వేసవిలో కొబ్బరి నీళ్లుకు మించిన డ్రింక్ లేదని చాలామంది దీనికే ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ ఈ కాలంలోని ఎండల తాపం నుంచి బయటడేందుకు కొబ్బరిబోండాలే తోడ్పడతాయి. ఇది దాహార్తిని తీర్చడమే గాక వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. పైగా ఆరోగ్యానికి మంచిది. చర్మానికి మంచి నిగారింపును కూడా ఇస్తుంది. ఈ కొబ్బరి నీటితో ముఖం కడుక్కుంటే కాంతివంతంగా కనిపిస్తుంది. అన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కొబ్బరినీళ్లు వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అలాంటి వాళ్లు అస్సలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
కొబ్బరి నీళ్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువుని అదుపులో ఉంచుతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది కూడా. అలాంటి కొబ్బరి నీళ్లను అతిగా తీసుకుంటే మాత్రం చాలా నష్టాలను ఫేస్ చేయాల్సిందే. ఈ కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అలా అని అతిగా తాగారో అంతే దుష్ప్రభావాలు ఉంటాయిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..
పక్షవాతం..
కొబ్బరి నీళ్లలో సోడియం, పొటాషియం మరియు మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. అందుకే కొబ్బరినీళ్లను పరిమితంగా తీసుకంటే బాడీకి చాలా మంచిది. కానీ దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం పరిమాణం పెరిగి.. పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉంది.
అతిసారం..
కొబ్బరి నీళ్లలో మోనోశాకరైడ్లు, పులియబెట్టే ఒలిగోశాకరైడ్లు మరియు పాలియోల్స్ ఉంటాయి. ఇవి షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్లు. శరీరంలో ఈ మూలకాల పరిమాణం పెరిగితే... అవి బాడీ నుండి నీటిని పీల్చుకోవడం ప్రారంభిస్తాయి, దీని కారణంగా విరేచనాలు, వాంతులు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి కొబ్బరి నీళ్లను రోజూ తాగడం మానేసి అప్పుడప్పుడు మాత్రమే తీసుకోండి.
లో బీపీ రావచ్చు
కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా తాగడం వల్ల బీపీ పడిపోయే అవకాశం ఉంది. దీని వల్ల బాధితుడి ప్రాణం ప్రమాదంలో పడుతుంది.
అలాంటి వాళ్లు..
మధుమేహం ఉన్నవారు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగకూడదు. ఇది చక్కెర మరియు అధిక కేలరీలను కలిగి ఉంటుంది, దీని కారణంగా శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అమితు వీటిలో ఆర్టిఫిషియల్ స్వీట్ కాంపౌండ్స్ లేకపోయినా, కొబ్బరి నీళ్లలో చాలా కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారికి ఇది సమస్యగా మారుతుంది. కాబట్టి, రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే, కొబ్బరి నీళ్లు చాలా మితంగా తాగాలి. బ్లడ్ షుగర్ మందులు తీసుకునేవారికి డేంజర్. అలాగే రక్తపోటుకు సంబంధించి మందులు తీసుకుంటుంటే, కొబ్బరి నీళ్లకు వీలైనంత దూరంగా ఉండాలి. ఈ వ్యాధు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగాలనుకుంటే వైద్యుడిని సంప్రదించి తీసుకోవడం మంచిది.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. అనుసరించాలనుకుంటే మాత్రం వైద్యులను మీ వ్యక్తిగత ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనలు మేరకు అనుసరించడం ఉత్తమం.
(చదవండి: కట్టెల పొయ్యి, బొగ్గుల మీద చేసిన వంటకాలు తినకూడదా?)
Comments
Please login to add a commentAdd a comment