ఇండియన్ ఫ్యామిలీ చేతికి అద్భుతమైన విల్లా.. ధర ఎన్ని కోట్లంటే?
భారతీయ సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్, అతని భార్య రాధిక ఓస్వాల్ ఇటీవల స్విట్జర్లాండ్‌లో కోట్ల రూపాయల భవనం కొనుగోలు చేశారు. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన విల్లాలలో ఒకటి కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
స్విట్జర్లాండ్‌లోని గింగిన్స్ గ్రామంలోని పిక్చర్స్క్యూ వద్ద 4.3 లక్షల చదరపు అడుగుల ఈ విల్లాను వారు సొంత చేసుకున్నారు. ఈ భవనం ఖరీదు 200 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 1649 కోట్లు. ఇది ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన టాప్ 10 భవనాల్లో ఒకటి అని నివేదికలు చెబుతున్నాయి.
ఈ విల్లా ఒకప్పుడు గ్రీకు షిప్పింగ్ మాగ్నెట్ అరిస్టాటిల్ ఒనాసిస్ కుమార్తె 'క్రిస్టినా ఒనాసిస్' యాజమాన్యంలో ఉండేది. అయితే దీన్ని ఓస్వాల్ కుటుంబం కొనుగోలు చేసిన తరువాత రీడిజైన్ చేసింది. ఈ రీడిజైన్ బాధ్యతలను ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ జెఫ్రీ విల్కేస్కు అప్పగించారు. ఈ విల్లా భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని, అదే సమయంలో విశ్వసౌందర్యాన్ని నిలుపుకోవాలని చెబుతూ తమకు అప్పగించారని డిజైనర్ జెఫ్రీ విల్కేస్ అన్నారు.
ఈ విల్లాలో ఒక ప్రైవేట్ జిమ్, స్పా, వెల్నెస్ వింగ్, పెద్ద ఫ్రెంచ్ కిటికీలు ఉన్నాయి. ఈ భవనం చుట్టూ తోటలు మంచుతో కప్పబడిన పర్వతాలు ఉన్నాయి. ఇది చూడటానికి ఒక అద్భుతమైన రాజ సౌధం మాదిరిగా కనిపిస్తుంది.
(ఇదీ చదవండి: చైనా మిలియనీర్ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. 56 ఏళ్ల వయసులో..)
ఇక పంకజ్ ఓస్వాల్ విషయానికి వస్తే.. ఈయన 2016లో మరణించిన ఓస్వాల్ ఆగ్రో మిల్స్ అండ్ ఓస్వాల్ గ్రీన్‌టెక్ వ్యవస్థాపకుడు పారిశ్రామికవేత్త 'అభయ్ కుమార్ ఓస్వాల్' కుమారుడు. తండ్రి మరణించిన తరువాత కంపెనీ బాధ్యతలను పంకజ్ ఓస్వాల్ స్వీకరించాడు. కంపెనీ పరిధిలో పెట్రోకెమికల్స్, రియల్ ఎస్టేట్, ఎరువులకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయి.
(ఇదీ చదవండి: స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్‌పై ఇంకా అనుమానం ఉందా? ఇదిగో క్లారిటీ!)
View this post on Instagram
A post shared by RIDI (@realridi)
పంకజ్ ఓస్వాల్ మన దేశంలో ఉన్న మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత రాధికా ఓస్వాల్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వారికి వసుందర ఓస్వాల్, రిధి ఓస్వాల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2013లో ఓస్వాల్ కుటుంబం ఆస్ట్రేలియా నుంచి స్విట్జర్లాండ్‌కు వెళ్లింది.