సాగు పండుగ కావాలంటే... | If harvesting festival ... | Sakshi
Sakshi News home page

సాగు పండుగ కావాలంటే...

Published Thu, Dec 4 2014 12:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

మల్లెపల్లి లక్ష్మయ్య - Sakshi

మల్లెపల్లి లక్ష్మయ్య

 విశ్లేషణ

 వ్యవసాయాన్ని దేశ సమగ్రాభివృద్ధిలో విడదీయరాని భాగంగా చూడకపోవడం, వ్యవసాయాధారిత రంగాలన్నిటినీ బలోపేతం చేయనిదే వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడం సాధ్యం కాదని విస్మరించడమే నేటి రైతన్న దుస్థితికి ప్రధాన కారణం. పాలకులు ఇప్పటికైనా పర్యావరణం దెబ్బతినకుండా, సాంకేతికంగా సరితూగే, ఆర్థికంగా లాభసాటియైన, రైతులకు ప్రయోజనం చేకూర్చే వ్యవసాయాభివృద్ధిపై దృష్టి సారించాలి. అప్పుడే వ్యవసాయం సంపూర్ణ గ్రామీణాభివృద్ధికి, ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. వ్యవసాయం దండుగ అన్న పాలకుల కుటిల నీతికి చరమగీతం పాడగలుగుతాం.
 
 గింజ గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని సామెత. ఆరుగాలం కష్టించి పండించిన రైతన్నకు పంట మీద ఆవగింజంత హక్కైనా లేకుండా పోతోంది. తనద నుకున్న భూమి మీద, ప్రకృతి ప్రసాదించిన నీటి మీదే కాదు, పండించిన పంట మీద కూడా రైతుకు హక్కు లేకుండా చేసిందెవరు? దేశానికి వెన్నెముకైన రైతన్న వెన్ను విరిచిందెవరు? అని గతంలో చాలాసార్లే  చర్చ జరిగింది. ఇలాంటి సవాళ్లన్నిటికీ ఇప్పుడిక ఏలికలు రైతన్నకు జవాబు చెప్పక తప్పదు. దేశ సమగ్రాభివృద్ధిలో విడదీయరాని భాగంగా వ్యవసాయాన్ని చూడకపోవడం. వ్యవసాయా ధారిత రంగాలన్నిటినీ బలోపేతం చేయనిదే వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడం సాధ్యం కాదనే విషయాన్ని విస్మరిం చడమే నేటి రైతన్న దుస్థితికి, వ్యవసాయరంగ అధోగతికి ప్రధాన కారణం. పాలకుల స్వీయప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టేయడం నిరాటంకం గా సాగిపోతోంది. కార్పొరేట్ కమీషన్ల కక్కుర్తికి మన విత్త నాలపై పెత్తనం ఎవడికో ధారాదత్తం చేస్తున్న పాలకులకు రైతు సంక్షేమం, ప్రజాప్రయోజనాల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎంతో తెలుస్తూనే ఉంది! ప్రభుత్వ విధానాలు వ్యవసాయ రంగానికి, రైతాంగానికి బాసటగా నిలవకపోగా, వారిని నిరాశానిస్పృహలకు గురిచేసి, వ్యవసాయాన్ని వీడిపో యేలా చేయడానికే తోడ్పడుతున్నాయి. ఫలితంగా వ్యవ సాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నేడు వ్యవసా యరంగాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు ఇవీ:
         భూమి సమస్య
         నీటిపారుదల
         యాంత్రీకరణ
         మార్కెటింగ్
         నిల్వ సదుపాయాలు
         పెట్టుబడి
         రవాణా
         విత్తనాలు
         ఎరువులు
         భూసార పరిరక్షణ
         పరిశోధన, విస్తరణ
         పర్యావరణ పరిరక్షణ
 ఉమ్మడి భూములు మటుమాయం
 గతంలో ప్రతి గ్రామానికీ నిర్దిష్టమైన భూ వినియోగ ప్రణా ళిక ఉండేది. గ్రామ నిర్మాణం దగ్గర నుంచి, చెరువుల నిర్మా ణం వరకు ఒక క్రమపద్ధతి ఉండేది. తాగునీటి చెరువు, సాగునీటి చెరువులు వేర్వేరుగా ఉండేవి. పశువుల  మేతకు సరిపడా భూమిని ప్రత్యేకంగా కేటాయించే వారు. ఆ భూములను ‘మందోట’ అని పిలిచేవారు. ఊరు చుట్టూ పండ్ల చెట్లు పెంచే వారు. ఇవి ఏవీ ఎవరి సొంత భూము లు కావు, ఊరి ఉమ్మడి ఆస్తులుగా అందరి అవసరాలను తీర్చేవి. ఇదంతా పాతకాలపు మాట. ఆధు నికమైన నేటి కాలంలో అడుగు నేలను కూడా ఊరి ఉమ్మడి అవసరాలకు వదలడం లేదు. ఒకప్పటి ఊరుమ్మడి భూములు సామా జిక, ఆర్థిక ఆధిపత్యం కలవారి సొంత ఆస్తులుగా మారిపో యాయి. దీంతో వ్యవసాయం, గ్రామీ ణ పర్యావరణ సమ తుల్యం పూర్తిగా దెబ్బతినిపోయింది.

 ఏ హక్కులూ లేని కౌలుదారులు
 ఇదిలా ఉండగా జనాభా పెరుగుతున్న కొద్దీ భూమి క్రమంగా చిన్న చిన్న కమతాలుగా విడిపోతుండటం మరొక సమస్య. ఒక వ్యక్తికి రెండెకరాల భూమి ఉంటే, దాన్ని నలుగురు సంతానికి పంచితే అది నాలుగు అర ఎకరం కమతాలుగా మారిపోతాయి. అలా ఏర్పడే అతి చిన్న కమతాలలో సాగు లాభసాటి కానిదిగా తయారైంది. పైగా ఒక రైతుకు రెండు మూడుచోట్ల చిన్న కమతాలుం డటం మరో సమస్య. ఇక కీలకమైన మూడో అంశం భూమిపై హక్కు.  గ్రామాల్లో భూములున్నా ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా పట్టణాల్లో స్థిరపడ్డవారి సంఖ్య గణ నీయంగా ఉంది. ఆ భూములను సాగుచేస్తున్న కౌల్దారు లకు దాదాపు ఏ హక్కులూ లేవు. అత్యధిక శాతం కౌలు దార్లు కౌలుదారులుగానే నమోదు కారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సాయమూ వారికి అందదు. ఇందువల్లనే కౌలు రైతుల్లో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

 సమగ్ర భూవినియోగ విధానం కావాలి
 భూవినియోగానికి సంబంధించి పైన పేర్కొన్న మూడు సమస్యలకు పరిష్కారాలు కావాలి. గత అనుభవాలను, పద్ధతులను దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న మొత్తం భూమిని ఎలా వినియోగించాలనేదానికి ఒక సమ గ్ర విధానం ఉండాలి. కానీ ఇటీవల మన ప్రభుత్వాలు పరి శ్రమలు, వ్యాపారాల పేరుతో లక్షలాది ఎకరాల సాగు యోగ్యమైన భూములను ఆక్రమిస్తున్నాయి. వ్యవసా యానికి, పరిశ్రమలకు, గృహనిర్మాణాలకు, భారీ ప్రాజెక్టు లకు ఎలాంటి భూములను, ఎక్కడెక్కడ ఎలా కేటాయిం చాలో వాటి ప్రాధాన్యాలను బట్టి  నిర్ణయించే ఒక శాస్త్రీయ దృక్పథం ఉండాలి. అదే విధంగా చిన్న కమతాల సమ స్యలను పరిష్కరించడానికి రెండు మార్గాలున్నాయి. అందులో కమతాల ఏకీకరణ మొదటి అంశం. ఒక రైతుకు రెండు, మూడు చోట్ల ఉన్న భూమిని ఒక చోట చేర్చడానికి నిజాం పాలనలో అమలుచేసిన ‘రద్దు బదిలీ’ విధానం సత్ఫలితాలను ఇచ్చినట్టు చరిత్ర చెబుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అది సత్వరం అమలు జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. ఇక చిన్న కమతాలు లాభదాయకం కావాలంటే సహకార వ్యవసాయ విధానం అత్యుత్తమమైనదని శాస్త్ర వేత్తల అభిప్రాయం. ప్రభుత్వాలు చొరవ చూపి రైతులను భాగ స్వాములను చేయగలిగితే సహకార వ్యవసాయం అద్భుత ఫలితాలను ఇస్తుంది.

 గిట్టుబాటు ధరలకు, పరపతికి హామీ ఇవ్వాలి
 గిట్టుబాటు ధరలు లభించకపోవడం రైతులను కుంగ దీస్తున్న మరొక సమస్య. బ్రిటిష్ పాలనలో ప్రవేశించిన వ్యాపార పంటలు క్రమంగా వ్యవసాయాన్ని వ్యాపా రంగా, పెట్టుబడి మీద ఆధారపడినదిగా మార్చింది. దీనితో రైతులు వడ్డీ వ్యాపారుల మీద, షావుకారుల మీద ఆధారపడటం పెరిగింది. దానికి తోడు పండిన పంటలను నిలువ ఉంచుకొనే వసతులు లేకపోవడం వల్ల వెంట వెం టనే తక్కువ ధరలకు తెగనమ్ముకొనే పరిస్థితి ఏర్పడు తోంది. షావుకారులు, వడ్డీ వ్యాపారులు అప్పు కింద రైతు పంటను పొలం దగ్గరే లాగేసుకునే దుస్థితి దాపురించింది.  రైతులు షావుకార్లకు, వ్యాపారులకు, దళారులకు అమ్మే ధరకు, చివరకు వినియోగదారుడు కొనుగోలు చేసే ధరకు మధ్య అంతులేని వ్యత్యాసం పెరిగింది. దీంతో అటు రైతు, ఇటు వినియోగదారుడు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతు పెట్టుబడి కంటే కనీసం యాభై శాతం అధికంగా ఆదాయం వచ్చే విధంగా గిట్టుబాటు ధరల నిర్ణయం జర గాలని వ్యవసాయ కమిషన్లు ఘోషించాయి. కానీ అమ లుకు నోచుకోలేదు.

 జాతీయ బ్యాంకులు రైతుల పెట్టుబడి అవసరాలను కొంత వరకు తీర్చ గలుగుతున్నా, ఎక్కువగా ఆత్మహత్య లకు పాల్పడుతున్న కౌలు రైతులను మాత్రం అవి పట్టిం చుకోవడం లేదు. మొత్తంగా వ్యవసాయ రంగాన్ని వడ్డీ వ్యాపారులు, దళారుల పట్టు నుండి పూర్తిగా విముక్తం చేయాలంటే సంస్థాగతంగా, చౌకగా పరపతి సౌకర్యాలను సంతృప్త స్థాయిలో కల్పించక తప్పదు. రైతుల అవస రాలకు సరిపడా గిడ్డంగుల సదుపాయాలను కల్పించడం ద్వారానే రైతు గిట్టుబాటు ధర వచ్చినప్పుడే పంటను అమ్ముకోవడం సాధ్యమవుతుంది. రైతులు పండించే ఉత్ప త్తులను నేరుగా వినియోగదారుడికి చేరే విధంగా మార్కె టింగ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తేనే అటు రైతుకు, ఇటు వినియోగదారునికి ప్రయోజనం.

 గ్రామీణ వికాసంతోనే దేశాభివృద్ధి
 పంటలు వేసే విషయంలో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి శిక్షితులైన సిబ్బంది లేకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. వ్యవసాయ పరిశోధనరంగం నేడు ప్రధానంగా ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉంది. ఫలితంగా రైతులకు ప్రయోజనాల కోసంగాక లాభాల కోసం పరిశో ధనలు సాగుతున్నాయి. ముఖ్యంగా విత్తనాల ఉత్పత్తి పూర్తిగా కార్పొరేట్ రంగం చేతుల్లోకి పోవడం రైతుల సం ప్రదాయక విత్తన నిల్వలను దెబ్బతీసింది. గతంలో రైతు లు, తమ విత్తనాలను తామే భద్రపరుచుకొనే వ్యవస్థ ఉం డేది. కార్పొరేట్ కంపెనీల విత్తనాల వల్ల రైతులు కోట్లాది రూపాయల పంటలను నష్టపోతుండటం పరి పాటిగా మారింది. నీటిపారుదల రంగం వ్యవసాయానికి జీవధార లాంటిది. పరిస్థితులు ప్రదేశాలను బట్టి తగు సాగునీటి విధానాలు లేకపోవడంవల్ల ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి. వీటిని పరిష్కరించడానికి ప్రభు త్వాలు ఒక శాస్త్రీయ విధానాన్ని రూపొందించాలి.

 ఒక్క మాటలో చెప్పాలంటే పర్యావరణం దెబ్బతిన కుండా, సాంకేతికంగా సరితూగే, ఆర్థికంగా లాభసాటి యైన, రైతులకు ప్రయోజనం చేకూర్చే నిలకడ కలిగిన వ్యవసాయాభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. అప్పుడే వ్యవసాయం సంపూర్ణ గ్రామీణాభివృద్ధికి, ఆర్థిక పురోగతికి దోహదపడగలుగుతుంది. వ్యవసాయం దం డుగ అన్న పాలకుల కుటిల నీతికి చరమగీతం పాడ గలుగుతాం.
  (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు - మొబైల్ నం: 9705566213)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement