జాతీయ రహదారిపై ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే జోగు రామన్న, సిమెంట్ ఫ్యాక్టరీ సాధన కమిటీ సభ్యులు
ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్‌ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని పునఃప్రారం భించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీసీఐ సాధన కమిటీ 44వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించింది. పట్టణ శివారు ప్రాంతంలోని జందాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద చేపట్టిన ఈ కార్యక్రమానికి బీజేపీ మినహా అన్నిపార్టీలు మద్దతు తెలిపాయి. మూడు గంటలపాటు కొనసాగిన ఆందోళనతో నాగ్‌పూర్, హైదరాబాద్ రోడ్డు మార్గాల్లో వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించే వరకు ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశా రు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ, మూత పడిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించడం కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని గతంలో కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పని చేసిన హన్స్‌రాజ్ ప్రకటించారని గుర్తుచేశారు.
అలాగే 2018 ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే సిమెంట్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని ఎంపీ సోయం బాపురావు కూడా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ హామీని నిలబెట్టుకోకుండా బాపురావు సోయి లేకుం డా మాట్లాడుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment