కంపాలా : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేశాయి. అయితే ఆ కాల్పుల్ని ఘటనను ఉంగాండాలోని ఓ ప్రాంతానికి చెందిన పిల్లలు రీక్రియేట్ చేశారు. ఈ రీక్రియేషన్ వీడియోలో ట్రంప్ పాత్రను పోషించిన బాలుడు తన పిడికిలిని బిగించి ఫైట్ అని నినాదాలు చేయడం మిలియన్ల మందిని ఆకట్టుకోవడం గమనార్హం.
రీక్రియేన్ వీడియోలో ట్రంప్ స్థానంలో ఓ బాలుడు ప్రసంగిస్తుండగా.. కాల్పుల నుంచి బాలుడిని కాపాడేందుకు రక్షణ సిబ్బంది అడ్డుగా నిలబడడం, కాల్పుల తర్వాత ట్రంప్ అన్నట్లుగానే తన పిడికిలిని బాలుడు ‘ఫైట్’..‘ఫైట్’ అంటూ నినాదాలు చేయడం మనకు ఆ వీడియోలో కనిపిస్తుంది.
Ugandan Kids re-enact the Trump Assassination Attempt pic.twitter.com/2tck8GNa23
— ɖʀʊӄքǟ ӄʊռʟɛʏ 🇧🇹🇹🇩 (@kunley_drukpa) July 17, 2024
ఆ బాలుడిని కాపాడేందుకు పిల్లలు చెక్క తుపాకుల్ని, వేదిక కోసం చెక్క డబ్బాల్ని వినియోగించారు. ట్రంప్ మాట్లాడిన విధంగా రీక్రియేట్ చేసిన వీడియోలో బాలుడి మాటలు, ఆహభావాల్ని వ్యక్తం చేయడం మరింతగా ఆకట్టుకుంది. మరో వైపు పిల్లల్లో పెరిగిపోతున్న ఈ తరహా ధోరణి పట్ల నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలు ఇలాంటి వాటిని చూసి అనుకరిస్తున్నారు. ఇది నేటి సమాజాన్ని, ప్రవర్తనను ప్రతిభింస్తుందని సోషల్ మీడియా వేదిక కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment