కంపాలా: ఉగాండాలో క్రిస్మస్ సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. ఒక గ్రామానికి చెందిన ఫుట్‌బాల్ టీం సభ్యులు, అభిమానులు పడవలో క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటుండగా పడవ నదిలో మునిగింది. ఆదివారం లేక్ ఆల్బర్ట్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 30 మంది మరణించినట్లు పోలీస్ కమాండర్ జాన్ రుటాగిరా చెప్పారు. ‘పడవలో సామర్థ్యానికిమించి 45 మంది ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది డ్యాన్స్ చేస్తుండగా, మరికొంతమంది మద్యం తాగుతున్నారు. ఒక్కసారిగా అందరూ ఒకేవైపునకు వెళ్లడంతో పడవ తిరగబడింది’ అని చెప్పారు. 15 మందిని రక్షించారు.