కళ్లు తెరుస్తారా?
మ్యాగీ నూడుల్స్ లో సీసం, మోనో సోడియం గ్లుటామే ట్ (ఎమ్‌ఎస్‌జీ) ఉన్నాయని బయట పడటంతో భారత అధికార వ్యవస్థ దాని వెంట పడింది. మ్యాగీ తయారీదా రైన ‘నెస్లే’ తమ ఉత్పత్తిని తాత్కాలికంగా ఉపసంహరించిందే గానీ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. ఇంకా అది తమ ఉత్పత్తి మంచి దేనని అంటూనే ఉంది. వాస్తవాలతో బండకేసి బాదే వరకు కూడా పాశ్చాత్య దేశాల్లోని చాలా ఆహార ఉత్పత్తుల తయారీదారుల్లా అదీ కూడా అదేపాట పాడుతుంది. అయితే అదో సుదీర్ఘ క్రమం.
ఒక బహుళ జాతి సంస్థ పరాక్రమం ముందు భారత ప్రభుత్వ ప్రతాపం నిలవగలు గుతుందా అనేది వేచి చూడాల్సిందే. మ్యాగీ వ్యవహారమైనా వినియోగదారుల సమస్యల పై ప్రభుత్వానికి మేలుకొలుపు కాగలదని అనుకుందాం. వినియోగదారులు ద్రవ్యోల్బ ణం వల్ల మాత్రమే కాదు, చెల్లించిన డబ్బు కు సరిపడా విలువను పొందలేక కూడా నష్టపో తున్నారు. తాగునీటి నాణ్యత నుండి మొదలై కూరగాయల దుకాణదారుల వరకు పట్టపగలు దోపిడీ సర్వత్రా సాగుతోంది. వినియోగ దారుడు రాజు కాదు, మోసపోవాల్సిన వెర్రి బాగులోడు.
పెద్ద పెద్ద స్టోర్స్‌లోని దిగుమతి చేసుకున్న యాపిళ్లను తాజాగా, నవనవలాడుతూ ఉంచడానికి పళ్ల మీద మైనం పూత పూసి ఉంటుంది. అది ఆహారం కలుషితం కావడం తో సమానమే. అయినా ఆ విషయమై ఏ హెచ్చరికా ఉండదు. ఈసారి, ఓ చిన్న కత్తి తీసుకుని దానిపై మైనపు పొరను గీకి చూడం డి... నిర్ఘాంతపోతారు. అది డాక్టర్‌ను దూరం గా ఉంచే యాపిల్ కాదు. యూరప్, బ్రిటన్‌లు మన మామిడి పండ్లలో పురుగు (ఫైర్ ఫ్లై) ఉం టోందని వాటి దిగుమతులను నిషేధించాయి. కానీ వాటిని తినొద్దని మనల్ని హెచ్చరించిన సంస్థేదీ లేదు. బ్రిటిష్‌వాళ్లలాగా మనం చాదస్తులం కాకపోవడమే కారణం కావచ్చు.
దేశంలోని 66 శాతం పాలల్లో నీళ్లు, గ్లూకోజ్, వెన్న తీసేసిన పాలు, చివరికి సబ్బు పొడి సైతం కల్తీ అయినవేనని కేంద్రం 2012 అక్టోబర్లో సుప్రీం కోర్టుకు నివేదించింది. మన ఆహార రక్ష ణ, ప్రమాణాల సంస్థ దీన్ని మహా సుతారంగా ‘‘ప్రమాణాల నుండి వైదొల గడం’’గా పేర్కొంది. మసాలా దినుసుల పొడుల్లో రంపపు పొట్టుకు, బియ్యంలో ప్లాస్టిక్ బియ్యానికి, బ్లీచింగ్ పౌడర్‌లో చాక్ పౌడర్‌కి, దీపావళి పండుగ సమయంలో కల్తీ కోవాకు మనం అలవాటు పడిపోయాం. తప్పుడు తూకం పుణ్యమాని కిలోకి డబ్బులిచ్చినా మనకు దక్కేది 800 గ్రాముల కూరగాయలే. ఇక ఆటోరిక్షాల మీటర్లను తారుమారు చేయడం సర్వసాధారణం.
దుర్భిక్ష పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో సర్వత్రా కనిపించే నీటి ట్యాంకర్లు మరో భీతావహక అంశం. సరఫరా చేసే ఆ నీరు ఎక్క డి నుంచి తెచ్చిందో, శుద్ధి చేసినదో కాదో, ఎలా శుద్ధి చేశారో వినియోగదారులకు చెప్పరు. డబ్బిచ్చి తెప్పించుకున్నవే అయినా ఆ ట్యాం కర్లను తనిఖీ చేశారో లేదో వినియోగదా రులకు తెలియదు. అది తాగునీరేనని తెలిసి గాక, విశ్వాసంతో తాగేస్తారంతే. విస్తరిస్తున్న నగరాలు సైతం ఇలాంటి నీటి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నాయి. బోరు నీరు కఠిన జలం కాబట్టి సీసాల్లోని నీరు కొనుక్కోక తప్పదు.
స్థానిక సంస్థలు సరఫరా చేసేదీ అనుమా నాస్పదమైన నీరే. కాబట్టేనేమో ఇద్దరు ఎంపీలు సచిన్ టెండూల్కర్, హేమామాలిని అందరికీ పరిశుభ్రమైన తాగునీటి సరఫరాకు హామీ ఉండేలా చట్టాలను చేయడానికి బదులు... వాటర్ ప్యూరిఫయర్లు కొనుక్కో మని ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ వీధు ల్లోని తినుబండారాల్లో, రెస్టారెంట్ల ఆహారంలో ఇ.కోలీ అత్యధిక స్థాయిలో లేదా మానవ మల కాలుష్యం ఉండటానికి ఒక కారణం కలుషితమైన నీరే. వీధుల్లో వంటకాలను తయారు చేయడానికి వ్యతిరేకంగా బొంబాయి హైకోర్టు ఆదేశాలున్నా వాటిని విస్మరించారు.
సీసం, మోనోసోడియం గ్లుటామేట్ (ఎమ్‌ఎస్‌జీ)లు ఉండటంతో నూడుల్స్ వల్ల కలిగే ఆరోగ్యపరమైన విపత్తులపై ఆందోళన వెల్లువెత్తడం ఆహ్వానింపదగిన పరిణామం. దేశ పౌరుల ఆరోగ్యం పట్ల, ప్రత్యేకించి మ్యాగీ ఓ అద్భుతమని నమ్మిస్తున్న పిల్లల ఆరోగ్యం గురించి పట్టింపున్నవారు మొత్తానికి ఎవరో ఒకరున్నారన్న మాట. కానీ సర్వత్రా వినియో గదారుల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తు న్న తీరును చూస్తుంటే...ఆ అంశంపై చూపాల్సి ఉన్న శ్రద్ధకు ఇది ప్రారంభమేనని ఆశించాలి.
మనం వినియోగిస్తున్న ఆహారం నాణ్యత విషయంలో భారత అధికార యంత్రాంగం ఎంతగా చేతులు ముడుచుకు కూచున్నదంటే మ్యాగీలో అవి ఉన్నాయని కూడా మనకు తెలి యదు. ఫలానా వస్తువును వినియోగించడం వల్ల ఫలానా ప్రమాదాలున్నాయని అధికారు లు ఎన్నిసార్లు ప్రకటించి ఉంటారు? ఉదా హరణకు, ఆహార రక్షణ, ప్రమాణాల సంస్థ 2013లో ఐదు, 2014లో మూడు, ఈ ఏడాది ఒక్కటి మాత్రమే అలాంటి ప్రకటనలు చేసింది. ఆశ్చర్యకరంగా కేంద్ర ప్రభుత్వం మ్యాగీపై వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, అది మాత్రం నోరు మెదప లేదు. ప్రజలలో ఏమంత అవగాహనను పెం పొందింపజేయకుండానే భారత వినియోగ దారులను వారి మానానికి వారిని వదిలేశారు. ఎవరో కొందరు సాహసికులైన వినియోగ దార్లు మాత్రమే వినియోగదారుల కోర్టుల తలుపు తట్టి, సమస్యలను పరిష్కరించుకుం టారు. అయితే వాటిలో చాలావరకు అభిలష ణీయంగా పనిచేయడం లేదు.
వ్యాజ్యదారులు కావాల్సినవారు అవి కూడా కోర్టుల కెక్కినట్టే చాలా కాలహరణం, ఖరీదైన లాయర్లు, వాయిదాలు, అంతులేని జాప్యాలమయమని భావిస్తుంటారు. అలాంటివారికి మద్దతునం దించే యంత్రాంగం ఉనికిలో లేకపోవడం విచారకరం.
(వ్యాసకర్త: మహేష్ విజా పుష్కర్ సీనియర్ పాత్రికేయులు)