తీర్పు చెప్పకపోవడమూ తీవ్రమైన నేరమే! | Never judgement is a serious crime! | Sakshi
Sakshi News home page

తీర్పు చెప్పకపోవడమూ తీవ్రమైన నేరమే!

Published Fri, Apr 17 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

మాడభూషి శ్రీధర్

మాడభూషి శ్రీధర్

 విశ్లేషణ
 
 ఢిల్లీ నగరంలో 56 వేల సంస్థలకు 100 చదరపు గజాల నుంచి 50 ఎకరాలకు మించి ప్రభుత్వం భూమిని  కేటాయించింది. లీజు పత్రాల్లో రేటును సవరించిన మేరకు చెల్లించాలనే షరతు ఉన్నా 1999 నుంచి ఇంతవరకు రేటును పెంచలేదు.
 
 నిర్ణయం తీసుకునే వారు తీసుకోకపోవడమే అసలు సమస్య.  మనకెందుకు ఆ పెద్దాయనే ముందుబడుతుంటాడు కదా, అతన్నే నిర్ణయం తీసు కొమ్మందాం అని వదిలేయడం ఇంకో లక్షణం. సరైన పాలకుడు సరైన సమయంలో సరైన  నిర్ణయం తీసుకోవాలి, అందుకు సరైన కారణాలు చెప్పాలి కూడా.
 యుద్ధంలో కమాండర్ క్షణాల్లో నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. తప్పో ఒప్పో.. పాలకుడు, కోర్టులో న్యాయమూర్తి కూడా అంతే. చట్టం ప్రకారం, సాక్ష్యాల మేరకు నిర్ణయం తీసుకోవాలి. సాక్ష్యాలు వాదాలు ప్రతి వాదాలు విన్న తరువాత వెంటనే తీర్పు ఇవ్వకపోతే విష యాలు వివరాలు గుర్తుంటాయా? జస్టిస్ కృష్ణ అయ్యర్ ‘అన్నీ విని తీర్పు చెప్పకపోవడం తీవ్రమైన నేరం’ అన్నారు. అన్ని నేరాల వలెనే ఈ నేరాలూ పెరిగితే?  

 ఢిల్లీ సుల్తాన్‌లు (మన నవాబులు కూడా) విలువైన  భూములు మంచి కూడళ్లలో అస్మదీయులకు తక్కువ అద్దెకు ఇచ్చి జనం నుంచి కోట్ల రూపాయలు పిండుకునే సదవకాశాన్ని ఇస్తూ ఉంటారు. కిక్ బ్యాక్ ఉన్నా లేకు న్నా.. ప్రభుత్వం గణనీయంగా ఆర్థిక సాయం ఇస్త్తున్న దని, ఒకవేళ ఆ సాయం నిలిచిపోతే ఎన్‌జీఓ మనుగడ సాధ్యం కాదని తేలితే దాన్ని పబ్లిక్ అథారిటీగా తేల్చా లని సుప్రీంకోర్టు తల్లపాలెం కేసు తీర్పు పేరా 39, 40 లో ఒక కొలమానాన్ని అందించింది.

 దేశ రాజధానిలోని కీలకమైన ప్రాంతంలో ప్రభు త్వం డీడీసీఏకు 1987లో 14.281 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చింది, దీనికి ఏటా కేవలం ఎకరానికి 5500 రూపాయల లైసున్సు ఫీజు తీసుకుంటున్నది, ఎకరానికి 88 లక్షల రూపాయల ఖరీదు కట్టి అందులో అయిదు శాతం మాత్రమే ఫీజు నిర్ణయించింది. అది ఏడాదికి కేవలం 24.64 లక్షల రూపాయలు మాత్రమే.  2002లో లీజును  33 సంవత్సరాలపాటు కొనసాగించారు. డీడీఏ సర్కిల్ ఏ రేటు ప్రకారం చదరపు మీటర్‌కు రూ. 3,99,889 చొప్పున లెక్కిస్తే డీడీసీఏ ఇచ్చిన 57789 చ.మీ.లకు 2,310 కోట్ల రూపాయలు అవుతుంది, అం దులో అయిదు శాతం అంటే రూ.115.54 కోట్లు ఏటా ఇవ్వాల్సి ఉంటుంది. రెండో సర్కిల్ బి కేటగిరీలో చద రపు మీటరుకు 6,72,927 రూపాయలు. దీని ప్రకారం డీడీసీఏకి ఇచ్చిన భూమి ఖరీదు రూ. 3,888.77 కోట్లు, అందులో 5 శాతం అంటే రూ.194.43 కోట్లు అవుతుం ది. మూడో సర్కిల్ రేటు చ.మీ.కి రూ.1,59,840. దీని ప్రకారం కనీస సర్కిల్ రేటు రూ.923 కోట్లు, అయిదు శాతం రూ.46.18 కోట్లు. కనీసం లెక్క వేసినా 2002 నుంచి 13 ఏళ్లలో 2,600 కోట్ల రూపాయల మేరకు డీడీసీఏకు మినహాయింపు లభించినట్టు.

 అంతకుముందు 13 ఏళ్ల నుంచి ఈ భూమి డీడీసీఏ అధీనంలో ఉంది. ఆ లెక్క కూడా తీస్తే వారికి సర్కారు వారిచ్చిన సాయం ఖరీదు 5,200 కోట్ల రూపాయల విలువ అవుతుంది. లాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీసు వారి లెక్క ప్రకారం 88 వేల రూపాయలను డీడీసీఏ వారికి సంస్థ రేటుగా ఇచ్చారు. కాని క్రికెట్‌ను వాణిజ్య స్థాయిలో నడుపుతూ లాభాలు ఆర్జిస్తున్న డీడీసీఏకి వాణిజ్య రేటు మీద ఇస్తే రూ.329 కోట్లు. 5 శాతం ప్రకా రం రూ.16.4 కోట్లు అవుతుంది. కనీసం నివాస కాలనీ రేటు వేసినా రూ.108 కోట్లు విలువ, 5 శాతం ప్రకారం రూ.5.4 కోట్లు అవుతుంది. కాని ఏటా కేవలం 24 లక్షల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు.

 ఢిల్లీ నగరంలో 56 వేల సంస్థలకు 100 చదరపు గజాల నుంచి 50 ఎకరాలకు మించి ప్రభుత్వం భూమి ని  కేటాయించింది. లీజు పత్రాల్లో రేటును సవరించిన మేరకు చెల్లించాలనే షరతు ఉన్నా 1999 నుంచి ఇం తవరకు రేటును పెంచలేదు. దీని వల్ల ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నది. మూడు ప్రైవేటు సంస్థలకు విలువైన భూములను ఇవ్వడంవల్ల ఆ సం స్థలు పబ్లిక్ అథారిటీలే అనీ, ప్రజలకు సమాచార హక్కు కింద వారు జవాబులు ఇవ్వాలని సీఐసీ తీర్పు లిచ్చింది. వాటిపైన ఢిల్ల్లీ హైకోర్టు  విడివిడిగా స్టే ఇచ్చింది.

 పంజాబ్ క్రికెట్ అకాడమీ కూడా పబ్లిక్ అథారిటీ అంటూ పంజాబ్ సమాచార కమిషనర్ ఆదేశించారు. దాన్ని హైకోర్టు మాత్రం పక్కన బెట్టి, సుప్రీంకోర్టు సూచించిన పరీక్ష ప్రకారం తేల్చాలని పంజాబ్ ఎస్‌ఐసి కి తిప్పి పంపింది. అంటే దీని అర్థం కమిషన్ మాత్రమే తీర్పు ఇవ్వాలని. ఈ తీర్పులను ఉటంకిస్తూ ఇరువురు కేంద్ర కమిషనర్‌లు డీడీసీఏ విషయమై నిర్ణయం నిరవ ధికంగా వాయిదా వేశారు. ఢిల్ల్లీ హైకోర్ట్టులో డీడీసీఏకి సంబంధించి ఏ నిలిపివేత ఉత్తర్వూ లేనపుడు, ఇతర కేసుల్లో స్టే తాత్కాలికంగా ఆ పార్టీలకు మాత్రమే పరిమి తమవుతుంది. తల్లపాలెం కేసులో ఇచ్చిన తీర్పు, పం జాబ్ క్రికెట్ అసోసియేషన్ కేసులో పంజాబ్ హరియా ణా హైకోర్టు ఇచ్చిన తీర్పు. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచార కమిషన్‌కు ఏదైనా ప్రైవేటు ఎన్‌జీఓ పబ్లిక్ అథారిటీ అవుతుందో లేదో నిర్ణయించే అధికారం ఉంది. క్రికెట్ మీద కోట్లు గడించే డీడీసీఏ ప్రజలకు జవా బుదారీగా ఉండాలనడం తప్పా?

 (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement