: ఉగాండా దేశంలో దుండగులు జరిపిన కాల్పుల్లో హన్మకొండ రెడ్డికాలనీకి చెందిన దాస రి రఘరామ్(27) ఆదివారం మృతి చెందాడు. బంధువులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం వివరాలిలా ఉన్నాయి. రెడ్డికాలనీకి చెందిన దాసరి సాంబయ్య, అనసూయ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు రఘురామ్ ఉద్యోగ నిమిత్తం ఏడాదిన్నర క్రితం ఉగాండా దేశానికి వెళ్లి అక్కడ నెట్‌వర్స్ సెక్యూరిటీస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి డబ్బు కోసం కొంతమంది దుండగులు రఘురామ్‌ను బెదిరించి దారుణంగా కాల్చి చంపారు. కాగా, ఆదివారం ఉదయం రఘురామ్ మృతిచెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, ముదిరాజ్ మహా సభ జిల్లా అధ్యక్షుడు పి. అశోక్ ఆదివారం మ ధ్యాహ్నం రఘురామ్ ఇంటికి చేరుకుని ఆయ న కుటుంబ సభ్యులను పరామర్శించారు. రఘురామ్ మృతదేహాన్ని ఇక్కడికి త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు.
Published Mon, Nov 11 2013 10:21 AM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement