
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
ప్రజారోగ్య సంరక్షణ ప్రభుత్వ కర్తవ్యం కావలసిన చోట ఆరోగ్య వ్యవస్థను క్రమంగా ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తూ వచ్చారు.
విశ్లేషణ
మనుషులకు సోకే వ్యాధుల నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రజ్ఞానం ఆధునిక పాలనా వ్యవస్థలకు అనూహ్యమైన అవకాశాలు కల్పించింది. కాని లాభాపేక్షపై ఆధారపడి నడుస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థలూ, వాటి పాలకులూ అందివచ్చిన పరిశోధనా ఫలితాలను, ఔషధాలను ప్రజాబాహుళ్యానికి అందుబాటులోకి తేవడం లేదు. దారిద్య్ర నిర్మూలనకు గాని, పేద, బలహీనవర్గాల కనీస ఆరోగ్య రక్షణకు గాని శ్రద్ధ వహించడం లేదు. ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక సంస్కరణలను తలకెత్తుకున్నాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ మూతపడ్డాయి.
ప్రజారోగ్య సంరక్షణ ప్రభుత్వ కర్తవ్యం కావలసిన చోట ఆరోగ్య వ్యవస్థను క్రమంగా ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తూ వచ్చారు. ఆర్థిక సంస్కరణల వల్ల సామాన్య ప్రజ ల ఆరోగ్యం దెబ్బతిని రోగాలూ, రొష్టుల పాలవుతు న్నారు. ఈ దాడి బహుముఖంగా సాగింది. ఫలితం- పోషకాహారం తరిగిపోయింది. అంటువ్యాధులూ, వ్యాధులూ ప్రబలిపోయాయి. మటుమాయమైనాయను కున్న మలేరియా, క్షయ, కాలా అజార్, పోలియో వంటి రోగాలు తిరిగి తలెత్తాయి, పెరిగాయి.
అరవింద్ (గ్లోబలైజేషన్: యాన్ ఎటాక్ ఆన్ ఇండియాస్ సావర్నిటీ)
రోగాలలో గురక ప్రమాదకరమైనదని అంటారు. ‘గురక’ అంటే పశు వ్యాధి. ఈ వ్యాధికి మూలం పంది. దీనికి వచ్చిన కొత్త పేరే స్వైన్ ఫ్లూ. పందులలో ఇది సాంక్రమిక శ్వాసకోశ వ్యాధి. వాతావరణంలో మార్పు లతో, సీజనల్‌గా వచ్చిపోయే సాధారణ ఫ్లూ, ఇన్‌ఫ్లు యెంజా వంటి వ్యాధి కాదిది. పందులకూ, పక్షులకూ తోడు మనుషులకు కూడా వ్యాపించే ఇన్‌ఫ్లుయెంజాకు స్వైన్ ఫ్లూ అని పేరు పెట్టారు. ఇటీవల బాగా భయ పెట్టిన డెంగ్యూ తరువాత అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా దీనినే గుర్తిస్తున్నారు. ఈ రెండింటి తరువాతి స్థానం ఎబోలా వ్యాధిదే.
ఏమిటీ వ్యాధి?
ఆదిలో పందులు, పక్షుల ద్వారా మనుషులకు సంక్ర మించే వ్యాధిగా స్వైన్ ఫ్లూను శాస్త్రవేత్తలు పరిగణించినా, తరువాత ఒకరి శ్వాస నుంచి మరొకరికి సోకే వ్యాధిగా దీనిని నిర్ధారించవలసి వచ్చింది. అందుకే మనుషులలో వ్యాపించే ఈ వ్యాధికి హెచ్1 హెచ్2 అనే సంకేతనా మాన్ని కూడా తగిలించారు. ఈ మహమ్మారి ఇప్పుడే ఖండాలు దాటిపోతూ వచ్చి మన దేశానికీ, మన తెలుగు రాష్ట్రాలకూ కూడా విస్తరించింది. ప్రజలను భయభ్రాం తులకు గురిచేస్తూ, వైద్యులను కలవరపెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లతో పాటు దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో ఈ వ్యాధి బాధితులు, మరణాలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఈ వ్యాధి వల్ల చనిపోయిన వారు 13 (జనవరి 25 వరకు) మంది. మరో వర్గం మీడియాలో ఈ సంఖ్య 17 వరకు ఉంది. మొత్తం వేయి మందికి పైగా పరీక్షలు చేయిం చుకోగా, వారిలో 360 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు ఈ వ్యాధి ఆంధ్రప్రదేశ్‌కు కూడా వ్యాపిస్తున్నట్టు (ప్రకాశం జిల్లాలో) అంచనా. ఈ వ్యాధి ఒక రకం కాదు. శాస్త్ర పరిభాషలో మళ్లీ దీనిని ఏ బీ సీ అనే తరగతులుగా విభజించారు. వాటి వైరస్, లక్షణాలు వేరు. ఏ, సీ తర గతి ఫ్లూ పందులకూ, మనుషులకూ సంక్రమించేది. సి తరగతి వ్యాధి లక్షణాలను మొదటిసారి జపాన్, అమె రికా పిల్లలలో కనుగొన్నారు.
చాలా రకాలే ఉన్నాయి!
ఈ వ్యాధిలో కనిపిస్తున్న రకాలకు హెచ్1 ఎన్1, హెచ్1 ఎన్2, హెచ్2 ఎన్1, హెచ్3 ఎన్2, హెచ్2 ఎన్3 అని పేర్లు పెట్టారు. ఇందులో కొన్ని పరిమిత ప్రభా వాన్ని, పరిమిత ప్రాంతంలో మాత్రమే చూపించాయి. స్వైన్ ఫ్లూ (హెచ్1 ఎన్1) వంటి ఉపజాతులు ఖండాం తరాలకు వ్యాపించిన సంగతిని శాస్త్రవేత్తలు గమనిం చారు. దాదాపు 50 రకాలను ఇందులో గుర్తించారు. స్వైన్ ఫ్లూ శ్వాస ద్వారా మనిషి నుంచి మనిషికి సంక్ర మించే వ్యాధిగా పరిణమించగా, చాలా వరకు ఆహార పదార్థాల ద్వారా మాత్రమే సంక్రమిస్తున్నట్టు తేల్చారు. 1918లోనే ఈ ఫ్లూను మొదటిసారి అంటువ్యాధిగా గుర్తించారు. స్వైన్ ఫ్లూ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్న సంగతిని మళ్లీ 20వ శతాబ్దం మధ్య భాగంలో గమనిం చారు. సాధారణ ఫ్లూ, ఇన్‌ఫ్లుయెంజాల వ్యాధి లక్షణాలే- జ్వరం, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, దగ్గు, బలహీనత- వంటివి కనిపిస్తాయి. కానీ స్వైన్ ఫ్లూ మాత్రం కొద్ది రోజులకే రోగిని ప్రాణాపాయస్థితికి తీసు కుపోతుంది. అయితే దీనిని పూర్తిస్థాయి అంటువ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి, దేశాలను హెచ్చరించి నది మాత్రం 2010లోనే. నిజానికి 1976 వరకు కూడా ఈ వ్యాధికి వ్యాక్సి నేషన్ వేయడం గురించి ఎవరూ తీవ్రంగా తీసుకోలేదు. అసలు వ్యాక్సినేషన్ వల్ల మను షులు చనిపోతారన్న అపోహ, మొత్తంగా వ్యాక్సినేషన్ పట్ల వ్యతిరేకత ఇం దుకు కారణం.
వ్యాక్సినేషన్‌ను వ్యతిరేకించడం వల్లనే
ఫలితంగా స్వైన్ ఫ్లూ ముదిరి, అంటువ్యాధిగా దేశాలను అల్లుకుంటూ పోయింది! మూఢాభిప్రాయాల వల్ల పుట్టిన ఈ అపవాదు - వాక్సినేషన్ వల్ల మనుషులు చని పోతారన్న ప్రచారం-వదంతి మాత్రమేననీ సుప్రసిద్ధ వైజ్ఞానిక శాస్త్ర రచయిత పాట్రిక్ డి-జస్టో వివరించే దాకా చలామణిలోనే ఉంది. మానవుల నుంచి మానవులకు శ్వాస ద్వారానే ఈ వ్యాధి కారక వైరస్ వ్యాపిస్తుందని అయోవా (అమెరికా) విశ్వవిద్యాలయ పరిశోధన ద్వారా 2004లో తుదిసారి ధ్రువపడింది. చైనాలో వచ్చిన ఏవి యన్ ఇన్‌ఫ్లుయెంజా ‘హెచ్3ఎన్2’ వ్యాధి. అది చైనాకే పరిమితమైంది. అది కోళ్లకు వచ్చిన ఇన్‌ఫ్లుయెంజా!
నివారించే అవకాశాలు ఉన్నా...
రోగాలు మనుషులకు కాక మానుకు వస్తాయా అన్నది నానుడి. కాని మనుషులకు సోకే వ్యాధుల నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రజ్ఞానం ఆధునిక పాలనా వ్యవస్థలకు అనూహ్యమైన అవకాశాలు కల్పిం చింది. కాని లాభాపేక్షపై ఆధారపడి నడుస్తున్న పెట్టు బడిదారీ వ్యవస్థలూ, వాటి పాలకులూ అందివచ్చిన పరిశోధనా ఫలితాలను, ఔషధాలను ప్రజాబాహుళ్యానికి అందుబాటులోకి తేవడం లేదు. దారిద్య్ర నిర్మూలనకు గాని, ఆర్థికంగా పేద, బలహీనవర్గాల కనీస ఆరోగ్య రక్ష ణకు గాని శ్రద్ధ వహించడం లేదు. చివరికి ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక సంస్కరణలను పాలకులు తల కెత్తుకున్న తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్.సి) కూడా మూతపడ్డాయి. లేదా వాటి పని బాగా కుంటుపడింది.
ఈ లోపాన్ని పాలకులు ఎలా కప్పెట్టుకుంటు న్నారు? జాతీయ శాంపుల్ సర్వేల పేరుతో దేశంలో దారిద్య్రం శాతాన్ని తగ్గించి చూపించే చిత్రగుప్తుడి చిట్టా ఆవర్జాలను ప్రజల మొఖాన కొడుతున్నారు! కానీ మన దేశంలో 70-80 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన, అంటే కటిక దారిద్య్రం అనుభవిస్తున్నారని శాంపుల్ సర్వేలు దీనినే స్పష్టం చేస్తున్నాయి. మన దేశ జనాభాలో 75 శాతం ఆరోగ్య బీమా పరిధిలోనే లేరు. చివరికి ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం చూసినా రోజుకు ఒక డాలర్ (రూ.60) కన్నా తక్కువ ఆదాయం ఉన్న జనా భా, మొత్తం జనాభాలో 52.3 శాతం ఉన్నారనీ, రోజుకు 2 డాలర్ల కన్నా తక్కువ ఆదాయం వస్తున్న వారి సంఖ్య 88.8 శాతమనీ తేలింది. ఇక అందుతున్న వైద్య సదు పాయం చూద్దామా! వంద కోట్ల జనాభాలో తల ఒక్కిం టికి ఏటా ప్రజారోగ్యం రక్షణకు చేసే ఖర్చు రూ.1.15 మాత్రమేనని తేలింది.
ప్రైవేటుతో ఆరోగ్యానికి ముప్పు
దేశంలో ఇంత పేదరికం ఉన్నా ఇక్కడ ప్రజారోగ్య వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ప్రైవేట్ రం గానికి అంటకాగిపోయింది. ప్రపంచ బ్యాంకు సంస్క రణల తర్వాత అంటువ్యాధుల కట్టడిపై చేసే ఖర్చు దారుణంగా పడిపోయింది. పెట్టుబడి ప్రపంచీకరణ క్రమంలో జరుగుతున్నది దారిద్య్రాన్ని ప్రపంచీకరించ డమే. కాబట్టి ప్రపంచీకరణ కాలంలో ఆరోగ్యంపై పెట్టే ఖర్చు తగ్గిపోయి గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ కాస్తా కుప్ప కూలిపోవలసి వచ్చిందని మరచిపోరాదు! 1978 నాటికి ప్రభుత్వ అజమాయిషీలో సుమారు 400 ఔషధాలు ఉం డగా, వాటి సంఖ్య 1994 నాటికి కేవలం 73కు పడిపో యింది. ప్రస్తుతం ప్రభుత్వం అదుపు చేయగలుగుతు న్నది ఈ ఔషధాలను మాత్రమే. దీని ఫలితంగా 20,000 దేశీయ మందుల కంపెనీలు రద్దయి, బహుళ జాతికం పెనీలు ధరవరల నిర్ణయంలో స్వైరవిహారం చేయడానికి రంగం సిద్ధమవుతున్నదని అంచనా. అందుకే ఇండియా పేటెంట్ హక్కులకు అమెరికా యూరోపియన్ బహుళ జాతి కంపెనీలు ఎసరు తెస్తున్నాయని గమనించాలి! ఈ పరిస్థితుల్లో ఎబోలాలు, స్వైన్ ఫ్లూ లాంటి అంటువ్యా ధులు భారత ప్రజల ఆరోగ్యాన్ని మరింతగా పిండుకో వడం ఖాయం! ఇప్పుడిక దేశ విధాన నిర్ణాయక శక్తిగా ప్రణాళికా వ్యవస్థనే మోదీ రద్దు చేయడంతో దోచుకున్న వాడికి దోచుకున్నంత మహదేవ!
(వ్యాసకర్త మొబైల్: 9848318414)