
మాడభూషి శ్రీధర్
ఆశ్చర్యకరంగా భారత ప్రభుత్వ న్యాయవాది (అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా) కూడా తాను పబ్లిక్ అథారిటీ కాదని వాదించారు.
విశ్లేషణ
ఆశ్చర్యకరంగా భారత ప్రభుత్వ న్యాయవాది (అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా) కూడా తాను పబ్లిక్ అథారిటీ కాదని వాదించారు. పబ్లిక్ అథారిటీ కాదని సీఐసీ దురదృష్టవశాత్తూ తీర్పు ఇచ్చింది.
సమాచారం కావాలంటూ జనం సంధిస్తున్న ప్రశ్నాస్త్రా లు అధికార వ్యవస్థల గుండె ల్లో దడపుట్టిస్తున్నవి. మేం పబ్లి క్ అథారిటీ కాదంటూ కోర్టుల కెక్కుతున్నారు. సహ చట్టం పట్టు నుంచి జారిపోవడానికీ, సమాచారం ఇచ్చే బాధ్యత నుంచి పారిపోవడానికే ఆ ప్రయత్నమంతా.
కరెంటు బిల్లులతో షాకులందించి జనాన్ని కష్టాల్లో ముంచెత్తుతున్న డిస్కంలు, సర్కారీ డబ్బుతో సహకార ఇళ్ల సంఘాలు పెట్టి లాభపడే కమిటీలను చూస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో వైద్యశాలలు కట్టి రోగుల నుంచి కోట్లు కొల్లగొడుతూ, తాము జనానికి జవాబు దారీ కాబోమని కోర్టులకెక్కి ప్రజల్ని వేధించుకు తినే ఆస్పత్రులనూ చూస్తూనే ఉన్నాం. ఆశ్చర్యకరంగా భార త ప్రభుత్వ న్యాయవాది (అటార్నీ జనరల్ ఆఫ్ ఇండి యా) కూడా తాను పబ్లిక్ అథారిటీ కాదని వాదించారు. పబ్లిక్ అథారిటీ కాదని సీఐసీ దురదృష్టవశాత్తూ తీర్పు ఇచ్చింది. దరఖాస్తుదారులు సీఐసీ తీరు్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఏజీఐ సమాధానమూ సమాచారమూ ఇవ్వాల్సిందేనని మార్చి 10, 2015న ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇది చారిత్రాత్మకమైన నిజని ర్ధారణ. ఆర్కే జైన్, సుభాష్ చంద్ర అగ్రవాల్ ఆర్టీఐ కింద ఏజీఐ కార్యాలయాన్ని కొంత సమాచారం అడిగారు. తాము పబ్లిక్ అథారిటీ కాదని, తమకు సమాచార అధి కారి లేడని, కనుక ఇవ్వబోమని జవాబిచ్చారు. వారు సీఐసీకి ఫిర్యాదు చేసుకున్నారు. మీరు సమాచారం ఇవ్వాల్సిందేనని సీఐసీ ఆదేశించింది. ఏజీ గారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన వ్యవస్థను పబ్లిక్ అథారిటీగా సెక్షన్ 2(హెచ్) నిర్ణయించింది. రాజ్యాంగ అధికరణం ఆర్టికల్ 76 కింద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండి యాగా పెద్ద లాయర్‌ను నియమిస్తారు. కోర్టు ధిక్కార చట్టం కింద ఏజీఐ కదిలిస్తేనే ధిక్కార నేరం కేసులు విచా రణ జరుగుతాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అధి కారిక హోదాలో సభ్యుడు, న్యాయవాదులకు నాయ కుడు. చట్టపరమైన అంశాలలో కేంద్రానికి సలహా ఇవ్వా లి. రాష్ర్టపతికి కూడా సలహా ఇవ్వాలి. ఆర్టికల్ 88 కింద పార్లమెంటు ముందు హాజరై న్యాయ అంశాలు వివరిం చాలి. ప్రభుత్వం తరఫున కోర్టులో వాదించాలి. జీత భత్యాలు, వనరులు, సౌకర్యాలు, సహాయక సిబ్బంది వారికి ఉండాలి. తాము సాధారణంగా అథారిటీ కాదని, తమకు ఎవరి హక్కులనూ తగ్గించే అధికారం లేనే లేదని ఏజీఐ వాదించారు. కేవలం సలహాలు ఇస్తామని, వాటిని అమలు చేయకపోయినా చేసేదేమీ లేదని కనుక తాను అధికారిని కాదని అన్నారు.
వారి పని న్యాయ సలహాలు ఇవ్వడం మాత్రమే అన్నది నిజమే అయినా, ఇతర రాజ్యాంగ అధికారుల కంటే వీరికి తక్కువేమీ లేదని, ఆర్టీఐ చట్టం సెక్షన్ 2 (హెచ్)లో సలహా అధికారులు పబ్లిక్ అథారిటీ కాదని చెప్పే సూచనేదీ లేదని, రాజ్యాంగం, ఇతర అనేక చట్టా లలో ఏజీఐ అధికారాలేమిటో స్పష్టంగా ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు వివరించింది.
కొన్ని సంస్థలు, అథారిటీలు ఆర్టికల్ 12 కింద స్టేట్ కాబోదని సుప్రీంకోర్టు నిర్ణయించినప్పటికీ, ఆర్టీఐ కింద జవాబు ఇవ్వవలసిన బాధ్యత మాత్రం వాటికి ఉంటుం ది. ఆర్టీఐ అవసరాలకుగాను పబ్లిక్ అథారిటీ అవునో కాదో తేల్చడానికి రాజ్యాంగ కొలమానాలు తీసుకోవల సిన అవసరం లేదని, ప్రజా సంబంధమైన అధికారాలు నిర్వహించవలసి ఉన్న కారణంగా కూడా ఏజీఐ పబ్లిక్ అథారిటీ అవుతారనీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి విభు బాఖ్రూ నిర్థారించారు. పార్లమెంటు చేసిన చట్టాలను ప్రభుత్వ విధానాలను కోర్టుల్లో నిలబడి సమర్థించ వలసిన ప్రభుత్వ లాయరే చట్టాలలోని నియమాలకు వ్యతిరేకంగా వాదిస్తూ, నియమాలకు అతీతమైన అంశా లను లేవదీస్తూ హైకోర్టులో ప్రజలకూ ప్రభుత్వానికీ వ్యతిరేకంగా కేసులు వేయడం అసలు సిసలు విచిత్రం. ఏ ప్రైవేటు ధనార్జన సంస్థలో, తాము పబ్లిక్ అథారిటీ కాదని, జవాబులు ఇవ్వబోమని వాదిస్తే ఈ ధోరణిని నిరోధిస్తూ, జనం పక్షాన ఉండవలసిన న్యాయవాద అధికారులే చట్టానికి వ్యతిరేకంగా నిలబడితే సమాచార చట్టం ఏమవుతుంది? సమాచార హక్కు చట్టాన్ని సమ ర్థించవలసిన వారే దాన్ని నీరుగార్చే లిటిగేషన్‌లు సృష్టిస్తూ ఉంటే ఈ కేసులు ఎప్పుటికి తెములుతాయి? సమాచారం జనానికి ఎప్పుడు చేరుతుంది?
ప్రభుత్వ సంస్థలూ, అధికారులే సమాచార చట్టా న్ని ఈ విధంగా దెబ్బ తీస్తే రక్షించుకోవలసింది ఇక ప్రజ లే. ఇటువంటి అనవసర వివాదాలు ఏళ్ల తరబడి హైకో ర్టు గుమ్మాల్లో పడిగాపులు పడకుండా ఉండాలంటే సర్కారు వారు ఇటువంటి కేసులను ప్రోత్సహించకుం డా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఈ రోజుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టులలో పోరాడాలంటే కొన్ని లక్షల రూపాయలు లేదా కోట్ల రూపాయలు అవసరం. ప్రభు త్వం వారు ప్రభుత్వం ఖర్చుతో పౌరుడిపైన న్యాయ సమరం సాగిస్తూ ఉంటే సామాన్యులు తట్టుకోగలరా? ఇప్పటికైనా ఈ న్యాయ పోరాటాన్ని ఏజీఐ గారు తదితర తత్సమాన న్యాయాధినేతలు ఢిల్లీలో హైకోర్టు తీర్పుతోనే ఆపుతారని, సుప్రీంకోర్టు దాకా లాగకుండా పౌరులు అడిగిన సమాచారం ఇవ్వడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారని ఆశిద్దాం.
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com