
నియామక పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో నిర్మించే ఐటీ టవర్ జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నా రు. జిల్లా కేంద్రంలో త్వరలోనే ప్రారంభం కానున్న ఎన్టీటీ డాటా సొల్యూషన్స్, బీడీఎన్టీ ల్యాబ్స్ ఐటీ కంపెనీలు జిల్లాకు చెందిన పలువురికి ఉద్యోగాలు కల్పించాయి. ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో వారికి ఎస్పీ ఉదయ్‌కుమార్‌రె డ్డితో కలిసి శనివారం నియామక పత్రాలు అం దజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల జిల్లాగా భావించే ఆదిలాబాద్‌లో ఐటీ పరిశ్రమ నెలకొల్పేందుకు ఓ సంస్థ ముందుకు రావడం సంతోషకరమని, జిల్లాకు చెందిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే ఐటీ టవర్ ఏర్పాటవుతోందన్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఐటీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా జిల్లాకు మేలు చేకూరుతుందని, కంపెనీ ప్రతినిధులు సంస్థ ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment