డేటింగ్ యాప్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువకులను కొందరు కిలేడీలు ట్రాప్ చేసి మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఘటనలు జరుగుతున్నాయి. అమాయకుల ఆశనే అసరాగా తీసుకుని.. మాటలతో మాయ చేసి అందిన కాడికి దోచుకుని మాయమవుతున్నారు. మ్మాయిల మోజులో పడి చాలా మంది అబ్బాయిలు తమ జేబులను ఖాళీ చేసుకొని చివరకు పోలీస్ స్టేషన్లకు పరుగెడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోవెలుగుచూసింది.
డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని గాడ్‌ఫాదర్ క్లబ్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు. పలు డేటింగ్ యాప్‌ల ద్వారా అందమైన అమ్మాయిలతో కనెక్టివిటీ చేస్తారు.
అనంతరం అమ్మాయిలు.. అబ్బాయిలను ముగ్గులోకి దింపుతారు. ఫలానా హోటల్‌కు వెళ్దామంటూ తీసుకెళ్తారు. ముందుగా ఆమెకు నచ్చిన పదార్థాలు బుక్ చేసుకుంటుంది. మద్యం హుక్కా, ఖరీదైన ఫుడ్ ఆర్డర్‌చేస్తుంది. ఆర్డర్‌లు వచ్చాక ఇప్పుడే వస్తానంటూ యువతులు మధ్యలో జారుకుంటారు
ఇక బిల్లు చూడగానే గుండె చిల్లు పడినట్లు అవుతుంది. ఏకంగా వేలల్లో బిల్లు రావడం చూసి షాక్ అవుతుంటారు. ఇలా ముంబైలో జరిగిన ఘటనలో పలువురు బాధితులు రూ. 23,000 నుంచి రూ.61, 743 వరకు బిల్లులు కట్టారు. ఒకవేళ బిల్లు కట్టని వారిని క్లబ్ సిబ్బంది, బౌన్సర్లు బెదిరింపులకు పాల్పడతారు. దీంతో భయం, అవమానంతో బిల్లు కట్టేస్తుంటారు. ఇలా ప్రతి రోజూ కొంత మంది అబ్బాయిలు మోసపోతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో మహిళలు 20, 30 నుంచి కమీషన్ పొందుతున్నారని తెలుస్తోంది.
🚨 MUMBAI DATING SCAM EXPOSE 🚨
THE GODFATHER CLUB ANDHERI WEST
◾BRAZEN SCAMMING EVERYDAY
◾12 victims in touch
◾Trap laid through Tinder, Bumble
◾Bill amounts 23K- 61K
◾3 men trapped by same girl@MumbaiPolice @CPMumbaiPolice @mymalishka @CMOMaharashtra@zomato pic.twitter.com/qGOacFCE9f— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) August 23, 2024
ఇలా గాడ్‌ఫాదర్ క్లబ్ మాత్రమే కాదు ముంబైలో పలు క్లబ్‌లు మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ వైరల్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత క్లబ్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. ముందుగా ఈ సంస్థలు పీఆర్ సిబ్బందిని నియమించుకుంటాయి. వారు డేటింగ్ యాప్‌లలో పురుషులను ఎర వేయడానికి యువతులను నియమించుకుంటారు. అబ్బాయిలను ముగ్గులోకి దింపేందుకు ఖరీదైన వస్తువులు లేదా, వ్యక్తిగత ఫోటోలతో ఎరవేస్తారు.
అయితే ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు మరియు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. జూన్‌లో, దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1.2 లక్షల బిల్లులను చెల్లించి ఓ సివిల్ సర్వీస్ అభ్యర్థి కూడా మోసపోయిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment