mahesh vija pushkar
-
నీటి ఎద్దడి భారత్.. జల సమృద్ధ ఇండియా..
సందర్భం భారత్ పట్టణీకరణకు గురవుతోంది. కానీ కొత్తగా ఏర్పడుతున్న నగరాలతో కాదు. ప్రస్తుతం ఉన్న నగరాల విస్తరణతో, పెరుగుతున్న జనసాంద్రతతో దేశంలో పట్టణీకరణ వ్యాప్తి చెందుతోంది. ఇది నగరాల నిర్వహణపై లోతైన ప్రశ్నలను సంధిస్తోంది. నిర్వహణ అంటే పౌర స్వయం పాలన అనేది అన్ని నగరాలకూ సమాన ప్రయోజనాలను అందివ్వడం అని అర్థం. స్వయం పాలన అంటేనే ప్రజాస్వామ్యం. ఈ కోణం లోంచి చూస్తే, మన నగరాలు ఒక సెక్షన్ పౌరుల జీవి తాలను మాత్రమే మెరుగుపరుస్తున్న స్థితిలో గ్రామాలు తమ వాటా ప్రయోజనాలను పొందకుండా మనం వాటిని కొల్లగొడుతున్నామా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఉదాహరణకు, మానవ మనుగడకు అతి ప్రధాన మైన వనరులలో తాగునీరు ఒకటి. మన నగరాలు మరింత వ్యవస్థీకృత పద్ధతిలో నీటిని పొందుతున్నారను కుందాం. అలాంటి పరిస్థితిలో కూడా ప్రతి ఒక్కరూ తమ వంతు వాటా పొందుతున్నట్లు చెప్పలేం. నగరాలలో నీటి సరఫరాలో వ్యత్యాసాలు ఉంటున్నాయి. తలసరి నీటి లభ్యత అనేది అత్యంత సగటు స్థితిలోనే అందుబాటులో ఉంటోందే తప్ప వాస్తవార్థంలో కాదు. నీటి తొట్టెల్లో స్నానం చేయగలిగిన వ్యక్తి మాత్రమే తలసరి పరిమాణం కంటే ఎక్కువ నీటిని పొందగలుగు తున్నట్లు లెక్క. కానీ పక్కనే పూరిగుడెసెల్లో ఉన్న వారుమాత్రం ఆ రోజుకు అవసరమైన తాగునీటికి సైతం ఎక్కడెక్కడికో పరుగులు తీయవలసిన పరిస్థితులు ఉంటున్నాయి. గణాంకాలు ఈ వివరాలను దాచిపెడు తుంటాయి. కానీ, ప్రత్యేకించి మహారాష్ట్ర వంటి ఒక పెద్ద రాష్ట్రానికి సంబంధించి నీటి సరఫరాలో స్థూల వ్యత్యా సాలను వివరించడానికి సాధారణంగా మనం గణాంకా లమీదే ఆధారపడాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని నగరాలు అక్కడి గ్రామాల కంటే 400 రెట్లు అధికంగా నీటిని పొందుతున్నాయని గణాంకాలు నివేదిస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా పట్టణీకరణకు గురయిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటున్నప్పటికీ మహారాష్ట్రలో గ్రామీణ-పట్టణ నిష్పత్తులు మాత్రం ఆ స్థాయి పరిమా ణంలో లేవు. నేటికీ మహారాష్ట్రలో 45 శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. పట్టణాల నీటి అవసరాల కోసం రిజర్వాయర్లు, సరస్సుల్లో నిల్వ చేసి ఉంచుతుంటారు కాని గ్రామీణ ప్రాంతాలకు మాత్రం అలాంటి సౌకర్యాలు ఏవీ లేవు. అంటే గ్రామాలు నేటికీ బావులు, గొట్టపుబావుల్లోని నీటిని మాత్రమే వాడుకుంటుంటారన్నది ఒక అంచనాపై ఆధారపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇదెలా ఉం టుందంటే రేషన్ షాపుల్లో నాసిరకం ధాన్యాలు మాత్రమే ఉంటున్నందున పేదలు వాటితోటే తమ కడుపు నింపు కుంటున్నారని చెబుతున్నట్లుగా ఉంటుంది. నా దృష్టిలో అలాంటి నీటివనరులపై ఆధారప డటం అంటే భరోసా ఉన్న రక్షిత నీటి సదుపాయం అని అర్థం కాదు. ఇది ఒక విధంగా తీవ్రమైన విధానపరమైన ఉపేక్షనే సూచిస్తుంది. అడుగంటుతున్న భూగర్భ జల వనరులను విచ్చలవిడిగా తోడేయకుండా క్రమబద్ధీకరిం చడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ కూడా ఉంది. మరోవైపున ప్రజలు దానికి కట్టుబడాల్సి ఉంటుం దని భావిద్దాం. లభ్యమవుతున్న నీటి వనరులన్నింటినీ ఒక సెక్షన్ ప్రజలకే అందజేస్తూ, జనాభాలోని అతి పెద్ద విభాగం అవసరాలను తోసిపుచ్చడం ద్వారా ఇలాంటి వైరుధ్యాలను ఒక రాష్ట్రం ఎలా ఆమోదిస్తుందన్న విష యాన్ని ఇది వివరించడం లేదు. విషాదకరమైన విషయం ఏమిటంటే,నీటి ఎద్దడితో ఎండిపోయిన గ్రామాలనుంచి ముంబై వైపుగా భారీ నీటి గొట్టాలు సాగిపోతుంటాయి. గ్రామీణులు ఈ అన్యా యంపై అభ్యంతరం చెప్ప వచ్చు. కాని పట్టణ డిమాండ్ శక్తి ముందు వీరు మౌనం పాటిస్తుంటారు. ఇది మండ టానికి సిద్ధంగా ఉంటున్న వత్తుల పెట్టెలా మారవచ్చు. గ్రామీణ ప్రాంతం మొత్తంగా నీటికోసం అంగలా ర్చుతుండగా, ముంబై మెట్రో ప్రాంతం, పుణేతో కూడిన ఒక పరిమిత ప్రాంతం అత్యధికంగా నీటి సరఫరా పొందుతున్న స్థితిని పోల్చి చూస్తే ఈ వ్యత్యాసం స్థాయి ఏమిటో అర్థమవుతుంది. చివరకు ముంబై మెట్రోపాలి టన్ ప్రాంతం పరిధిలో కూడా తాగు నీరు తెచ్చుకోవడా నికి స్థానికులు దివా నుంచి కాల్వా ప్రాంతానికి లోకల్ రైలులో ప్రయాణిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చి చూస్తే 400 రెట్లు అధికంగా సరఫరా అవుతున్న నీటిలో సగంపైగా నీటిని ముంబై, పుణే మెట్రోపాలిటిన్ ప్రాంతాలు మాత్రమే తాగిపడేస్తున్నాయి. హైదరాబాద్‌లో చాలావరకు శివారు ప్రాంతాల్లో నీటి ట్యాంకులతో తాగునీటిని సరఫరా చేస్తుంటారు. కరువు కాలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వేళాపాళా లేకుండా వచ్చే నీటి ట్యాంకు కోసం ప్రజలు కళ్లలో వత్తులు వేసి మరీ చూస్తుంటారు. తమ వంతు తీసుకున్న తర్వాత బకెట్ నీళ్లు ఎప్పుడు దొరుకు తాయో అక్కడ ఎవరికీ అంతుపట్టని స్థితి. అయితే ప్రభుత్వాలు రక్షిత మంచి నీటిని గ్రామీణ ప్రాంతాలకు అందించే ప్రయత్నాలు చేయలేదని దీనర్థం కాదు. ఈ ప్రాజెక్టుల నిర్వహణ పేల వంగా ఉంటున్నందున వీటి ప్రయోజనం నెరవేరటం లేదు. ఇలాంటి సందర్భాల్లో గ్రామీణులు ఎప్పుడొ స్తుందో తెలీని నీటి ట్యాంకుల కోసం ఎదురు చూస్తూ ఉండటం తప్పనిసరి అవుతోంది. నీటి సరఫరాలోని వ్యత్యాసాలకు సంబంధించి మహారాష్ట్రలో గణాంకాలు సుస్పష్టంగా వెల్లడిస్తున్న ట్లుగా దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య కాస్త తేడా ఉండవచ్చు. ఈ సందర్భంగా శరద్‌జోషి వివరణను మళ్లీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇండియా ఉంటున్నట్లే అక్కడ భారత్ కూడా ఉంటోంది. వీటిలో ఏది మరొక దానితో సమవర్తన కలిగి ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు మరి. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు: మహేష్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
కళ్లు తెరుస్తారా?
మ్యాగీ నూడుల్స్ లో సీసం, మోనో సోడియం గ్లుటామే ట్ (ఎమ్ఎస్జీ) ఉన్నాయని బయట పడటంతో భారత అధికార వ్యవస్థ దాని వెంట పడింది. మ్యాగీ తయారీదా రైన ‘నెస్లే’ తమ ఉత్పత్తిని తాత్కాలికంగా ఉపసంహరించిందే గానీ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. ఇంకా అది తమ ఉత్పత్తి మంచి దేనని అంటూనే ఉంది. వాస్తవాలతో బండకేసి బాదే వరకు కూడా పాశ్చాత్య దేశాల్లోని చాలా ఆహార ఉత్పత్తుల తయారీదారుల్లా అదీ కూడా అదేపాట పాడుతుంది. అయితే అదో సుదీర్ఘ క్రమం. ఒక బహుళ జాతి సంస్థ పరాక్రమం ముందు భారత ప్రభుత్వ ప్రతాపం నిలవగలు గుతుందా అనేది వేచి చూడాల్సిందే. మ్యాగీ వ్యవహారమైనా వినియోగదారుల సమస్యల పై ప్రభుత్వానికి మేలుకొలుపు కాగలదని అనుకుందాం. వినియోగదారులు ద్రవ్యోల్బ ణం వల్ల మాత్రమే కాదు, చెల్లించిన డబ్బు కు సరిపడా విలువను పొందలేక కూడా నష్టపో తున్నారు. తాగునీటి నాణ్యత నుండి మొదలై కూరగాయల దుకాణదారుల వరకు పట్టపగలు దోపిడీ సర్వత్రా సాగుతోంది. వినియోగ దారుడు రాజు కాదు, మోసపోవాల్సిన వెర్రి బాగులోడు. పెద్ద పెద్ద స్టోర్స్‌లోని దిగుమతి చేసుకున్న యాపిళ్లను తాజాగా, నవనవలాడుతూ ఉంచడానికి పళ్ల మీద మైనం పూత పూసి ఉంటుంది. అది ఆహారం కలుషితం కావడం తో సమానమే. అయినా ఆ విషయమై ఏ హెచ్చరికా ఉండదు. ఈసారి, ఓ చిన్న కత్తి తీసుకుని దానిపై మైనపు పొరను గీకి చూడం డి... నిర్ఘాంతపోతారు. అది డాక్టర్‌ను దూరం గా ఉంచే యాపిల్ కాదు. యూరప్, బ్రిటన్లు మన మామిడి పండ్లలో పురుగు (ఫైర్ ఫ్లై) ఉం టోందని వాటి దిగుమతులను నిషేధించాయి. కానీ వాటిని తినొద్దని మనల్ని హెచ్చరించిన సంస్థేదీ లేదు. బ్రిటిష్వాళ్లలాగా మనం చాదస్తులం కాకపోవడమే కారణం కావచ్చు. దేశంలోని 66 శాతం పాలల్లో నీళ్లు, గ్లూకోజ్, వెన్న తీసేసిన పాలు, చివరికి సబ్బు పొడి సైతం కల్తీ అయినవేనని కేంద్రం 2012 అక్టోబర్‌లో సుప్రీం కోర్టుకు నివేదించింది. మన ఆహార రక్ష ణ, ప్రమాణాల సంస్థ దీన్ని మహా సుతారంగా ‘‘ప్రమాణాల నుండి వైదొల గడం’’గా పేర్కొంది. మసాలా దినుసుల పొడుల్లో రంపపు పొట్టుకు, బియ్యంలో ప్లాస్టిక్ బియ్యానికి, బ్లీచింగ్ పౌడర్‌లో చాక్ పౌడర్‌కి, దీపావళి పండుగ సమయంలో కల్తీ కోవాకు మనం అలవాటు పడిపోయాం. తప్పుడు తూకం పుణ్యమాని కిలోకి డబ్బులిచ్చినా మనకు దక్కేది 800 గ్రాముల కూరగాయలే. ఇక ఆటోరిక్షాల మీటర్లను తారుమారు చేయడం సర్వసాధారణం. దుర్భిక్ష పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో సర్వత్రా కనిపించే నీటి ట్యాంకర్లు మరో భీతావహక అంశం. సరఫరా చేసే ఆ నీరు ఎక్క డి నుంచి తెచ్చిందో, శుద్ధి చేసినదో కాదో, ఎలా శుద్ధి చేశారో వినియోగదారులకు చెప్పరు. డబ్బిచ్చి తెప్పించుకున్నవే అయినా ఆ ట్యాం కర్లను తనిఖీ చేశారో లేదో వినియోగదా రులకు తెలియదు. అది తాగునీరేనని తెలిసి గాక, విశ్వాసంతో తాగేస్తారంతే. విస్తరిస్తున్న నగరాలు సైతం ఇలాంటి నీటి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నాయి. బోరు నీరు కఠిన జలం కాబట్టి సీసాల్లోని నీరు కొనుక్కోక తప్పదు. స్థానిక సంస్థలు సరఫరా చేసేదీ అనుమా నాస్పదమైన నీరే. కాబట్టేనేమో ఇద్దరు ఎంపీలు సచిన్ టెండూల్కర్, హేమామాలిని అందరికీ పరిశుభ్రమైన తాగునీటి సరఫరాకు హామీ ఉండేలా చట్టాలను చేయడానికి బదులు... వాటర్ ప్యూరిఫయర్లు కొనుక్కో మని ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ వీధు ల్లోని తినుబండారాల్లో, రెస్టారెంట్ల ఆహారంలో ఇ.కోలీ అత్యధిక స్థాయిలో లేదా మానవ మల కాలుష్యం ఉండటానికి ఒక కారణం కలుషితమైన నీరే. వీధుల్లో వంటకాలను తయారు చేయడానికి వ్యతిరేకంగా బొంబాయి హైకోర్టు ఆదేశాలున్నా వాటిని విస్మరించారు. సీసం, మోనోసోడియం గ్లుటామేట్ (ఎమ్ఎస్జీ)లు ఉండటంతో నూడుల్స్ వల్ల కలిగే ఆరోగ్యపరమైన విపత్తులపై ఆందోళన వెల్లువెత్తడం ఆహ్వానింపదగిన పరిణామం. దేశ పౌరుల ఆరోగ్యం పట్ల, ప్రత్యేకించి మ్యాగీ ఓ అద్భుతమని నమ్మిస్తున్న పిల్లల ఆరోగ్యం గురించి పట్టింపున్నవారు మొత్తానికి ఎవరో ఒకరున్నారన్న మాట. కానీ సర్వత్రా వినియో గదారుల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తు న్న తీరును చూస్తుంటే...ఆ అంశంపై చూపాల్సి ఉన్న శ్రద్ధకు ఇది ప్రారంభమేనని ఆశించాలి. మనం వినియోగిస్తున్న ఆహారం నాణ్యత విషయంలో భారత అధికార యంత్రాంగం ఎంతగా చేతులు ముడుచుకు కూచున్నదంటే మ్యాగీలో అవి ఉన్నాయని కూడా మనకు తెలి యదు. ఫలానా వస్తువును వినియోగించడం వల్ల ఫలానా ప్రమాదాలున్నాయని అధికారు లు ఎన్నిసార్లు ప్రకటించి ఉంటారు? ఉదా హరణకు, ఆహార రక్షణ, ప్రమాణాల సంస్థ 2013లో ఐదు, 2014లో మూడు, ఈ ఏడాది ఒక్కటి మాత్రమే అలాంటి ప్రకటనలు చేసింది. ఆశ్చర్యకరంగా కేంద్ర ప్రభుత్వం మ్యాగీపై వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, అది మాత్రం నోరు మెదప లేదు. ప్రజలలో ఏమంత అవగాహనను పెం పొందింపజేయకుండానే భారత వినియోగ దారులను వారి మానానికి వారిని వదిలేశారు. ఎవరో కొందరు సాహసికులైన వినియోగ దార్లు మాత్రమే వినియోగదారుల కోర్టుల తలుపు తట్టి, సమస్యలను పరిష్కరించుకుం టారు. అయితే వాటిలో చాలావరకు అభిలష ణీయంగా పనిచేయడం లేదు. వ్యాజ్యదారులు కావాల్సినవారు అవి కూడా కోర్టుల కెక్కినట్టే చాలా కాలహరణం, ఖరీదైన లాయర్లు, వాయిదాలు, అంతులేని జాప్యాలమయమని భావిస్తుంటారు. అలాంటివారికి మద్దతునం దించే యంత్రాంగం ఉనికిలో లేకపోవడం విచారకరం. (వ్యాసకర్త: మహేష్ విజా పుష్కర్ సీనియర్ పాత్రికేయులు)