MLA jogu ramanna
-
సీసీఐ ఫ్యాక్టరీ కోసం జాతీయ రహదారి దిగ్బంధం
ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని పునఃప్రారం భించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీసీఐ సాధన కమిటీ 44వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించింది. పట్టణ శివారు ప్రాంతంలోని జందాపూర్ ఎక్స్‌రోడ్డు వద్ద చేపట్టిన ఈ కార్యక్రమానికి బీజేపీ మినహా అన్నిపార్టీలు మద్దతు తెలిపాయి. మూడు గంటలపాటు కొనసాగిన ఆందోళనతో నాగ్‌పూర్, హైదరాబాద్ రోడ్డు మార్గాల్లో వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కేంద్ర ప్రభుత్వం సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించే వరకు ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశా రు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ, మూత పడిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించడం కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని గతంలో కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పని చేసిన హన్స్‌రాజ్ ప్రకటించారని గుర్తుచేశారు. అలాగే 2018 ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే సిమెంట్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని ఎంపీ సోయం బాపురావు కూడా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ హామీని నిలబెట్టుకోకుండా బాపురావు సోయి లేకుం డా మాట్లాడుతున్నారని విమర్శించారు. -
ఐటీ టవర్ జిల్లాకే తలమానికం: జోగు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో నిర్మించే ఐటీ టవర్ జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నా రు. జిల్లా కేంద్రంలో త్వరలోనే ప్రారంభం కానున్న ఎన్టీటీ డాటా సొల్యూషన్స్, బీడీఎన్టీ ల్యాబ్స్ ఐటీ కంపెనీలు జిల్లాకు చెందిన పలువురికి ఉద్యోగాలు కల్పించాయి. ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో వారికి ఎస్పీ ఉదయ్కుమార్రె డ్డితో కలిసి శనివారం నియామక పత్రాలు అం దజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల జిల్లాగా భావించే ఆదిలాబాద్‌లో ఐటీ పరిశ్రమ నెలకొల్పేందుకు ఓ సంస్థ ముందుకు రావడం సంతోషకరమని, జిల్లాకు చెందిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే ఐటీ టవర్ ఏర్పాటవుతోందన్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఐటీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాకు మేలు చేకూరుతుందని, కంపెనీ ప్రతినిధులు సంస్థ ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.