
బెంగళూరు : డేటింగ్ యాప్ ఓ టెకీ కొంపముంచింది. సదరు యాప్‌లో పరిచయమైన యువతులు అతడ్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఏకంగా 16 లక్షల రూపాయలు దోచేశారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన టెకీకి డిసెంబర్ 3న ఓ డేటింగ్ యాప్ ద్వారా శ్వేత అనే యువతి పరిచయమైంది. డిజిటల్ పేమెంట్ ద్వారా తనకు 2 వేల రూపాయలు పంపాలని ఆమె టెకీని కోరింది. పేమెంట్ కోసం తన ఫ్రెండ్ నిఖిత నెంబర్ అతడికి ఇచ్చింది. కొద్దిసేపటి తర్వాత నిఖిత టెకీకి నగ్నంగా వీడియో కాల్ చేసింది. అతడు వీడియో కాల్‌లో నగ్నంగా ఉన్న ఆమెను చూశాడు. ( కాలేజీ క్లర్కుతో ఎఫైర్: 21 ఏళ్లుగా.. )
ఈ వీడియో కాల్‌ను ఆమె రికార్డ్ చేసింది. అనంతరం వీడియోను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడింది. ఆమెతో పాటు మరో ఇద్దరు యువతులు ప్రీతి అగర్వాల్, షెరైన్‌లు తాము అడిగినంత డబ్బులు చెల్లించకపోతే వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామంటూ బెదిరించసాగారు. ఇలా అతడి వద్ద నుంచి డిసెంబర్ 3-13 వరకు 10 రోజుల్లో 16 లక్షల రూపాయలు దోచేశారు. దీంతో విసిగెత్తిపోయిన అతడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితురాళ్లపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment