43 ఏళ్ల ఉగాండ బౌలర్ ఫ్రాంక్ న్సుబుగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అతి తక్కువ ఎనాకమీతో (1.00) పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పపువా న్యూ గినియాతో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో ఫ్రాంక్.. 4 ఓవర్ల స్పెల్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతని స్పెల్‌లో ఏకంగా 2 మెయిడిన్ ఓవర్లు ఉండటం మరో విశేషం.
టీ20 వరల్డ్‌కప్ టోర్నీల చరిత్రలో అతి తక్కువ ఎకానమీతో 4 ఓవర్ల స్పెల్ పూర్తి చేసిన బౌలర్ల వివరాలు..
ఫ్రాంక్ న్సుబుగా (ఉగాండ)- 1.00
అన్రిచ్ నోర్జే (సౌతాఫ్రికా)- 1.75
అజంత మెండిస్ (శ్రీలంక)- 2.00
మహ్మదుల్లా (బంగ్లాదేశ్)- 2.00
హసరంగ (శ్రీలంక)- 2.00
కాగా, గయానా వేదికగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఉగాండ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఉగాండ.. పీఎన్‌జీని 77 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూల్చింది. ఉగాండ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేసి పీఎన్‌జీ బ్యాటింగ్ లైనప్‌ను మడత పెట్టారు.
ఫ్రాంక్ న్సుబుగా (4-2-4-2), అల్పేశ్ రాంజానీ (4-1-17-2), జుమా మియాగి (4-0-10-2), కోస్మాస్ క్యేవుటా (3.1-0-17-2), కెప్టెన్ మసాబా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. పీఎన్‌జీ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. వీరిలో హిరి హిరి (15) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనిపించింది. అయితే రియాజత్ అలీ షా (33), జుమా మియాగి (13) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఉగాండను గెలిపించారు.
వీరిద్దరు ఓ మోస్తరుగా రాణించడంతో ఉగాండ 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పీఎన్‌జీ బౌలర్లలో అలెయ్ నావ్ (4-0-16-2), నార్మన్ వనువా (4-0-19-2), చాడ్ సోపర్ (4-0-13-1), అస్సద్ వలా (2-0-10-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment