
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ రంగంలో ఉన్న సుగ్న మెటల్స్ ఏడాదిలో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌కు దగ్గరలోని పరిగి వద్ద రూ.30 కోట్లతో నెలకు 10,000 టన్నుల సామర్థ్యంతో టీఎంటీ బార్స్ తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. ఏడాదిలో ఇది కార్యరూపంలోకి వస్తుం దని సంస్థ ఎండీ భరత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. టర్బో ఎఫ్‌ఈ 550 పేరుతో నూతన రకం స్టీల్ బార్స్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
పరిగి వద్ద ఇప్పటికే కంపెనీకి నెలకు 15,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల థెర్మో మెకానికల్లీ ట్రీటెడ్ (టీఎంటీ) బార్స్ తయారీ యూనిట్‌తోపాటు 18,000 టన్నుల బిల్లెట్ల ఉత్పత్తి కేంద్రం ఉంది. ఇప్పటి దాకా రూ.100 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. సంస్థలో 600 మంది ఉద్యోగులు ఉన్నారు. కొత్త యూనిట్‌తో ఈ సంఖ్య 700లకు చేరనుంది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.460 కోట్ల టర్నోవర్ నమోదయ్యిందని డైరెక్టర్ ముదిత్ సొంథాలియా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment