
కంపాల: ఉగాండా రాజధాని కంపాలలో డంపింగ్‌యార్డులోని మట్టితో కప్పేసిన భారీ చెత్తకుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు. మృతిచెందిన వారిలో చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారు.
వీధుల్లో ప్లాస్టిక్ ఏరుకునే వారు చెత్తకుప్ప కూలిన సమయంలో అక్కడే ఉండటంతో వారు చెత్తకుప్ప కింద పడి మృతి చెందారు. భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో సహాయక చర్యకు వర్షం అడ్డంకిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment