పా‘తాళపత్రాల’కు విముక్తి ఏది? | Palm leaf | Sakshi
Sakshi News home page

పా‘తాళపత్రాల’కు విముక్తి ఏది?

Published Sun, Jan 25 2015 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

డా॥డి.రాజారెడ్డి

డా॥డి.రాజారెడ్డి

 విశ్లేషణ

 ఇక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాలను పరిచయం చేస్తూ వాటి వివరాలతో 1933లో ఒక పుస్తకం వెలువడింది. దీనికి ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందుమాట రాయడం విశేషం.
 
 తెలుగుకు ప్రాచీన భాష హోదా తెచ్చుకున్నాం. కానీ భవిష్యత్తులో కూడా మన మాతృభాషను సజీవంగా ఉంచడం ఎలాగో ఆలోచించడం మరిచిపోయాం. రాగి రేకుల మీద, రాతి ఫలకాల మీద ఉన్న ప్పటికీ, తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్నప్పటికీ, ప్రాచీనమైనప్పటికీ భాషా సంపదను పరిరక్షించుకోవడం అందరి కర్తవ్యం. కొత్తగా వచ్చినదంతా ఎలా శిరోధార్యం కాదో, ప్రాచీ నమైనదంతా కూడా తిరస్కరించదగినది కాదు. భాష, సాహిత్యాలు ఆవిర్భావం నుంచి పరిగణనలో నికి తీసుకోవాలి. అప్పుడే అది సంపద అనిపించు కుంటుంది. అందుకే దానిని పరిరక్షించాలి. కానీ, మన రెండు రాష్ర్ట ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించ కపోతే జరిగే నష్టం అపారం. ఉదాహరణకి తంజా వూరు సరస్వతి మహల్, రాజమండ్రి గౌతమి గ్రంథాలయాలలో మగ్గుతున్న తాళపత్ర గ్రంథాల గురించి పరిశీలిద్దాం.
 
 ఒకప్పుడు తాళపత్రాలూ, గంటమే రాత పరిక రాలు. సరస్వతీ మహల్, గౌతమి, ఎస్వీ విశ్వవిద్యా లయం, వేటపాలెం వంటి చోట ఇప్పటికీ ఈ తాళప త్రాలు ఉన్నాయి. దూరదృష్టి కలిగిన వారు వాటిని గౌరవిస్తూ రేపటితరాల కోసం పరిరక్షించుకుంటూ వచ్చారు. కానీ ఏ తాళపత్రమైనా రెండుమూడొందల సంవత్సరాలకు మించి ఉండదు. అది శిథిలావస్థకు చేరుతూ ఉండగానే మరోసారి రాయించుకునేవారు. ఇంత శ్రద్ధకు కారణం వాటిలో ఉన్న విషయమే. తాళ పత్రాలంటే కేవలం కావ్యాలు, వేదాంతం బోధించేవ నుకుంటే మూర్ఖత్వం. తంజావూరు గ్రంథాలయం లో మొత్తం 778 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. 11వ శతాబ్దం నుంచి పేర్గాంచిన గ్రంథాలను ఇందు లో గమనిస్తాం. వీటిలో 455 పుస్తక రూపం దాల్చా యి. మరో 232 అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి. అంటే పరిష్కృతమైనాయి. అసలు అచ్చుకు సంబంధించి ఎవరి దృష్టికీ రాకుండా ఉండిపోయినవి 91. అలాగే కాగితం మీద రాసి పెట్టి ఉంచిన అముద్రితాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో సాహిత్యం, వ్యాకర ణం, ఆర్ష వాజ్ఞయం, తర్కం, జ్యోతిష్యం వంటివా టితో పాటు వైద్యం, గణితం, లోహాల మీద అధ్య యనం వంటివి కూడా ఉన్నాయి. రాయలవారి ‘ఆముక్తమాల్యద’ తాళపత్ర గ్రంథం కూడా వీటిలో ఉంది. వీటిని అక్కడే పని చేస్తున్న రవి అనే గ్రంథా లయాధికారి వర్గీకరించారు. ఇక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాలను పరిచయం చేస్తూ వాటి వివరాలతో 1933లో ఒక పుస్తకం వెలువడింది. దీనికి ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందుమాట రాయడం విశే షం. అప్పుడు ఆయన ఆంధ్ర విశ్వకళాపరిషత్ వీసీగా ఉన్నారు.
 
 గౌతమి గ్రంథాలయంలో 417 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఇందులో అభిదాన రత్నమాల పేరుతోనే 268 వైద్య గ్రంథాలు కనిపిస్తున్నాయి. గణితం (1), కామశాస్త్రం (1), ఆయుర్వేదం (8), కావ్యాలు (130), ధర్మశాస్త్రాలు (18), కళ (2), వ్యాకరణాలు-నిఘంటువులు (20) వంటివి ఉన్నా యి. ఇవికాక రామాయణ, భారతాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, జ్యోతిషం వంటి అంశాల మీద కూడా తాళపత్రాలు ఉన్నాయి. ఈ పురాతన జ్ఞాన సంపద మన పూర్వీకుల వైవిధ్యం ఎంతటిదో కళ్లకు కడుతుంది. ఇలాంటి గ్రంథాలు ఇంకా ఎన్నో!
 
 చరిత్ర రచనలో శిలాశాసనాలు, రాగిరేకులు, నాణేలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి. వీటితో పాటు చరిత్ర నిర్మాణానికి సాహిత్య ఆధారాలు కూడా అంతే ప్రాముఖ్యం వహిస్తాయి. కాబట్టి ఈ పురాతన జ్ఞాన సంపదను అలా గాలికి వదిలివేస్తే మన మూలాలకు మనమే చెదలు పట్టించుకున్న వాళ్లం అవుతాం. ఈ తాళపత్రాలకు పుస్తక రూపం ఇచ్చి, అందరికీ అందుబాటులోకి తేవలసిన కర్తవ్యం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మీద కూడా ఉం ది. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యతలో ఆం ధ్రప్రదేశ్‌కు 33వ స్థానం మాత్రమే దక్కింది. ఇది అవమానకరం. మన ప్రభుత్వాలు విద్యపట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనాలు. తాళపత్రాల పట్ల నిర్లక్ష్యం అందులో ఒకటి. రెండు రాష్ట్రాలుగా అవత రించిన తరువాత కూడా ఇదే స్థానం కాపాడు కోవా లని నేతలు భావించరాదు. రాష్ట్రాల పునర్ నిర్మాణంలో భాష, సంస్కృతి, ప్రాచీన గ్రంథాల రక్ష ణను భాగంగా చేయాలని ప్రభుత్వాలు భావించాలి.
 (వ్యాసకర్త ప్రముఖ వైద్యులు, నాణేల విశ్లేషకులు)
 మొబైల్: 9848018660

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement