టీ20 వరల్డ్‌కప్ 2024లో భారీ సిక్స్ నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉగండాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ భారీ సిక్స్ కొట్టాడు. అతడు కొట్టిన షాట్‌కు బంతి 107 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం బయటపడింది.
ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన ఫ్రాంక్ న్సుబుగా.. తొలి బంతిని ఆఫ్-స్పిన్నింగ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో ఫ్రంట్ ఫుట్‌కు వచ్చిన పావెల్.. లాంగ్-ఆన్ దిశగా భారీ సిక్స్ బాదాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ పేరిట ఉండేది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ 105 మీట్లర్ల సిక్స్ బాదాడు. తాజా మ్యాచ్‌తో సాల్ట్‌ను పావెల్ అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది.
74 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా.. విండీస్ బౌలర్ల దాటికి కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు.
ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ జాన్సన్ చార్లెస్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్(30 నాటౌట్), పావెల్(23), పూరన్(22) పరుగులతో రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment