
జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్‌ఏ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం ఉగాండ జట్టును నిన్న (మే 6) ప్రకటించారు. ప్రపంచకప్‌కు తొలిసారి సాధించిన ఈ జట్టుకు బ్రియాన్ మసాబా సారథ్యం వహించనున్నాడు. మసాబాకు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) రియాజత్ అలీ షా తోడ్పడనున్నాడు.
ఈ జట్టులో 43 ఏళ్ల స్పిన్ బౌలర్ ఫ్రాంక్ న్సుబుగాకు అనూహ్యంగా చోటు దక్కింది. ప్రపంచకప్ కోసం ప్రకటించిన ఉగాండ జట్టులో 2023 ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ నామినీ అల్పేశ్ రాంజానీ కూడా ఉన్నాడు. ప్రపంచకప్‌లో ఉగాండ జర్నీ జూన్ 3న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది.
ఉగాండ జట్టు వెస్టిండీస్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో కలిసి గ్రూప్-సిలో పోటీపడనుంది. ఉగాండ క్వాలిఫయర్స్‌లో తమకంటే చాలా రెట్లు పటిష్టమైన జింబాబ్వేకు షాకిచ్చి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
టీ20 వరల్డ్‌కప్ కోసం ఉగాండ జట్టు..
బ్రియాన్ మసాబా (కెప్టెన్), సైమన్ స్సేసాజి, రోజర్ ముకాసా, కాస్మాస్ క్యూవుటా, దినేష్ నక్రానీ, ఫ్రెడ్ అచెలం, కెన్నెత్ వైస్వా, అల్పేష్ రాంజానీ, ఫ్రాంక్ న్సుబుగా, హెన్రీ సెనియోండో, బిలాల్ హసున్, రాబిన్సన్ ఒబుయా, రియాజత్ అలీ షా (వైస్ కెప్టెన్, జుమా మియాజీ, రోనక్ పటేల్.
ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఇన్నోసెంట్ మ్వెబాజ్, రోనాల్డ్ లుటాయా