అవినీతిపై రాజకీయం పైచేయి!
విశ్లేషణ
దావూద్ ఇబ్రహీంతో ఫోన్ కాల్స్ సంబంధాలపై ఆరోపణలు వచ్చిన మంత్రి ఖడ్సేని తప్పించాలని బీజేపీ నిర్ణయించడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఈ వ్యవహారంపై మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే సత్వర క్లీన్ చిట్ ఇచ్చేశారు.
భారత్‌లో స్వలాభం కోసం తమ కార్యాలయాలను దుర్వి నియోగపర్చని రాజకీయ నాయకులున్న ఒక్క ప్రభు త్వాన్ని పేర్కొనండి చాలు. రాష్ట్రాలకు కేంద్రంలోని ప్రభు త్వాలకు మధ్య సత్యవర్తనం వర్సెస్ అవినీతికి సంబంధిం చిన పోటీలో స్థాయీ భేదమే తప్ప పెద్దగా తేడా కనిపించబోదని నేను పందెం కాయ గలను.
అత్యంత అవినీతికర ప్రభుత్వం కంటే తక్కువ అవినీతికర ప్రభుత్వం మంచిదని ప్రజలు ఆమోదిం చేశారు కూడా. ప్రజాస్వామ్యంలోని వైచిత్రి, విషాదం ఏమిటంటే తమను తాము పాలించుకునే హక్కును ప్రజలనుంచి లాగేసుకుని ‘భారత ప్రజలమైన మేము’ అనే పేరుతో వారిని ఒక రాజ్యాంగానికి దాఖలు పర్చ డమే. ఎన్నికలు ముగియగానే, రాజకీయనేతలు, రాజకీ యాలకు ప్రతి విషయంలోనూ ప్రాధాన్యత లభిస్తుం టుంది. ప్రజలేమో అలా నిలబడి గమనిస్తుంటారు. కొన్నిసార్లు నిస్సహాయంగానూ, కొన్నిసార్లు తమను తాము ఓదార్చుకుంటూనూ.
అవినీతి రహిత పాలనను వాగ్దానం చేసి కేంద్రంలో ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పుడు, అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీకి ఏక్‌నాథ్ ఖడ్సే వంటి సీనియర్ మంత్రిని సులువుగా కటాక్షించడం, ప్రోత్సహించడం చాలా కష్టమవుతుంది. తనపై అవినీతి ముద్రపడింది, అయిదుగురు రాజకీయేతర వ్యక్తులు అతడిపై సమర శంఖం ఊదారు. వీరిలో ఒక జాలరి, ఒక విద్యావేత్త, ఒక కార్యకర్త, ఒక భవన నిర్మాణకర్త, ఒక నీతిమంతుడైన హ్యాకర్ ఉన్నారు. చివరి వ్యక్తి అయితే నేరుగా దావూద్ ఇబ్రహీం ఇంటి ఫోన్‌లకు, ఈ సీనియర్ మంత్రి మొబైల్ ఫోన్‌కు మధ్య నడిచిన కాల్స్ వివరాల గుట్టుమట్లను వెలికితీసింది.
మహారాష్ట్ర మంత్రిమండలి నుంచి ఈ మంత్రిని తప్పించాలని బీజేపీ - అంటే నరేంద్రమోదీ, అమిత్ షా అని చదువుకోవాలి- నిర్ణయించడంలో ఆశ్చర్యపడవల సిందేమీ లేదు. అయితే కొన్ని వార్తా పత్రికలు ప్రత్యే కించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డాక్యుమెంట్లను సమీక్షించి మరీ నిర్దిష్ట వాస్తవాలను బయటపెట్టిన అంశాన్ని నిర్లక్ష్యపరుస్తూ సదరు మంత్రిని నైతిక కారణాలతో రాజీనామా చేయడానికి వీరు దారి కల్పించారు ఈ క్రమంలో తాను మీడియా విచారణకు బలయ్యానని కూడా ఈ మంత్రి చెప్పుకున్నారు. పైగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సదరు మంత్రికి మద్దతుగా ప్రకటన చేశారు. ఆ సమయంలో కొంతమంది మంత్రులు కూడా హాజరు కావటం గమనార్హం.
మాఫియా నేతతో ఫోన్‌కాల్స్ వ్యవహారంలో జాగ్రత్తగా ఉండకపోవ డానికి ఖడ్సే మరీ కొత్త రాజకీయ నేత ఏమీ కాదు. దాదాపు 40 ఏళ్ల నుంచి ఆయన రాజ కీయాల్లో ఉన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగానూ, రెండు సార్లు అంటే 1995-99లో, ఇప్పుడూ ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోతో మంత్రిగా కూడా వ్యవహరించారు. తన కోడలు రక్షను 26 ఏళ్ల అతి పిన్న వయస్సులో 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించుకున్న స్థాయి రాజకీయ పలుకుబడి ఉంది. రెవెన్యూ, వ్యవసాయంతోపాటు పది శక్తివంతమైన మంత్రిత్వ శాఖలు చేతిలో ఉండగా రాజకీయ ఫలాలను అందుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే మరి.
మునుపటి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వాలకు ప్రత్యే కించి భూ కుంభకోణాల్లో ఊపిరాడనీయకుండా చేస్తూ వాస్తవాలను శోధించడంలో తీవ్రంగా శ్రమించిన ఖాడ్సే మరోవైపున దేవేంద్ర ఫడ్నవిస్‌ను అలంకరించిన ముఖ్య మంత్రి పదవిని కూడా లెక్కచేయనితనంతో గప్పాలు కొట్టుకునేవారు. సీఎం తనకంటే జూనియర్ అనే విష యాన్ని ఎత్తిచూపేందుకు ఏ అవకాశాన్ని ఆయన వదిలిపెట్టేవారు కాదు. గత ప్రభుత్వ ప్రకటనలను తుత్తునియలు చేస్తూ వాస్తవాలను బయటపెట్టడంలో ఫడ్నవిస్‌కు ఖడ్సే సహకరించారు కూడా.
ఒక మంత్రి సహాయకుడిని అరెస్టు చేయడం, మరొకరిపై దర్యాప్తు జరుగుతుండటం, సాక్షాత్తూ మంత్రే కుంభకోణాల ఆరోపణలకు గురవటం (వీటిలో అతి పెద్దది ఏదంటే ఆయన భార్య, అల్లుడు మార్కెట్ ధర కంటే కనీసం పది రె ట్లు తక్కువ ధరకు కారుచౌకగా రూ. 31 కోట్లకే విలువైన భూమిని కొనుగోలు చేయడం) ఈ భూమిని ఇప్పటికే పారిశ్రామిక విభాగాలకు అప్ప గించారు, అవి దాన్ని ఉపయోగిస్తున్నాయి కూడా. కానీ గత 40 ఏళ్లుగా భూమి యజమాని మాత్రం నష్ట పరిహారాన్ని పొందలేదు.
అలాంటి అవకాశాలను ఎవరయినా ఎలా దొరక బుచ్చుకోగలరు? ప్రభుత్వ సహాయం, రెవెన్యూ శాఖ అధిపతిగా ఉండటం వల్లే, అసలు యజమానికి కాకుండా కొత్త యజమానికి నష్టపరిహారం చెల్లించ వల సిందిగా కోరటం సాధ్యపడింది. ఈ అంశం అవినీతికి చెందినదైనప్పటికీ, ఆ ఇద్దరి మధ్య నడిచిన ఫోన్ కాల్స్ నిజమే అయిన ప్పటికీ, ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి ఒక ఓబీసీ నేతను అవమానించ కోరుతున్నాడని, రాజకీయ ప్రయోజనాల కోసమే భూ కుంభకోణాన్ని బయట పెట్టారని పేర్కొంటూ స్థానిక మీడియా ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం రాజకీయ సమస్యగా మాత్రమే చూస్తుండటం దురదృష్టకరం. పైగా దివంగత గోపీనాథ్ ముండే తర్వాత బీజేపీలోని ఏకైక ఓబీసీ నేతగా ఉంటుం డటం వల్ల సదరు మంత్రి రాబోయే నెలల్లో పార్టీకి సమస్యగా మారవచ్చు.
ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ప్రకటించిన రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని న్యాయ కమిషన్ ఈ వ్యవహారం నిగ్గు తేల్చడానికి కాస్త సమయం పడుతుంది కానీ, అయి దుగురు విభిన్న వ్యక్తులు ఐదు విభిన్న ఆరోపణలు చేయడం, కొన్ని పత్రాలు, ఫైళ్లు ఇప్పటికే కనిపించలేదని తేలడం వంటి వాటి కారణంగా ఈ సమస్య రాజ కీయాల్లో చాలా కాలంపాటు కొనసాగే అవకాశముంది. చివరకు కరాచీ, ఖాడ్సే ఫోన్ మధ్య నడిచిన కాల్స్ విషయంలో కూడా పోలీసులు సత్వరం క్లీన్ చిట్ ఇవ్వ డమే కాకుండా దాన్ని ఏటీఎస్ (ఉగ్రవాద నిరోధక స్క్వాడ్)కి పంపేశారు. ఇక ఏటీఎస్ తన సొంత వనరులమీద కాకుండా సంబంధిత హ్యాకర్ సహా యంపై ఆధారపడాలని చూస్తున్నట్లుంది. అవినీతిపై రాజకీయం పైచేయి సాధించే తీరు ఇదే మరి.
-మహేష్ విజాపుర్కార్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com