స్టీల్ డిమాండ్ వృద్ధి అంచనా 5.4 శాతం | steel demand growth 5.4percent | Sakshi
Sakshi News home page

స్టీల్ డిమాండ్ వృద్ధి అంచనా 5.4 శాతం

Published Thu, Apr 14 2016 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 PM

స్టీల్ డిమాండ్ వృద్ధి అంచనా 5.4 శాతం

స్టీల్ డిమాండ్ వృద్ధి అంచనా 5.4 శాతం

న్యూఢిల్లీ: భారత్‌లో స్టీల్ డిమాండ్ పుంజుకోనుంది. ఇది ఈ ఏడాది 5.4 శాతం వృద్ధితో 83.8 మిలియన్ టన్నులకు (ఎంటీ) పెరగొచ్చని వరల్డ్ స్టీల్ అసోసియేషన్(డబ్ల్యూఎస్‌ఏ) అంచనా వేసింది. 2017లోనూ డిమాండ్ ఇదే వృద్ధితో 88.3 ఎంటీలకు చేరుతుందని అభిప్రాయపడింది. తక్కువ ముడి చమురు ధరలు సహా ఇన్‌ఫ్రా వృద్ధికి, దేశీ త యారీ సామర్థ్యం పెంపునకు ప్రభుత్వం తీసుకుంటున్న పలు సంస్కరణలు డిమాండ్ పెరుగుదలకు దోహదపడతాయని వివరించింది. కాగా అంతర్జాతీయంగా స్టీల్ డిమాండ్ ఈ ఏడాది 0.8% క్షీణతతో 1,488 ఎంటీలకు తగ్గొచ్చని అంచనా వేసింది. ఇక 2017లో ఈ డిమాండ్ మళ్లీ పుంజుకొని 0.4% వృద్ధితో 1,494 ఎంటీలకు పెరగొచ్చని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement