విశ్లేషణాత్మక అధ్యయనమే విజయ మంత్రం | Analytical study of success mantra | Sakshi
Sakshi News home page

విశ్లేషణాత్మక అధ్యయనమే విజయ మంత్రం

Published Thu, Apr 10 2014 12:18 AM | Last Updated on Fri, Jun 1 2018 7:37 PM

విశ్లేషణాత్మక అధ్యయనమే విజయ మంత్రం - Sakshi

విశ్లేషణాత్మక అధ్యయనమే విజయ మంత్రం

 ఎన్. విజయేందర్ రెడ్డి
 జనరల్ అవేర్‌నెస్ ఫ్యాకల్టీ,
 హైదరాబాద్.
 
 ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్,  ఇతర సెంట్రల్ సర్వీసుల  (గ్రూప్ ఏ, గ్రూప్ బీ) కోసం  నిర్వహించే సివిల్ సర్వీసెస్- 2014 నోటిఫికేషన్ మే 17న  వెలువడనుంది. సివిల్స్  మహాయజ్ఞంలో తొలి అంకమైన  ప్రిలిమ్స్ ఆగస్టు 24న  జరగనుంది. ఈ తరుణంలో  ప్రిలిమ్స్‌లోని పేపర్-1 (జనరల్  స్టడీస్) పరీక్ష విధానం, ప్రశ్నల  తీరు తదితరాలపై ఫోకస్..
 
 దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి వాటికి నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రిలిమ్స్ (ఆబ్జెక్టివ్ విధానం), మెయిన్స్ (రాత పరీక్ష), పర్సనాలిటీ టెస్ట్ (మౌఖిక పరీక్ష) దశలుంటాయి. ప్రిలిమ్స్‌లోని పేపర్ 1 (జనరల్ స్టడీస్)లో వంద ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున మొత్తం 200 మార్కులకు ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. 2011 నుంచి జనరల్ స్టడీస్ ప్రశ్నల సరళిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అంతకుముందు ఈ పేపర్‌లో ఫ్యాక్ట్స్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వచ్చేవి. 2010 పేపర్‌లో వచ్చిన కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం..
 
  Which of the following is/are treated as artificial currency?
a) ADR b) GDR
  c) SDR d) Both ADR and SDR 
Ans: c
n In India, the interest rate on savings accounts in all the nationalised commercial banks is fixed by?
a) Union Ministry of Finance
b) Union Finance Commission
c) Indian Banks Association
d) None of the above
 
 2011 నుంచి జనరల్ స్టడీస్ పేపర్‌లో స్టేట్‌మెంట్స్, మ్యాచింగ్, ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు ఉండే జవాబులు, అసెర్షన్-రీజన్ ప్రశ్నల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రశ్నల సరళి ప్రామాణికంగా, క్లిష్టంగా ఉంటోంది. 
  2013లో వచ్చిన కొన్ని ప్రశ్నలను చూద్దాం..
 
 1. Which of the following bodies does not/do not find mention in the constitution?
1. National Development Council
2. Planning Commission
3. Zonal Councils
n Select the correct answer using the codes given below..
a) 1 and 2 only b) 2 only
c) 1 and 3 only d) 1, 2 and 3
Ans: d
n Which one of the following pairs is correctly matched?
Graphical Feature          Region
a) Abyssinian           Plateau Arabia
b) Atlas Mountains   North Western Africa
c) Guiana Highlands South Western Africa
d) Okavango Basin       Patagonia
Ans: b
n Who among the following constitute the National Development Council?
1. The Prime Minister
2. The Chairman, Finance Commission
3. Ministers of Union Cabinet
4. Chief Ministers of the States
a. 1, 2 and 3 only b. 1, 3 and 4 only
c. 2 and 4 only d. 1, 2, 3 and 4
Ans: b
 
 విశ్లేషణాత్మక దృక్పథం అవసరం:వర్తమాన అంశాల నుంచి డెరైక్ట్ ప్రశ్నలు రావడం లేదు. జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, పర్యావరణం తదితర అంశాలను వర్తమాన అంశాలతో జోడించి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ కోణంలో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఉదాహరణకు భారత్ తాజాగా స్వతంత్ర నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాధన కోసం పీఎస్‌ఎల్‌వీ-సీ24 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ పరిణామానికి సంబంధించి ప్రత్యక్షంగా ప్రశ్నలు రాకున్నా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ఉపయోగా లపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అందువల్ల ఒక సమకాలీన పరిణామంతో సంబంధమున్న అన్ని అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
 
 దినపత్రికల సహకారంతో:
 వర్తమాన వ్యవహారాలపై పట్టు సాధించేందుకు ఇంగ్లిష్ దినపత్రికలు చదువుతూ ముఖ్యాంశాలను రాసుకోవాలి. 2013, ఆగస్టు నుంచి చోటుచేసుకున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను చదవాలి. అంటే పరీక్షకు ఏడాది ముందు నాటి నుంచి వర్తమాన అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ దినపత్రికలను చదవడం వల్ల పేపర్-2లోని వొకాబులరీ, రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగాలకు కూడా ఉపయోగపడుతుంది. 
 
 ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. దీనికోసం ఎన్‌సీఈఆర్‌టీ ఆరు నుంచి 12వ తరగతి వరకు పుస్తకాలను చదవాలి.ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ సిలబస్‌లోని చాలా అంశాలు, మెయిన్స్ రాత పరీక్షలోనూ ఉన్నాయి కాబట్టి రెండు పరీక్షలనూ దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ సాగించాలి. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను డిస్క్రిప్టివ్ కోణంలో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల సబ్జెక్టులోని అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. ఒక అంశం నుంచి ప్రశ్న ఎలా వచ్చినా, సమాధానం గుర్తించే సామర్థ్యం సొంతమవుతుంది.
 
 పర్యావరణం కీలకం:
 పర్యావరణం నుంచి రెండు కోణాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అవి.. కాన్సెప్చువల్, ఫ్యాక్ట్ ఓరియెంటెడ్. కాన్సెప్చువల్ దృక్పథంలో ఏదైనా నిర్దిష్ట సమస్యకు సంబంధించి అన్ని కోణాలను స్పృశించేలా ప్రశ్నలు అడుగుతుండగా.. ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ దృక్పథంలో పర్యావరణ అంశాలకు సంబంధించి ఇటీవల సదస్సులు, సమావేశాలు, నియామకాలు వంటి ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ‘పర్యావరణ కాలుష్యం’ చర్చనీయాంశమైన నేపథ్యంలో దీనిపై మరింత దృష్టి సారించాలి. 
 
 జాతీయ, అంతర్జాతీయ అంశాలు:
 రాజకీయ అంశాల్లో దేశంలో ప్రధానంగా చోటు చేసుకున్న రాజకీయ సంఘటనలను పరిశీలించాలి. రాజ్యాంగ సవరణలు, ప్రభుత్వ కొత్త పథకాలు, కమిటీలు, కమిషన్లు, కొత్త పార్టీల ఏర్పాటు, ఎన్నికల్లో వాటి విజయాలు, సాధించిన స్థానాలు వంటి వాటిని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. అంతర్జాతీయ సదస్సులు, ఒప్పందాలు, వివిధ దేశాల్లోని సంక్షోభ పరిస్థితులు వంటి వాటి గురించి చదవాలి.
 
 ఆర్థిక అంశాలు:
 ప్రిలిమ్స్ పేపర్-1 గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ఎకానమీ సంబంధిత అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. సాధారణంగా అభ్యర్థులు ‘ఎకానమీ పరిధిలోనివి’ అని భావించే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటికి సంబంధించిన నేప థ్యం.. అంటే.. సదరు పథకంపై ప్రభుత్వ విధానాలు, ఆ విధాన రూపకల్పనకు కారణాలు, లక్షిత వర్గాలు, ఆ పథకాల ప్రస్తుత అమలు తీరు, విజయాలు, వైఫల్యాలు తదితర అన్ని కోణాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. మొత్తం ప్రశ్నల్లో ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలే ఉంటున్నాయి.
 పాలిటీలో కూడా పలు కోణాల్లో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కోర్ పాలిటీకి ప్రాధాన్య తగ్గి కాంటెంపరరీ అంశాల అనుసంధానంతో అడిగే ప్రశ్నలు పెరుగుతున్నాయి. కాబట్టి తాజా రాజ్యాంగ సవరణలు, కారణాలు, వాటి వల్ల ఆశించే ఫలితాలు, పర్యవసానాలపై పట్టు సాధించి అడుగులు వేయాలి. 
 
 శాస్త్ర, సాంకేతిక అంశాలు:
 ఇందులో అంతరిక్షం, రక్షణ, పర్యావరణం, ఆరోగ్యం, ఇంధనం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు సంబంధించి చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు గుర్తుంచుకోవాలి. అంతరిక్ష రంగానికి సంబంధించి ఉపగ్రహాలు, వాహక నౌకల ప్రయోగాలు, రక్షణ రంగంలో పరీక్షించిన క్షిపణులు, వాటి పరిధి తదితర అంశాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సూపర్ కంప్యూటర్‌లు, ఇతర సరికొత్త ఆవిష్కరణలు ఉంటాయి. పర్యావరణానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, వివిధ తుపాన్లకు పెట్టిన పేర్లు, భూకంపాల సమాచారం గుర్తుండాలి. ఇంధనం కూడా మరో ప్రధానమైన అంశం. ఇందులో సంప్రదాయేతర, పునర్వినియోగ ఇంధనాలు, సోలార్ మిషన్ వంటివాటి సమాచారం అవసరం ఉంటుంది.
 
 2013 ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్
 అంశం పశ్నల సంఖ్య
 భారత దేశ చరిత్ర, స్వాతంత్రోద్యమం 16
 జాగ్రఫీ 20
 పాలిటీ 17
 ఎకానమీ 18
 ఎకాలజీ 7
 జనరల్ సైన్స్ 22
 
 రిఫరెన్స్:
  ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు (హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్).
  ఇండియా ఇయర్ బుక్, ఎకనమిక్ సర్వే, బడ్జెట్.
  యోజన, కురుక్షేత్ర మేగజీన్లు.
  హిస్టరీ: ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్- బిపిన్‌చంద్ర; మాడర్న్ ఇండియా- బిపిన్‌చంద్ర; హిస్టరీ ఆఫ్ మెడీవల్ ఇండియా- సతీశ్ చంద్ర.
  జాగ్రఫీ: ఆక్స్‌ఫర్డ్ అట్లాస్; సర్టిఫికెట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ- గో చెంగ్ లియోంగ్.
  ఎకానమీ: ఇండియన్ ఎకానమీ- దత్తా అండ్ సుందరమ్; ఇండియన్ ఎకానమీ- మిశ్రా అండ్ పూరి.
  సైన్స్- సైన్స్ రిపోర్టర్.
  పాలిటీ- యాన్ ఇంట్రడక్షన్ టు ద కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా- డి.డి.బసు.
  అవర్ కాన్‌స్టిట్యూషన్- సుభాష్ కశ్యప్; అవర్ పార్లమెంట్- సుభాష్ కశ్యప్.
 
 ముఖ్యమైన తేదీలు:
 నోటిఫికేషన్ తేదీ: మే 17, 2014.
 దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 16, 2014.
 ప్రిలిమ్స్ తేదీ: ఆగస్టు 24, 2014.
 సివిల్స్ మెయిన్స్: డిసెంబర్ 14, 2014 నుంచి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement