
PC: PCB/ICC
ఉగాండా క్రికెట్ జట్టు ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన క్రమంలో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ట్రెండింగ్‌లోకి వచ్చాడు. ఇకపై తనను జింబాబర్ అని కాకుండా.. బగాండా ఆజం అని పిలవాలని కోరతాడేమో అంటూ నెటిజన్లు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మేరకు ఈ మాజీ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌పై పెద్ద ఎత్తున మీమ్స్ షేర్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.
కాగా జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ మొదలుకానున్న విషయం తెలిసిందే. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఆఫ్రికా దేశం ఉగాండా తొలిసారి క్వాలిఫై అయింది. ఆఫ్రికా రీజినల్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం రువాండాను.. తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి వరల్డ్‌కప్ టోర్నమెంట్లో అడుగుపెట్టింది.
ఈ నేపథ్యంలో ఉగాండా గెలుపును పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంతో ముడిపెట్టి నెటిజన్లు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. కాగా వరల్డ్ క్లాస్ బ్యాటర్‌గా పేరొందిన బాబర్.. పసికూనలు నేపాల్, జింబాబ్వేలపై మాత్రమే ప్రతాపం చూపిస్తాడనే అపవాదు ఉంది.
ఆసియా కప్ టోర్నీలో భాగంగా నేపాల్ మీద 151 పరుగులు చేసిన బాబర్.. జింబాబ్వే తో మ్యాచ్‌లలోనూ రెండుసార్లు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో పటిష్ట జట్లతో మ్యాచ్‌లలో బాబర్ విఫలమైనపుడల్లా అతడిని జింబాబర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం పరిపాటిగా మారింది.
తాజాగా ఉగాండా కూడా వరల్డ్ కప్ రేసులోకి రావడంతో బాబర్ పండుగ చేసుకోవడం ఖాయమంటూ సెటైర్లు పేలుస్తున్నారు. నేను ఇక మరో వేటకు సిద్ధం కావాల్సిందే.. ఇకపై నేను జింబాబర్ కాదు.. బగాండా ఆజం అయిపోతా అని అంటున్నట్లుగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. బాబర్ షికారుకు మరో పసికూన బలికావడం లాంఛనమే అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు.
కాగా వచ్చే ఏడాది జరుగనున్న పొట్టి క్రికెట్ సమరంలో ఏకంగా 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ మెగా టోర్నీకి ఇప్పటికే 12 జట్లు నేరగా అర్హత సాధించాయి.
Uganda qualified for T 20 world cup 2024
— Desi Bhayo (@desi_bhayo88) November 30, 2023
Babar Azam pic.twitter.com/gGcRIB09iq