kampala
-
కూలిన భారీ చెత్తకుప్ప..18 మంది మృతి
కంపాల: ఉగాండా రాజధాని కంపాలలో డంపింగ్‌యార్డులోని మట్టితో కప్పేసిన భారీ చెత్తకుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు. మృతిచెందిన వారిలో చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారు.వీధుల్లో ప్లాస్టిక్ ఏరుకునే వారు చెత్తకుప్ప కూలిన సమయంలో అక్కడే ఉండటంతో వారు చెత్తకుప్ప కింద పడి మృతి చెందారు. భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో సహాయక చర్యకు వర్షం అడ్డంకిగా మారింది. -
Telangana: నీళ్లు కష్టం..సాగు నష్టం
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం త్రిపురవరం సమీపంలోని పాలారం మేజర్ కాలువ కంపచెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. దీంతో చివరి ఆయకట్టు గ్రామాలైన త్రిపురవరం, పాలారం, గోండ్రియాల, కొత్తగూడెం, కోదాడ మండలంలోని మంగలి తండాల్లోని దాదాపు 450 ఎకరాల భూములకు నీరు అందడం లేదు. నాలుగైదేళ్లుగా ఇదే దుస్థితి నెలకొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు బోర్లు వేసుకుని, బావులు తవ్వుకుని పంటలు పండించుకుంటున్నారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని గూడూరు శివారులో ఉన్న కిష్టాపురం మేజర్ కాలువ నిర్వహణ లోపంతో కంపచెట్లు, ఇతర మొక్కలు, పూడికతో నిండిపోయింది. ఈ కాలువ కింద మొత్తం 3,361 ఎకరాల ఆయకట్టు ఉండగా నీళ్లు కిందకు రాకపోవడంతో గూడూరు, బోట్యానాయక్ తండా, సిద్ధాపురం తదితర గ్రామాల్లోని దాదాపు 1,800 ఎకరాల్లో సాగు కష్టమవుతోంది.ఖమ్మం జిల్లాలోని బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో 33 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాల్వ కింద బోనకల్ మండలంలోని కలకోట, పోలంపల్లి, లక్ష్మీపురం, రాపల్లిలో మేజర్ కాల్వలు, మరో 16 మైనర్ కాల్వలున్నాయి. వీటి కింద 26 వేల ఎకరాలు సాగవుతున్నాయి. అయితే బ్రాంచ్ కెనాల్ పరిధిలో రెండు కి.మీ. మేర లైనింగ్ సక్రమంగా లేదు. పదేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరి కాల్వ కోతకు గురైంది. పోలంపల్లి కాల్వ నామరూపాలు లేకుండా పోయింది. జాలిముడి, చిరునోముల ప్రధాన రహదారిపై ఉన్న మైనర్ కాల్వతో పాటు ఎర్రుపాలెం మండలంలోని రేమిడిచర్ల కాల్వలో చాలా వరకు మొక్కలు పెరిగిపోయాయి.సాక్షి ప్రతినిధులు నల్లగొండ/ఖమ్మం: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని నాగార్జునసాగర్ కాలువల కింద చివరి భూములకు నీరందడం కష్టంగా మారుతోంది. చివరి భూములకు సైతం నీరందిస్తామని ప్రజా ప్రతినిధులు పదేపదే ఇస్తున్న హామీలు అమలుకు నోచుకోవడం లేదు. ఏటా పంట చేతికి వచ్చే సమయానికి నీరందకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాల్వల నిర్వహణ సరిగా లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని స్పష్టం చేస్తున్నారు.నల్లగొండ జిల్లాలో డిస్ట్రిబ్యూటరీ కాలువలకు లైనింగ్ లేకపోవడంతో కంపచెట్లు పెరిగి కాలువలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కాల్వలకు గండ్లు పడ్డాయి. ఖమ్మం జిల్లాలో గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మెయిన్ కెనాల్‌ను ఆధునీకరించారు. అయితే మేజర్, మైనర్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మధిర మండలాల్లోని కాల్వలకు ఏళ్లుగా మరమ్మతు చేయలేదు. రెండు జిల్లాల్లోనూ పూడిక సమస్య ఉంది. దీంతో అనేకచోట్ల చివరి భూములకు నీరందడం లేదు. మరికొన్ని చోట్ల రావాల్సిన నీళ్లు రావడం లేదు. దీంతో పంటలు సరిగా పండక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.ఉమ్మడి నల్లగొండలో..నాగార్జునసాగర్ ఎడమకాల్వ పరిధిలోని మేజర్ కాల్వలు అధ్వానంగా మారాయి. జిల్లాలో ఎడమకాలువ పరిధిలో మొత్తం 54 మేజర్లు ఉండగా నల్లగొండ జిల్లాలో 30, సూర్యాపేట జిల్లాలో 24 మేజర్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో మేజర్ల కింద 98,030 ఎకరాలు, 31 ఎత్తిపోతల పథకాల కింద 47,690 ఎకరాల సాగు భూమి ఉంది. సూర్యాపేట జిల్లాలో మేజర్లు ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 2.35 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.కాల్వలు సరిగా లేకపోవడంతో ఒక్కొక్క మేజర్‌కు వంద క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్ధ్యం ఉన్నప్పటికీ కాల్వ కట్టలు బలహీనంగా ఉండి పూడిక, కంపచెట్లు పేరుకుపోవడంతో ప్రస్తుతం 60 క్యూసెక్కుల నీటిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తున్నారు. దీంతో చివరి భూములకు నీరందడం లేదు. 2010లో దాదాపు రూ.4,444కోట్లతో ఎడమ కాలువ ఆధునీకరణ పనులు చేపట్టినా, నిధులు సరిపోక అన్ని మేజర్లు, లింక్ కాల్వలకు లైనింగ్, ఫ్లోరింగ్ చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. కాలువల నిర్వహణ లేకపోవడంతో 2022లో నిడమనూరు సమీపంలో సాగర్ ఎడమ కాలువకు గండి పడగా ఇటీవల హాలియా సమీపంలోని మారెపల్లి వద్ద వరద కాలువకు గండిపడి కిందకు సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొంది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లాలో 2.54 లక్షల ఎకరాల మేర సాగర్ ఆయకట్టు ఉండగా.. గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో మెయిన్ కెనాల్‌ను ఆధునీకరించారు. అయితే మేజర్, మైనర్ కాలువలు డిస్ట్రిబ్యూటరీలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మధిర మండలాల్లోని కాల్వలకు ఏళ్లుగా మరమ్మతు చేయలేదు. దీంతో చివరి ఆయకట్టు రైతాంగం పంట చేతికి వచ్చే సమయాన నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతు న్నాయి.జిల్లాలో సాగర్ కాల్వల మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మండలాల్లో సాగర్ కాల్వలు ఉండగా, కొన్ని కాల్వల్లో పూడిక పేరుకుపోవడంతో పాటు మొక్కలు మొలిచాయి. ఓఅండ్ఎం పనులు అంతంతే..ఏటా వానాకాలం సీజన్‌కు ముందు కాల్వల్లో జలవనరుల శాఖ అధికారులు ఓఅండ్ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) పనులు చేపట్టాలి. చెత్తా చెదారం, మొక్కలు, పూడిక తొలగించాలి. అవసరమైన మరమ్మతులు చేయాలి. రైతుల అవసరాలతో పాటు సంబం«ధిత ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రతిపాదనల మేరకు పనుల అంచనాలు రూపొందిస్తారు. అయితే ఈ ఓఅండ్ఎం పనులు సరిగా సాగడం లేదు. 2023–24లో ఖమ్మం జిల్లాలో 106 పనులకు రూ.20.14 కోట్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ.3.52 కోట్ల విలువైన 35 పనులు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. ఇక 2024–25లో ఈ పనులు అసలు ప్రారంభమే కాలేదు.నారుమడి ఎండిపోయేలా ఉందికాల్వలు పూడుకునిపోయి కంప చెట్లు మొలిచాయి. మరమ్మతులు లేక బలహీ నంగా ఉన్న కాల్వ కట్టలు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తే తెగిపోయే పరిస్థితి ఉంది. నాకున్న ఏడెకరాల పొలానికి నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. వేసిన నారుమడి ఎండిపోయే దశకు వచ్చింది. – మేక రాంబాబు, కిష్టాపురం, ఉమ్మడి నల్లగొండ జిల్లాచెత్తా చెదారంతో నీళ్లు రావడం లేదులింగగరి మేజర్ కాలువ చెత్తా చెదారంతో నిండి పోయింది. కంపచెట్లు పెరగ డంతో నీరు సరిగా రావడం లేదు. ప్రస్తు తం వదిలిన సాగర్ నీరు ఈ కాలువలోకి వచ్చే సరికి ప్రవాహ వేగం తగ్గిపోతోంది. దీంతో కింది గ్రామాల పొలాలకు నీళ్లు సరిగ్గా అందడం లేదు. – రామిశెట్టి రాము, రైతు, హుజూర్నగర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాగత ఏడాది రూ.50 వేల నష్టంమాకు మీనవోలు రెవెన్యూలో ఆరు ఎకరా ల భూమి ఉంది. గతేడాది పత్తి సాగు చేశాం. సాగర్ నీరు చుక్క కూడా రాకపో వడంతో దిగుబడి తగ్గి రూ.50 వేలకు పైగా నష్టం వచ్చింది. ఈ ఏడాది మిర్చి సాగుకు సిద్ధమయ్యాం. పక్కనే సాగర్ కాల్వ ఉన్నా గంటల సమయం వేచి ఉన్నా నీరు వచ్చే పరిస్థితి లేదు. –రామిశెట్టి సుజాత, రైతు, మీనవోలు, ఎర్రుపాలెం, ఖమ్మం జిల్లా -
Maldives Row: మాల్దీవులు-భారత్ విదేశాంగ మంత్రుల కీలక భేటీ
కంపాలా: మాల్దీవులు-భారత్ మధ్య వివాదం నడుస్తున్న వేళ ఇరుదేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఉగాండ రాజధాని కంపాలాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై చర్చించారు. శుక్రవారం ప్రారంభమయ్యే నాన్-అలైన్డ్ మూవ్మెంట్(NAM) రెండు రోజుల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఇరువురు నేతలు కంపాలాకు వెళ్లారు. ఈ సందర్భంగా భారతదేశంతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని మూసా జమీర్ స్పష్టం చేశారు. నామ్ సమ్మిట్‌లో భాగంగా జైశంకర్‌ని కలవడం ఆనందంగా ఉందని మూసా జమీర్ ట్విట్టర్(ఎక్స్) లో తెలిపారు. మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ, అలాగే తమ దేశంలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించినట్లు పేర్కొన్నారు. సార్క్, నామ్ల సహకారంపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. భారతదేశంతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. Met Maldives FM @MoosaZameer today in Kampala. A frank conversation on 🇮🇳-🇲🇻 ties. Also discussed NAM related issues. pic.twitter.com/P7ResFlCaK — Dr. S. Jaishankar (@DrSJaishankar) January 18, 2024 మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ చైనా అనుకూల విధానాలను అనుసరిస్తున్నారు. నవంబర్‌లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత సైనిక సిబ్బందిని మాల్దీవుల నుంచి తరిమివేస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. దానికితోడు ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద ట్వీట్లు చేయడం.. భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు ఒత్తిడికి గురయ్యాయి. మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మార్చి 15వరకు గడువు కూడా విధించారు. ఈ సందర్భంగా ఇరుదేశాల నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: హౌతీలపై భూతల దాడులకు యెమెన్ పిలుపు -
వయసు 75 ఏళ్లు.. 80 మంది ప్రాణాలు తీసింది
కంపాలా(ఉగాండా): ఒకప్పుడు అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ పేరు చెబితే పాశ్చాత్య దేశాలు, అమెరికాకు వెన్నులో వణుకు పుట్టేది. అయితే ఉగాండాలోని విక్టోరియా సరస్సులో ఉండే ఒసామా బిన్ లాడెన్ అనే ఓ మొసలి(75) అక్కడి పిల్లలకు, పెద్దలకు దశాబ్దాలపాటు వెన్నులో వణుకు పుట్టించింది. ఒసామా 1991 నుంచి 2005 మధ్య కాలంలో దాదాపు 16 భారీ సరిసృపాలను తినేసింది. అంతేకాకుండా లుగాంగా అనే గ్రామంలోని జనాభాలో పదోవంతు మంది కనిపించకుండా పోయారు. కొన్ని నివేదికల ప్రకారం.. ఒసామా ఇప్పటివరకు గ్రామంలోని 80 మందికి పైగా స్థానికులను పొట్టన బెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఫిషింగ్ బోట్ల క్రింద దాక్కుని సరస్సులో నీటి కోసం వచ్చే పిల్లలను పట్టుకునేదని స్థానికుల కథనం. ఇక మత్స్యకారులు వేటకు బయలు దేరినప్పుడు వారిపై దాడి చేసి చంపేసేది. భయానక ఘటన: పాల్ కైవాల్యాంగా మాట్లాడుతూ.. “మేము చేపలు పడుతున్నాం. అయితే ఓ రోజు ఒసామా నీటిలో నుంచి పడవలో దూకింది. దాంతో నేను కూర్చున్న పడవ వెనుక భాగం మునిగిపోయింది. ఆ భయంకరమైన మొసలి నా తమ్ముడు పీటర్ కాళ్లను పట్టుకుని నీటిలోకి ఈడ్చుకుపోయింది. పీటర్ అరుస్తూ ఐదు నిమిషాల పాటు దానితో పోరాడాడు. అతన్ని కాపాడటానికి నేను ఎంత ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. కొన్ని రోజుల తరువాత అతని తల, చెయ్యి నీటిలో తేలుతూ కనిపించాయి.’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా గ్రామస్తులు 2005లో అధికారులను సహాయం కోరారు. 50 మంది స్థానిక పురుషులు, వన్యప్రాణి అధికారుల సహాయంతో ఆ భారీ మొసలిని పట్టుకున్నారు. ఇంకా ఉంది: అయితే ఒసామా కథ అక్కడితో ముగిసిపోలేదు. గ్రామస్తులు ఆ మొసలిని వెంటనే చంపాలని అనుకున్నారు. కానీ ఉగాండాలో దీనికి అనుమతి లేదు. ఒసామాకు కూడా జీవించే హక్కు ఉందని, శిక్షగా చంపలేమని అధికారులు తెలిపారు. చంపకుండా ఈ మొసలిని ఉగాండాలోని మొసళ్ల పెంపకం కేంద్రానికి ఇచ్చారు. ఈ మొసలి ద్వారా కలిగే సంతానం తోలుతో హ్యాండ్‌బ్యాగులు తయారు చేసి ఇటలీ, దక్షిణ కొరియాకు ఎగుమతి చేయవచ్చని భావించారు. కాగా ఒసామా వచ్చినప్పటి నుంచి ఈ సంతానోత్పత్తి కేంద్రం పర్యాటకులతో రద్దీగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం 5000 మొసళ్ల దాకా ఉన్నాయి. చదవండి: హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి.. మరో 132 మంది -
వచ్చే ఏడాది మే 31వ తేదీలోగా ఖాళీ చేయండి
న్యూఢిల్లీ: ముంబైలోని క్యాంపాకోలా భవనంలో అనుమతి లేకుండా నిర్మించిన అంతస్తుల్లో నివసిస్తున్నవారు వచ్చే ఏడాది మే 31వ తేదీలోగా ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ప్రత్యామ్నాయ పరిష్కారం కనుగొనేందుకు నిర్దిష్ట ప్రతిపాదన ఏదీ ఇవ్వలేమని అటార్నీ జనరల్ జి.ఇ. వాహనవతి విచారణ సందర్భంగా జస్టిస్ జి.ఎస్.సింఘ్వి నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేసింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం పైవిధంగా ఆదేశాలు జారీచేసింది. అయితే అక్రమ అంతస్తుల్లో నివసించేవారికి ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాధిత కుటుంబాలకు శాశ్వత పరిష్కారం ఏదైనా సూచించాలని అటార్నీ జనరల్ జి.ఇ. వాహనవతి ఈ సందర్భంగా ధర్మాసనాన్ని కోరారు. ఇదిలాఉండగా కొద్దిరోజుల క్రితం ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో బాధిత కుటుంబ యజమానులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు సంబంధించి ఏదైనా ప్రతిపాదనను తమకు సమర్పించాలని అటార్నీ జనరల్ జి.ఇ. వాహనవతికి సుప్రీంకోర్టు సూచించిన సంగతి విదితమే. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేదీన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు, సిబ్బంది క్యాంపాకోలా భవనంలోని అక్రమ అంతస్తులను కూల్చివేసేందుకు రంగంలోకి దిగారు. బాధితుల ఆక్రందనలను మీడియాలో గమనించి అదే రోజు సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం సదరు ప్రక్రియపై స్టే ఇచ్చిన సంగతి విదితమే. హౌసింగ్ బిల్లును ఆమోదించండి ముంబై: గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అభ్యర్థించారు. క్యాంపాకోలా భవన వివాదం నేపథ్యంలో ఈ మేరకు ఆయన ఇటీవల రాష్ర్టపతికి ఈ మేరకు ఓ లేఖ రాశారు. గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం ప్రతిపాదించిన మహారాష్ట్ర హౌసింగ్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లును 2012లో రాష్ట్ర శాసనసభ ఆమోదించిందని ఆ లేఖలో చవాన్ తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన లావాదేవీలు నిబద్ధతతో కూడుకున్నవిగా ఉండేలా చేసేందుకే తమ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించిందన్నారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) నిబంధనలతోపాటు అభివృద్ధి నియంత్రణ (డీసీ) నియమాలను ఎవరూ ఉల్లంఘించకుండా చేసేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో క్యాంపాకోలా భవ నంలోని అక్రమ అంతస్తుల్లో నివసిస్తున్న బాధితులు ప్రత్యామ్నాయానికిగల అవకాశాలపై దృష్టి సారించారు. వారు తీర్పు ప్రతికోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై సదరు భవనంలో నివసిస్తున్న నందినీ మెహతా అనే బాధితురాలు మాట్లాడుతూ ఈ ఫ్లాట్లపై తాము ఆశలు వదిలేసుకున్నామన్నారు. ఏదో ఒక పరిష్కారం కోసం న్యాయనిపుణులను సంప్రదిస్తామన్నారు.