి టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. ఈ ‘ఆర్థిక బడ్జెట్’లో నిధుల మంజూరు? బీఎంసీకి పరిధిలో మొత్తం 479 పాఠశాలుండగా వీటిలో ముంబై సిటీలో ఉన్న 123 పాఠశాలల్లో 2,832 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ నిధుల కొరత వల్ల ఉప నగరాల్లో ఉన్న 356 పాఠశాల్లో మాత్రం ఇంతవరకూ ఏర్పాటు చేయలేదు. చివరకు బీఎంసీ అదనపు కమిషనర్ అమిత్ సైనీ జోక్యం చేసుకుని నిధుల మంజూరుకు ఆదేశించారు. కానీ అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో కోడ్ అమలులోకి వచి్చంది. దీంతో నిధులు మంజూరు ప్రతిపాదన అటకెక్కింది. ఫలితంగా ఉప నగరాల్లోని 356 పాఠశాలల్లో సుమారు ఆరువేల సీసీ టీవీ కెమరాలు ఏర్పాటుచేసే ప్రక్రియ పెండింగులో పడిపోయింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాల తంతు పూర్తయి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. దీంతో ఈ పాఠశాలల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు దాదాపు రూ.54 కోట్లు అవసరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రవేశపెట్టే ఆరి్ధక బడ్జెట్లో నిధులు మంజూరుచేసి పనులు ప్రారంభించాలని బీఎంసీ యోచిస్తోంది. ఇదీ చదవండి: Birthright citizenship : ట్రంప్‌కు షాక్, ఎన్ఆర్ఐలకు భారీ ఊరట -
కొబ్బరి బోండాం నీళ్లు, ఈ లెక్క తెలుసా మీకు!
వేసవి వచ్చిందంటే దాహార్తికి ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లే. కాస్త ఖరీదు ఎక్కువనిపించినా , కార్బోహైడ్రేట్లు, ముఖ్యమైన పోషకాలతో సహజంగా లభించే కొబ్బరి బోండాలు చాలా ఉత్తమం. ఇంకా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ పోషకాలు పుష్కలంగా వీటిల్లో లభిస్తాయి. అయితే మనం కొబ్బరి బోండాలో నీరు ఎంత ఉంది అనేది ఎలా గుర్తుపట్టాలి? ఒకసారి పరిశీలిద్దాం. వామ్మో.. ఎండ సుర్రుమంటోంది.. దాహం.. కాస్త నీళ్లు ఎక్కువ ఉన్న బోండాం ఇవ్వు బాబు అనగానే.. కొబ్బరి బోండాలు అమ్యే వ్యక్తి ఏం చేస్తాడు? గుర్తుందా? కాయమీద కొట్టి చూస్తాడు.. లేదంటే కాయను పట్టుకొని ఊపి చూస్తాడు కదా. అంతే సింపుల్. దాదాపు మనం కూడా అలాగే చెక్ చేసుకోవచ్చు. అలాగే సాధారణంగా కొబ్బరికాయ గుండ్రంగా, పెద్దగా ఉంటే అందులో నీరు ఎక్కువగా ఉంటుంది.ఆకుపచ్చ రంగులో కాకుండా, ముదురు గోధుమ రంగులో ఉండే(ఇపుడు మార్కెట్లో లభిస్తున్న బెంగళూరు కాదు) ముదిరిన లేదా పండు కొబ్బరికాయలో నీరు తక్కువగా ఉంటుంది. కొబ్బరికాయను తీసి బాగా కదిలించినపుడు కూడా నీటి శబ్దం వినిపిస్తే .. సో అది కూడా తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్లలో కొంచెం తీపి పుల్లని వగరు రుచి ఉంటుంది. త్వరగా పుల్లగా మారిపోతోంది. కాబట్టి తెరిచిన తర్వాత దానిని ఫ్రిజ్‌లో ఉంచి 24 గంటలలోపు తినాలి. అలాగే కొబ్బరి గుజ్జు సాంద్రతను కొలవడానికి టర్బిడిమీటర్ను ఉపయోగిస్తారట.ట్రాన్స్మిషన్ స్పెక్ట్రోఫోటోమీటర్గా, ‘‘విస్తా’’తో కొబ్బరినీళ్లను కొలుస్తారట. మరో విషయం ఏమిటంటే, ఇపుడు కొబ్బరి బొండాలుగా కాకుండా బాటిళ్లతో అమ్ముతున్నారు కాబట్టి వాటిని తీసుకోవచ్చు. లేదా దుకాణ దారుడి వద్ద మనమే బోండాలు కొట్టించుకుని, బాటిల్లో నింపుకోవచ్చు. అయితే ఈ నీళ్లను సాధ్యమైనంత తొందరగా సేవించాలి. లేదంటే పోషకాలు నష్టపోతాం. నిల్వ ఉండటం, పులిసిపోవడం వల్ల ఏదైనా అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. నోట్: కొబ్బరి నీళ్ల రుచి, సాంద్రత, ఎంత ఉన్నాయి, అలాగే గుజ్జు , టేస్ట్ తదితర అంశాలన్నీ ఆయా రకాలను బట్టి ఉంటుంది. -
ఉగ్ర గోదావరి కొనసాగుతున్న సహాయక చర్యలు
-
సిక్స్ ప్యాక్.. ఫిట్‌నెస్‌కు చిహ్నం కాదు!
కండలు పెంచినంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్లు కాదంటున్నారు వైద్య నిపుణులు. సిక్స్ ప్యాక్ బాడీ... చూసేందుకు ఫిట్ గా కనిపించినా... శరీర దారుఢ్యంతోపాటు, ఆరోగ్యంకూడ అవసరమని చెప్తున్నారు. ఫిట్నెస్ కోసం తరచుగా జిమ్ లకు వెళ్ళేవారు ట్రెండ్ ను ఫాలో అయ్యేందుకు బాడీ పెంచినా, తగిన ఆహార పద్ధతులను కూడ పాటించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో.. పోషక విలువలున్న ఆహారం కూడ అంతే అవసరమని చెప్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ తారలను, ప్రముఖ బాడీ బిల్డర్లను చూసి.. నేటి యువత సిక్స్ ప్యాక్ ట్రెండ్.. ఫాలో అయిపోతున్నారు. బానపొట్ట, వదులు శరీరం తగ్గించుకొని బాడీ ఫిట్నెస్ కోసం అత్యాధునిక జిమ్ లను ఆశ్రయిస్తున్నారు. కానీ చాలాశాతం వ్యాయామశాలల్లో శిక్షణ ఇచ్చేవారు తమ కస్టమర్లను డబ్బుకోసం తప్పుదారి పట్టిస్తుంటారు. తమ ఆదాయ వనరులను పెంచుకునేందుకు శరీరంలో కొవ్వును తగ్గించేందుకు ఆరోగ్యకరమైన ఆహారానికి బదులుగా మందులను సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించిన ఇద్దరు యువకులు కార్డియాక్ సమస్యతో ఏకంగా ప్రాణాలను సైతం పోగొట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అందుకే ఫిట్నెస్ ప్రియులు కొవ్వును తగ్గించుకునేందుకు ప్రొటీన్ షేక్స్, స్టెరాయిడ్స్ వంటి వాటి జోలికి వెళ్ళవద్దని, ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామం ఫిట్నెస్ పెంచుకునేందుకు మూలాలని నిపుణులు సూచిస్తున్నారు. సిక్స్ ప్యాక్ ఆరోగ్యానికి చిహ్నం కాదని, ప్రకృతికి విరుద్ధంగా ప్రయత్నాలు చేయడం ఎంత మాత్రం సరికాదని ఫిట్నెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వారికిచ్చిన నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయడాని సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించే సినిమా యాక్టర్లను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఫాలో కావొద్దని హెచ్చరిస్తున్నారు. ఫిట్నెస్ ప్రియులు ముఖ్యంగా వారికి సిక్స్ ప్యాక్ అవసరం ఎంతవరకు ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించి, రెండుసార్లు ప్లేట్ లెట్ కౌంట్ తగ్గడంతో ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితికి చేరుకున్నామని, సిక్స్ ప్యాక్ బాడీ కోసం 48 గంటలపాటు నీటికి, ఉప్పుకు దూరంగా ఉండటమేకాక, అదే సమయంలో వర్కవుట్ కూడ చేయాల్సి వస్తుందని అనుభవజ్ఞులు చెప్తున్నారు. అయితే ఇది భవిష్యత్తులో జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతోపాటు, వ్యాయామం చేయాలని సిక్స్ ప్యాక్ అభిమానులకు సలహా ఇస్తున్నారు. ఒకవేళ తప్పనిసరిగా సిక్స్ ప్యాక్ చేయాలనుకుంటే ప్రకృతి సిద్ధమైన ఆహారమే తీసుకోవాలని, ఫలితానికి కొంత సమయం పట్టినా... ఆరోగ్యానికి నష్టం చేకూరదని చెప్తున్నారు. ఫిట్ గా కనిపించాలనుకుంటారే తప్ప... ఫిట్ గా ఉండాలనుకోరని మిస్టర్ ఇండియా రన్నర్ అప్ రాహుల్ రాజశేఖరన్ అంటున్నారు. రెండిటి మధ్య వ్యత్యాసాన్ని గమనించడం ఎంతో అవసరమని చెప్తున్నారు. శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా పనిచేసేందుకు స్త్రీ పురుషులిద్దరికీ కనీసం 15 నుంచి 20 శాతం కొవ్వు అవసరమౌతుందని, అయితే తమకు వృత్తి పరంగా అది సాధ్యం కాకపోవడంతో 5శాతం మాత్రమే కొవ్వు శరీరంలో ఉంటుందని, ఈ పరిస్థితి భవిష్యత్తులోతమకు తీవ్ర నష్టాన్ని కలుగజేయడంతోపాటు సమాజానికి తప్పుడు సందేశాన్ని అందించడం బాధగా అనిపిస్తుందని చెప్తున్నారు. -
చుక్క చుక్కకూ మోసం
పెట్రోల్ బంకుల్లో దగా తూనికలు, కొలతల శాఖ స్పెషల్ డ్రైవ్ వరుసగా ఐదు రోజులు దాడులు అక్రమాల గుర్తింపు సిటీబ్యూరో: కొలతల్లో చేతివాటం... డిస్ప్లేలో దగా... స్టాంపింగ్ లేకుండా నిర్వహణ... ఇదీ గ్రేటర్ హైదరాబాద్‌లోని పెట్రోల్ బంక్‌ల తీరు. తూనికలు, కొలతల శాఖ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తాజాగా ఐదు రోజుల పాటు నిర్వహించిన దాడుల్లో బంకుల అక్రమాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి 11 వరకు దాడులు చేసి... తక్కువ పెట్రోల్ పోయడం... స్టాంపింగ్ లేని 37 బంకులపై కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ గోపాల్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. మొత్తం కేసుల్లో 19 గ్రేటర్లో నమోదయ్యాయి. వీటిలో నగరంలో 8... శివార్లలో 11 బంకులు ఉండటం గమనార్హం. ఏడాది క్రితం స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్వోటీ) పోలీసులు, తూనికలు, కొలతల శాఖ దాడుల్లో ఫిల్లింగ్ మిషన్ల సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేక చిప్‌లు ఏర్పాటు చేయడం... రిమోట్ కంట్రోలింగ్ మోసాల వంటివి బయటపడ్డాయి. అప్పట్లో అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి... జరిమానాలతో సరిపెట్టారు. దీంతో మోసాలకు అడ్డుకట్ట పడలేదు. ప్రతి లీటర్‌కు 20 ఎంఎల్ కోత గ్రేటర్ హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో డీలర్లు భారీగా చేతివాటం చూపుతున్నారు. ప్రతి లీటర్‌కు సగటున 8 నుంచి 20 ఎంఎల్ వరకు తక్కువగా ఉంటోంది. తాజాగా కుత్బుల్లాపూర్‌లో ఐఓసీకి చెందిన విజయా ఫిల్లింగ్ స్టేషన్‌పై అధికారులు దాడులు చేశారు. అక్కడ కొలతల తీరు పరిశీలించి... భారీగా తేడా ఉన్నట్టు గుర్తించారు. ధరలోనూ మాయ పెట్రోల్, డీజిల్ ధరల హెచ్చు, తగ్గుల సమయాల్లోనూ డీలర్లు హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. నేరుగా రిమోట్, కీ ప్యాడ్, హ్యాండిల్ టెర్మినేషన్, మాన్యువల్విధానాల్లో మార్పు చేస్తున్నారు. తూనికల, కొలతల శాఖ నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల పర్యవేక్షణలో మెమోరైజ్డ్ ప్రింటెడ్ మార్పిడి చేయాలి. కానీ ఆయిల్ కంపెనీల నుంచి ధరలకు సంబంధించిన సమాచారం అందగానే డీలర్లు, ఉద్యోగులు అంచనా మేరకు మార్పులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లాక్ ఏదీ? తూనికల, కొలతల శాఖ అధికారులు ఏడాదికోసారి కొలతలను పరిశీలించి... ఫిల్లింగ్ మిషన్‌కు సీల్‌వేసి స్టాంపింగ్ చేస్తారు. దీని కోసం డీలర్లు ఏటా గడువు కంటే పక్షం రోజుల ముందు సంబంధిత శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. తూనికలు, కొలతల శాఖతో పాటు ఆయిల్ కంపెనీల అధికారులు, ఇద్దరు టెక్నీషియన్ల సమక్షంలో కొలతలు పరిశీలించి... స్టాంపింగ్ చేస్తారు. కానీ ఎక్కడా కీ ప్యాడ్లకు లాక్ కనిపించడం లేదు. కేంద్ర తూనికలు, కొలతల చట్టం-2009 సెక్షన్ 22 ప్రకారం బంకులలో రిమోట్ వినియోగించడం నిబంధలకు వ్యతిరేకం. ఇది బాహాటంగా సాగడం అధికారుల తీరుకు అద్దం పడుతోంది.