1/16
2/16
భారత సంతతికి చెందిన స్విస్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరున్న పంకజ్ ఓస్వాల్ కూతురు వసుంధర ఓస్వాల్(26).
3/16
ఇటీవల తన కూతురును అక్రమంగా ఉగాండా పోలీసులు అరెస్టు చేశారని పంకజ్ ఆరోపించారు.
4/16
వెంటనే వసుంధరను విడుదల చేయాలని కోరుతూ ఉగాండా అధ్యక్షుడికి లేఖ రాశారు.
5/16
ఆమెను అరెస్టు చేసి తన ప్రాథమిక హక్కులను హరించారని చెప్పారు.
6/16
కనీసం కుటుంబ సభ్యులను కూడా కలవడానికి అనుమతించడం లేదన్నారు.
7/16
వసుంధర ఓస్వాల్ పీఆర్‌ఓ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
8/16
ఆమె తన ఆఫీస్‌లో పని చేసిన మాజీ ఉద్యోగిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో తనను అరెస్ట్ చేసినట్లు ఉగాండా పోలీసులు తెలిపారు.
9/16
కార్పొరేట్, రాజకీయ అవకతవకల ఆరోపణలతో కొందరు అధికారులు సరైన విచారణ జరపకుండా ఆమెను నిర్బంధించారని పంకజ్ తెలిపారు.
10/16
స్విస్ నుంచి తనను ఉగాండా పంపి పెద్ద తప్పు చేశామన్నారు.
11/16
ఆమె కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి టాంజానియాలో సజీవంగానే ఉన్నారని పంకజ్ తెలిపారు.
12/16
వసుంధరను బందీగా ఉంచారనే దిగులుతో ఆమె తల్లిదండ్రులు స్విస్‌లో అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లారని వసుంధర చెల్లి రిద్ది ఓస్వాల్ చెప్పారు.
13/16
14/16
15/16
16/16