విశాఖ ఉక్కు లాభం రూ.250 కోట్లు | visakhapatnam steel 250 crore Rs .13,527 crore turnover | Sakshi
Sakshi News home page

విశాఖ ఉక్కు లాభం రూ.250 కోట్లు

Published Sun, Apr 6 2014 1:48 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

విశాఖ ఉక్కు లాభం రూ.250 కోట్లు - Sakshi

విశాఖ ఉక్కు లాభం రూ.250 కోట్లు

 సాక్షి, విశాఖపట్నం: 2013-2014 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి మాసాంతానికి వైజాగ్ స్టీల్‌ప్లాంట్ రూ.13,527 కోట్ల టర్నోవర్‌పై రూ.250 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు ప్లాంట్ సీఎండీ మధుసూదన్ ప్రకటించారు. గతేడాది నికర లాభం రూ.353 కోట్లతో పోల్చితే ఇది కొంచెం తక్కువేనన్నారు. అమ్మకాల్లో 8 % వృద్ధిసాధించినట్లు వివరించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ప్లాంట్ పనితీరు వివరించడానికి శనివారం ఆయన విశాఖలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 2013-2014లో సుమారు రూ.11 వేల కోట్ల వ్యయంతో మొదటి దశ కింద 6.3 మిలియన్ టన్నుల ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచామని చెప్పారు. క్యాప్టివ్ విద్యుత్ ఉత్పాదనలో 4%, విదేశీ ఉక్కు ఎగుమతుల్లో 25% వృద్ధి సాధించడం సంతోషంగా ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement