Palm leaf
-
ఆయిల్ పామ్ సాగుతో అందివచ్చే లాభాలు
-
ఆకు పెడుతున్న అన్నం
‘తాటి చెట్టు తల్లి కాదు’ అని సామెత. కానీ తల్లిలానే ఇల్లు నిలబెట్టడానికి తాటి చెట్టు ఇవ్వనిది ఏముంది? కప్పుకు ఆకు.. వంటకు కలపతో సహా. ఉత్తరాంధ్రలో ఆగస్టు నుంచి వ్యవసాయపనులు పెద్దగా ఉండవు. కాని తాటి ఆకుల సేకరణ, గ్రేడింగ్, బొమ్మల తయారీ పని కల్పిస్తోంది. అన్నమూ పెడుతోంది. ఆరునెలల పాటు దొరికే ఈ పనిని అక్కడి స్త్రీలు ఆడుతూ పాడుతూ చేసేస్తున్నారు. తాటాకులకు నీడనిచ్చే లక్షణం ఉంది. అవి ఉత్తరాంధ్రలో చాలామందికి బతుకు నీడను కూడా ఇస్తున్నాయి కళాకృతుల కోసం తాటాకు సేకరణ ఈ సీజన్లో అక్కడ ప్రధాన ఉపాధి. అందుకే నాగమణి, రత్నం వంటి మహిళలు ‘ఆడుతూ పాడుతూ రోజుకు నూటేభై రెండొందల రూపాయలు సంపాదించుకుంటున్నాం. ఇంటి ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. ఆర్నెల్లపాటు ఈ పని ఉంటుంది. నీడ పట్టున ఉంటూ కుటుంబాలను పోషించేందుకు అవసరమైన సంపాదన ఇది’ అంటారు. వీరిది విశాఖ జిల్లా చినదొడ్డిగల్లు. వీరనే ఏముంది విశాఖజిల్లాలోని నక్కపల్లి, వేపాడు, ఎస్.రాయవరం, చినగుమ్ములూరు, ఎలమంచిలి, చోడవరంలాంటి అనేకచోట్ల తాటాకుల సేకరణ, కళాకృతుల కోసం వాటి గ్రేడింగు, కత్తిరింపు చాలామందికి భృతిని కల్పిస్తున్నాయి. కుటీర పరిశ్రమ తాటాకు సేకరణ విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో కుటీర పరిశ్రమగా మారింది. వందలాది మంది తాటాకు కళాకృతుల కోసం అవసరమయ్యే ముడిసరుకు తయారీలో పనిచేస్తున్నారు. ఒక్క విశాఖ జిల్లాలోనే సుమారు 600 మంది వరకు కూలీలు ఉపాధి పొందుతున్నారు. వీరిలో మహిళలే ఎక్కువ. తాటాకు బొమ్మలు వివిధ దశల్లో తయారవుతాయి. అంతిమరూపు కోల్‌కతాలో తీసుకుంటాయి. ప్రాథమిక సేకరణ, గ్రేడింగు, కత్తిరింపు ఉత్తరాంధ్రలో జరుగుతోంది. ఇందుకోసం సేకరణ కేంద్రాలు ఉంటాయి. విశాఖలో నక్కపల్లి, నర్సీపట్నం, కోటవురట్ల, నాతవరం, ఎస్.రాయవరం, రాంబిల్లి అచ్చుతాపురం తదితర గ్రామాల్లో తాటిచెట్ల నుంచి ఆకు సేకరిస్తారు. ఇలా సేకరించిన ఆకును చినదొడ్డిగల్లు, గుమ్ములూరులలో ఉన్న సేకరణ కేంద్రాల వద్దకు తెస్తారు. ఇతర కులాల వారు కూడా తాటాకులను సేకరిస్తారు. ఇలా సేకరించిన 100 ఆకులను రూ.400లకు కొనుగోలు చేస్తారు. గ్రేడింగ్ సేకరించి అమ్ముకునేవారి పని అక్కడితో అయిపోయినట్టే. తర్వాత ఈ ఆకులను ఎండబెడతారు. రద్దు ఆకులను తీసి బాగా ఉన్న ఆకులను వేరు చేయడం కోసం ప్రత్యేకంగా కూలీలను నియమిస్తారు. వీరికి రోజుకు రూ.200 చెల్లిస్తారు. ఈ గ్రేడింగ్ తెలిసిన పనివాళ్లు అయిదొందల మంది వరకూ ఉన్నారు. వీరు సేకరించిన ఆకును ఎండటం కోసం మడదొక్కుతారు. వారు గ్రేడులుగా విభజిస్తారు. తర్వాత కత్తిరించేవారు రంగంలోకి దిగుతారు. వీరు తాటాకులను నునుపుగా చేసి కళాకృతులు తయారు చేసేందుకు గాను ఎనిమిది అంగుళాల సైజులో కత్తిరిస్తారు. ఇలా కత్తిరించి తయారు చేసే ఆకు ఒక్కంటికి 20 పైసల చొప్పున పొందుతారు. వీరు రోజుకు ఐదొందల నుంచి ఏడొందల వరకు సంపాదిస్తారు. ఇలా సైజు చేసిన ఆకులను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం తరలిస్తారు. అక్కడ వాటికి మరిన్ని మెరుగులు దిద్ది కలకత్తా తరలిస్తారు. కలకత్తాలో ఈ తాటాకులతో కళాకృతులు తయారు చేసి విక్రయిస్తారు. ఇళ్లల్లోను, షోకేసుల్లోను, కార్యాలయాలు, షాపులు, మ్యూజియంలు తదితర చోట్ల వీటిని ఉపయోగించుకునే విధంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. రకరకాలుగా, విభిన్న రూపాల్లో చిన్నపాటి సైజుల్లో ఉండే బొమ్మలను తయారు చేసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. రంగుల తాటాకులు విశాఖ జిల్లా చినగుమ్ములూరులో తాటాకులతో తయారు చేసే కళాకృతులకు ముడి సరుకు సరఫరా చేసే కుటీర పరిశ్రమలు దాదాపు 10 వరకు ఉన్నాయి. ఇక్కడ శుద్ధి చేసిన ఆకును కోల్కత్తా, చెన్నై, టూటికారన్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ కుటీర పరిశ్రమల్లో సుమారు వందమందికి పైగా మహిళలు పని చేస్తుంటారు. ఆకులను ఎండబెట్టి గ్రేడులుగా విభజించి ప్యాకింగ్ చేసే పని మొత్తం ఆడవాళ్లే చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేసినందుకు రోజుకు రూ.200లు కూలి వస్తుంది. గ్రేడులుగా విభజించిన తాటాకులకు రంగులు ఇక్కడే వేస్తారు. పింక్, ఎరుపు, ఆరెంజ్, గ్రీన్, వయోలెట్, ఎల్లో వంటి రంగులు వేసి ఎగుమతి చేస్తారు. 25 కిలోల రంగు 1.30 లక్షల బొమ్మలకు సరిపోతుందని చెప్పారు. ఇలా రంగులు వేసిన బొమ్మలు (ముడిసరుకును) వారు నెలకు 6 లక్షల పీసులు ఎగుమతి చేస్తారు. బీసీ కార్పోరేషన్ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెబుతున్నారు. ఆరు మాసాలు పని ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులు పూర్తయి ఖాళీగా ఉన్నవారంతా తాటాకు సేకరణ, ఆకులు గ్రేడింగ్ చేయడం, రద్దు వేరుచేయడం వంటి పనులకు వెళ్తుంటారు. వర్షాకాలంలోనే తాటాకు ఎక్కువగా లభిస్తుందని, వేసవి కాలంలో అయితే ఎండలకు ఆకు రాలిపోవడం కాక వేసవి ధాటికి చెట్లు, పుట్లంట వెళ్లి తాటాకు సేకరణ కష్టమవుతుందని సేకరణ కూలీలు చెబుతున్నారు. అంటే వర్షాకాలం లో ఎటువంటి కష్టం లేకుండా ఒకచోట కూర్చొని చేతినిండా దొరికే పనికోసం గిట్టుబాటు అయ్యే వేతనం కోసం స్థానికంగా ఉండే కూలీలు ఆసక్తి చూపుతుంటారు. – ఆచంట రామకృష్ణ, సాక్షి ప్రతినిధి, నక్కపల్లి, విశాఖ జిల్లా. -
‘చిదంబర’ రహస్యం
►నటరాజస్వామి స్వయంగా రాసిన తాళపత్రాలపై చర్చ ►పుదుచ్చేరి మఠం నుంచి స్వాధీనం చేసుకోవాలని మాజీ మంత్రి పట్టు ►విచారణ జరిపిస్తామని దేవాదాయ మంత్రి సేవూరు రాజేంద్రన్ వెల్లడి చెన్నై: దేవుడు ఉన్నాడు అంటారు ఎందరో, లేడు అంటారు మరికొందరు. ఉంటే బాగుండేదని బాధపడుతుంటారు కొంతమంది. అయితే ప్రస్తుత చర్చనీయాంశంగా మారిన విషయం వీటన్నింటి కంటే ఒక అడుగు మించింది. చిదంబరం నటరాజస్వామి స్వయంగా రాసినట్లుగా భావిస్తున్న తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయి, పుదుచ్చేరి పీఠంలో ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారం నిజమేనా, స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా అనే అంశాలు చిదంబర రహస్యంగా మారాయి. చిదంబరం నటరాజస్వామి ఆలయానికి మనిషి రూపంలో దేవదేవుడే వచ్చి తాళపత్రాలలో తిరువాచక గీతాలను రాసి ఆలయానికి అప్పగించారని భక్తుల విశ్వాసం. ఈ తాళపత్రాలు ప్రస్తుతం పుదుచ్చేరిలోని అంబలత్తాడి మఠంలో ఉన్నట్లు సమాచారం. ఆ తాళపత్రాలను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలనే డిమాండ్‌తో కొత్త చర్చ బయలుదేరింది. ఈ చర్చను లేవనెత్తింది వేరెవరో కాదు తమిళనాడు ప్రభుత్వ దేవదాయ, ధర్మాదాయశాఖ మాజీ మంత్రి వీవీ స్వామినాథన్. నటరాజ పెరుమాళ్ స్వయంగా రాసిన ఆ తాళపత్రాలు చిదంబరం ఆలయ సొత్తు కావడంతో దానిని స్వాధీనం చేసుకోవాలంటూ ఆలయ నిర్వాహకులకు, కడలూరు జిల్లా కలెక్టర్, దేవదాయశాఖ, విగ్రహాల అక్రమరవాణా నిరోధక శాఖ, పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు స్వామినాథన్ ఇటీవల లేఖ రాశారు. ఈ ఉత్తరంపై విచారణ జరపాల్సిందిగా గవర్నర్ కిరణ్‌బేడీ పోలీస్‌శాఖను ఆదేశించారు. పురాణం ఏమీ చెబుతోందంటే.. శివ క్షేత్రాలను దర్శించుకుంటూ చిదంబరం నటరాజస్వామి ఆలయానికి వచ్చిన మాణిక్యవాచకర్ అనే మహాభక్తుడు అక్కడి శివుడిని దర్శించుకున్న తరువాత అదే ఊరిలో నివాసం ఏర్పరుచుకున్నారు. ఆ నివాసానికి ఒక వృద్ధుడు వచ్చి శివపెరుమాళ్ ఆజ్ఞతో తాను ఇక్కడికి చేరుకున్నానని పరిచయం చేసుకుని మాణిక్యవాసగర్ భక్తిని మెచ్చుకున్నాడు. వృద్ధుని కోర్కె మేరకు శివపెరుమాళ్ గురించి మాణిక్యవాసగర్ భక్తి పాటలు ఆలపించాడు. ఆయన ఆలపించిన 400 గీతాలను వృద్ధుడు తాటాకు పత్రాలపై రాసి తనతోపాటు తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఆలయాన్ని తెరిచిన అర్చకుడు అక్కడి మెట్లపై ఉన్న తాళపత్రాలను చూసి ఊరిపెద్దలకు సమాచారం ఇచ్చాడు. ఆ తాళపత్రాల్లో తిరువాసగ శ్లోకాలు, తిరుక్కోవయార్ రచించిన 400 శ్లోకాలు కూడా చోటుచేసుకున్నాయి. ఊరిపెద్దలంతా కలిసి తిరువాచగర్ను ఆలయానికి పిలిపించగా తాళపత్రాల్లోని పాటలను ఆలపించాడు. నా గీతాల్లోని భావాలకు మూలకర్త నట రాజస్వామినే అని చెబుతూ స్వామి వారిలో మాణిక్యవాచగర్ ఐక్యమైపోయాడు. నటరాజర్ స్వయంగా రాసినట్లు భావిస్తున్న సదరు తాళపత్రాలు ప్రస్తుతం పుదుచ్చేరి అంబలతావడి మఠం స్వాధీనంలో ఉన్నట్లు సమాచారం. మాణిక్యవాచగర్ పాడుతుండగా సాక్షాత్తు నటరాజస్వామినే తాళపత్రాల్లో రాశాడని మాజీ మంత్రి స్వామినాథన్ అంటున్నారు. చిదంబరంలోని ఆరుముగనావలర్ స్కూల్లో ఈ తాళపత్రాలను ప్రదర్శనగా ఉంచినపుడు తాను చూసి ఉన్నానని చెప్పారు. ఈ తాళపత్రాలను తమిళనాడు ప్రభుత్వం వెంటనే స్వాధీ నం చేసుకుని తగిన భద్రతతో భక్తుల సందర్శనకు ఉంచాలని ఆయన కో రారు. అంబలత్తాడి మఠంలో నట రాజ స్వామి పాదాలకు సమీపంలో సుమారు ఒకటిన్నర అడుగు వెడల్పు, ఒక అడుగు ఎత్తు ఉన్న వెండి పీట ఉంది. ఈ పీటలోనే తాళపత్రాలు ఉన్నట్లుగా అంబలత్తాడి మఠం 33వ మఠాధిపతి కనకసభాపతి స్వామి చెబుతున్నారు. పూర్తిగా సీల్ వేసినట్లుగా ఉన్న పీటను ఏ కారణం చేత కూడా విప్పిచూడడం, పరిశోధన చేయడమో కూడదని తమ పూర్వీకులు సూచించినట్లు స్వామి తెలి పారు. మాస శివరాత్రి రోజుల్లో రాత్రి 11 గంటల సమయంలో వెండి పీటను కేవలం ఒక గంటపాటు భక్తుల సందర్శనార్థం ఉంచుతున్నామని స్వామి చెప్పారు. 350 ఏళ్ల కిత్రం జరిగిన కర్ణాటక యుద్ధం సమయంలో చిదంబరం మఠంలోని నటరాజస్వామి విగ్రహం, తాళపత్రాలు వస్తువులను పుదుచ్చేరి మఠంలో భద్రపరిచినట్లు స్థలపురాణంలో పేర్కొన్నారు. పుదుచ్చేరి మఠంలోని తాళపత్రాలు మాణిక్యవాసగర్ కాలం నాటివేనని అక్కడి అర్చకులు అంగీకరిస్తున్నారు. ఈ తాళపత్రాల నకళ్లు మయిలాడుదురై, చిదంబరం ఆలయాల్లో ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. తాళపత్రాల వ్యవహారంపై చిదంబరం ఆలయ దీక్షితులు ఉమానా«థ్ మాట్లాడుతూ నటరాజస్వామి స్వయంగా రాసినట్టు చెపుతున్న తాళపత్రాలు తమ ఆలయానికి చెంది నవి అని నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవు, అందుకే ఆలయ నిర్వాహకులు వాటిని స్వాధీనం చేసుకోవడంపై ఆసక్తి చూపడం లేదని అన్నారు. విచారణ జరిపిస్తాం తాళపత్రాల విషయం ఇటీవల తన దృష్టికి వచ్చిందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖా మంత్రి సేవూరు రామచంద్రన్ ఇటీవల మీడియాతో అన్నారు. తాళపత్రాలు నటరాజస్వామి ఆలయానికి చెందినవి అనే వాదనపై అధికారుల పూర్తిస్తాయి విచారణ జరిపిస్తానని అన్నారు. విచారణపై నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు....సేవూరు రామచంద్రన్ -
పా‘తాళపత్రాల’కు విముక్తి ఏది?
విశ్లేషణ ఇక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాలను పరిచయం చేస్తూ వాటి వివరాలతో 1933లో ఒక పుస్తకం వెలువడింది. దీనికి ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందుమాట రాయడం విశేషం. తెలుగుకు ప్రాచీన భాష హోదా తెచ్చుకున్నాం. కానీ భవిష్యత్తులో కూడా మన మాతృభాషను సజీవంగా ఉంచడం ఎలాగో ఆలోచించడం మరిచిపోయాం. రాగి రేకుల మీద, రాతి ఫలకాల మీద ఉన్న ప్పటికీ, తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్నప్పటికీ, ప్రాచీనమైనప్పటికీ భాషా సంపదను పరిరక్షించుకోవడం అందరి కర్తవ్యం. కొత్తగా వచ్చినదంతా ఎలా శిరోధార్యం కాదో, ప్రాచీ నమైనదంతా కూడా తిరస్కరించదగినది కాదు. భాష, సాహిత్యాలు ఆవిర్భావం నుంచి పరిగణనలో నికి తీసుకోవాలి. అప్పుడే అది సంపద అనిపించు కుంటుంది. అందుకే దానిని పరిరక్షించాలి. కానీ, మన రెండు రాష్ర్ట ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించ కపోతే జరిగే నష్టం అపారం. ఉదాహరణకి తంజా వూరు సరస్వతి మహల్, రాజమండ్రి గౌతమి గ్రంథాలయాలలో మగ్గుతున్న తాళపత్ర గ్రంథాల గురించి పరిశీలిద్దాం. ఒకప్పుడు తాళపత్రాలూ, గంటమే రాత పరిక రాలు. సరస్వతీ మహల్, గౌతమి, ఎస్వీ విశ్వవిద్యా లయం, వేటపాలెం వంటి చోట ఇప్పటికీ ఈ తాళప త్రాలు ఉన్నాయి. దూరదృష్టి కలిగిన వారు వాటిని గౌరవిస్తూ రేపటితరాల కోసం పరిరక్షించుకుంటూ వచ్చారు. కానీ ఏ తాళపత్రమైనా రెండుమూడొందల సంవత్సరాలకు మించి ఉండదు. అది శిథిలావస్థకు చేరుతూ ఉండగానే మరోసారి రాయించుకునేవారు. ఇంత శ్రద్ధకు కారణం వాటిలో ఉన్న విషయమే. తాళ పత్రాలంటే కేవలం కావ్యాలు, వేదాంతం బోధించేవ నుకుంటే మూర్ఖత్వం. తంజావూరు గ్రంథాలయం లో మొత్తం 778 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. 11వ శతాబ్దం నుంచి పేర్గాంచిన గ్రంథాలను ఇందు లో గమనిస్తాం. వీటిలో 455 పుస్తక రూపం దాల్చా యి. మరో 232 అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి. అంటే పరిష్కృతమైనాయి. అసలు అచ్చుకు సంబంధించి ఎవరి దృష్టికీ రాకుండా ఉండిపోయినవి 91. అలాగే కాగితం మీద రాసి పెట్టి ఉంచిన అముద్రితాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో సాహిత్యం, వ్యాకర ణం, ఆర్ష వాజ్ఞయం, తర్కం, జ్యోతిష్యం వంటివా టితో పాటు వైద్యం, గణితం, లోహాల మీద అధ్య యనం వంటివి కూడా ఉన్నాయి. రాయలవారి ‘ఆముక్తమాల్యద’ తాళపత్ర గ్రంథం కూడా వీటిలో ఉంది. వీటిని అక్కడే పని చేస్తున్న రవి అనే గ్రంథా లయాధికారి వర్గీకరించారు. ఇక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాలను పరిచయం చేస్తూ వాటి వివరాలతో 1933లో ఒక పుస్తకం వెలువడింది. దీనికి ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందుమాట రాయడం విశే షం. అప్పుడు ఆయన ఆంధ్ర విశ్వకళాపరిషత్ వీసీగా ఉన్నారు. గౌతమి గ్రంథాలయంలో 417 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఇందులో అభిదాన రత్నమాల పేరుతోనే 268 వైద్య గ్రంథాలు కనిపిస్తున్నాయి. గణితం (1), కామశాస్త్రం (1), ఆయుర్వేదం (8), కావ్యాలు (130), ధర్మశాస్త్రాలు (18), కళ (2), వ్యాకరణాలు-నిఘంటువులు (20) వంటివి ఉన్నా యి. ఇవికాక రామాయణ, భారతాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, జ్యోతిషం వంటి అంశాల మీద కూడా తాళపత్రాలు ఉన్నాయి. ఈ పురాతన జ్ఞాన సంపద మన పూర్వీకుల వైవిధ్యం ఎంతటిదో కళ్లకు కడుతుంది. ఇలాంటి గ్రంథాలు ఇంకా ఎన్నో! చరిత్ర రచనలో శిలాశాసనాలు, రాగిరేకులు, నాణేలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి. వీటితో పాటు చరిత్ర నిర్మాణానికి సాహిత్య ఆధారాలు కూడా అంతే ప్రాముఖ్యం వహిస్తాయి. కాబట్టి ఈ పురాతన జ్ఞాన సంపదను అలా గాలికి వదిలివేస్తే మన మూలాలకు మనమే చెదలు పట్టించుకున్న వాళ్లం అవుతాం. ఈ తాళపత్రాలకు పుస్తక రూపం ఇచ్చి, అందరికీ అందుబాటులోకి తేవలసిన కర్తవ్యం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మీద కూడా ఉం ది. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యతలో ఆం ధ్రప్రదేశ్‌కు 33వ స్థానం మాత్రమే దక్కింది. ఇది అవమానకరం. మన ప్రభుత్వాలు విద్యపట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనాలు. తాళపత్రాల పట్ల నిర్లక్ష్యం అందులో ఒకటి. రెండు రాష్ట్రాలుగా అవత రించిన తరువాత కూడా ఇదే స్థానం కాపాడు కోవా లని నేతలు భావించరాదు. రాష్ట్రాల పునర్ నిర్మాణంలో భాష, సంస్కృతి, ప్రాచీన గ్రంథాల రక్ష ణను భాగంగా చేయాలని ప్రభుత్వాలు భావించాలి. (వ్యాసకర్త ప్రముఖ వైద్యులు, నాణేల విశ్లేషకులు) మొబైల్: 9848018660