తప్పుడు పత్రాలు, ఫోర్జరీ వే బిల్లులతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఓ స్టీల్ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఏకకాలంలో కంపెనీకి సంబంధించిన కార్యాలయాలు, నివాస స్థలాలో సోదాలు నిర్వహించారు. ఇందులో వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టుగా తేలింది.
స్టీలు కంపెనీ
స్టీల్ తయారీ కంపెనీపై ఐటీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆగస్టు 25న మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పక్కా సమాచారంతో ముంబై, గోవా, పూనేలో ఆ స్టీలు కంపెనీకి సంబంధించిన మొత్తం 44 స్థలాలల్లో ఈ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయని బిజినెస్ టూడే వెల్లడించింది. ఈ దాడుల్లో అనేక బోగస్ పత్రాలు, ఫోర్జరీ వే బిల్లులు కనుగొన్నట్టు తెలుస్తోంది.
రూ.175 కోట్లు
తప్పుడు పత్రాలు, దొంగ బిల్లులు, ఫేక్ ఇన్‌వాయిస్‌ల సాయంతో ఇటు జీఎస్‌టీ, అటూ ఐటీ ట్యాక్స్ రూపేనా మొత్తం రూ. 175 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీని కోసం కొనుగోలు చేయకుండానే ఐరన్ స్కా‍్రప్, స్పాంట్ ఐరన్ కొన్నట్టుగా రూ. 160 కోట్ల విలువైన నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్టు ఆధారాలు లభించాయి. వే బిల్లులకు సంబంధించి వెహికల్‌ట్రాకింగ్ సిస్టమ్ వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
194 కేజీల వెండి
ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ. 3 కోట్ల రూపాయల విలువైన నగదు లభించింది. దీంతో పాటు రూ. 5.20 కోట్ల విలువైన బంగారు నగలతో పాటు రూ. 1.34 కోట్ల విలువ చేసే 194 కేజీల వెండిని కూడా సీజ్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కంపెనీ ప్రతినిధులు ఐటీ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారని, రెయిడ్ మధ్యలోనే ఆపేయాల్సిందిగా బెదిరింపులు వస్తున్నట్టు ఐటీ శాఖకు చెందిన విశ్వసనీయ వ్యక్తులు మీడియాకు సమాచారం అందించారు.
చదవండి : జియో వర్సెస్ ఎయిర్‌టెల్ ! గూగుల్ షాకింగ్ నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment