ఆకార్ పటేల్
విశ్లేషణ
ఈ వారం ఒక కేంద్ర మంత్రి భారతీయులను రామ్‌జాదాలు (హిందువులని అర్థం) లేక హరా మ్‌జాదాలు (అక్రమ సంతానం) అంటూ వేరు పర్చడాన్ని మనం చూశాం. భారతీయ జనతా పార్టీలో చేరిన పలువురు నిరక్షర లేదా అర్థ నిరక్షర సాధ్విలలో ఈమె కూడా ఒకరు. మీడి యా విరుచుకుపడ్డాక మంత్రి సాధ్వి నిరంజన ముక్తసరిగా ఒక పశ్చాత్తాప ప్రకటన చేశారు. ఇలాంటి అసభ్య భాషను హిందుత్వ పార్టీలు తమ పునాదిని బలపర్చు కోవడం కోసం తరచుగా ఉపయోగించేవి. మీడియాలో రచ్చ జరిగాక ప్రతిపక్షం దాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చింది. కేంద్రమంత్రి అరు ణ్ జైట్లీ, సాధ్వి నిరంజన ప్రకటనను ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం వెంటనే ఈ అంశంపై స్పందించలేదు. అలాంటి వ్యాఖ్య ల వెనుక ఉన్న సంకేతం ప్రబలమైనదని ఆయనకు తెలుసు.
ఆ తర్వాత ప్రధాని దీనిపై ఒక వార్తను లోపాయికారిగా లీక్ చేశా రు. నేతలు తమ మాటల విషయంలో జాగ్రత్త పడాలని మోదీ అంతర్గ త సమావేశంలో హెచ్చరించారన్నదే ఆ వార్త. అయితే ఈ హెచ్చరికలో ఖండనను పోలిన స్పష్టత లేకపోవడం గమనార్హం. తన మంత్రులు, ఎంపీలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోనంటూ మోదీ గట్టి సందే శాన్ని ఇవ్వాలనుకుని ఉంటే, మంత్రివర్గం నుంచి నిరంజనను తొలగిం చడమే సరైన చర్య అయి ఉండేది. పాత్రధారిని నేరుగా విమర్శించ కుండా ఆమె చర్యలను మాత్రమే విమర్శించడం వల్ల ఏమీ ఒరగదు. వాస్తవానికి మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల దాడులను దారి మళ్లించడానికి క్షమాపణను ప్రతిపాదించినట్లు కనబ డుతోంది. ప్రతిపక్షం మోదీ చేసిన ఈ తప్పును పసిగట్టి దాన్ని అనుకూ లంగా మార్చుకోవడానికి మరింత ఒత్తిడి చేసింది. అప్పుడు మాత్రమే మోదీ పార్లమెంటుకు వచ్చి ఎవరైనా సరే అలాంటి వ్యాఖ్యలను చేయ కూడదంటూ వివరణ ఇచ్చారు. అయితే హిందుత్వ తరపున వ్యవహరి స్తున్నవారు అలాంటి మాటలు ఎందుకు వాడుతున్నారన్నదే ప్రశ్న.
బీజేపీ అనామక అభ్యర్థి గిరిరాజ్ సింగ్ ఎన్నికల ప్రచార కార్యక్ర మంలో ఒక వ్యాఖ్య చేయడం ద్వారా ఉన్నట్లుండి వెలుగులోకి వచ్చారు. ఆయన మాటల ప్రకారం ‘నరేంద్రమోదీని అడ్డుకోవాలని భావిస్తున్న వారు పాకిస్తాన్ మద్దతుకోసం చూస్తున్నారు. రాబోయే రోజుల్లో, ఇలాం టి వ్యక్తులకు భారత్‌లో, జార్ఖండ్‌లో చోటు ఉండదు. ఎందుకంటే పాకిస్తానే వారికి సరైన చోటు’. అదేసమయంలో వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా గుజరాత్‌లో ఒక సభలో మాట్లాడిన టేప్ లీక్ అయింది. దావూది బోహ్రా అనే వ్యక్తి ఆస్తి కొనుగోలు ఘటనలో పొరుగున నివసిస్తున్న ఒక హిందువు తొగాడియా సలహాను అర్థించారు. భారత్ లోని సంపన్న కమ్యూనిటీల్లో బోహ్రా ఒకటి. వీరు సున్నీ ముస్లింలతో కలిసి జీవించలేరు. హిందువులు అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో నివసించడానికే బోహ్రాలు మొగ్గు చూపుతారు. కాని తొగాడియాను సల హా కోరిన హిందూ వ్యక్తి, ఈ బోహ్రా కుటుంబం తమ పక్కన నివసిం చడానికి ఇష్టపడలేదు. దాంతో బోహ్రా కుటుంబంలో చీలికలు, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి వారు చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఆస్తి నుంచి వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేయాలని తొగాడియా సల హా ఇచ్చారు. ఇది వీడియోలో కూడా రికార్డయింది.
ఈ రెండు ఘటనలు ఒకే సమయంలో జరిగాయి. దాంతో తమ కేంపెయిన్‌ను దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారంటూ మోదీ ఒక సాధారణ ట్వీట్‌తో సరిపెట్టేశారు. మోదీ తర్వాత గిరిరాజ్‌ను మంత్రిని చేసేశారు. గుజరాతీ మాట్లాడలేని వారు తొగాడియా మాటలను తప్పు గా అర్థం చేసుకుని ఉండవచ్చని ఆరెస్సెస్ కూడా బొంకింది. (కాని నేను ఆ పూర్తి పాఠాన్ని లైవ్‌మింట్.కామ్ నుంచి యథాతథంగా అనువ దించాను.) తొగాడియా వీహెచ్‌పీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
దీనికి కారణం ఉంది. ఒకవైపు ముక్తసరిగా అర్థ ఖండనలు చేస్తున్న ప్పటికీ మరోవైపు మోదీ, ఆరెస్సెస్ ఇలాంటి అభ్యంతరకర ప్రకట నలను ఆమోదిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను ప్రోత్స హిస్తున్నారు. ఎందుకంటే భారత్‌లోని ఒక సువిశాల ప్రాంతం ఇలాంటి వ్యక్తులపట్ల అనుకూలంగా స్పందిస్తోంది మరి.
(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)