నీటి ఎద్దడి భారత్.. జల సమృద్ధ ఇండియా..
సందర్భం
భారత్ పట్టణీకరణకు గురవుతోంది. కానీ కొత్తగా ఏర్పడుతున్న నగరాలతో కాదు. ప్రస్తుతం ఉన్న నగరాల విస్తరణతో, పెరుగుతున్న జనసాంద్రతతో దేశంలో పట్టణీకరణ వ్యాప్తి చెందుతోంది. ఇది నగరాల నిర్వహణపై లోతైన ప్రశ్నలను సంధిస్తోంది. నిర్వహణ అంటే పౌర స్వయం పాలన అనేది అన్ని నగరాలకూ సమాన ప్రయోజనాలను అందివ్వడం అని అర్థం. స్వయం పాలన అంటేనే ప్రజాస్వామ్యం. ఈ కోణం లోంచి చూస్తే, మన నగరాలు ఒక సెక్షన్ పౌరుల జీవి తాలను మాత్రమే మెరుగుపరుస్తున్న స్థితిలో గ్రామాలు తమ వాటా ప్రయోజనాలను పొందకుండా మనం వాటిని కొల్లగొడుతున్నామా అనే ప్రశ్న తలెత్తుతుంది.
ఉదాహరణకు, మానవ మనుగడకు అతి ప్రధాన మైన వనరులలో తాగునీరు ఒకటి. మన నగరాలు మరింత వ్యవస్థీకృత పద్ధతిలో నీటిని పొందుతున్నారను కుందాం. అలాంటి పరిస్థితిలో కూడా ప్రతి ఒక్కరూ తమ వంతు వాటా పొందుతున్నట్లు చెప్పలేం. నగరాలలో నీటి సరఫరాలో వ్యత్యాసాలు ఉంటున్నాయి. తలసరి నీటి లభ్యత అనేది అత్యంత సగటు స్థితిలోనే అందుబాటులో ఉంటోందే తప్ప వాస్తవార్థంలో కాదు. నీటి తొట్టెల్లో స్నానం చేయగలిగిన వ్యక్తి మాత్రమే తలసరి పరిమాణం కంటే ఎక్కువ నీటిని పొందగలుగు తున్నట్లు లెక్క.
కానీ పక్కనే పూరిగుడెసెల్లో ఉన్న వారుమాత్రం ఆ రోజుకు అవసరమైన తాగునీటికి సైతం ఎక్కడెక్కడికో పరుగులు తీయవలసిన పరిస్థితులు ఉంటున్నాయి. గణాంకాలు ఈ వివరాలను దాచిపెడు తుంటాయి. కానీ, ప్రత్యేకించి మహారాష్ట్ర వంటి ఒక పెద్ద రాష్ట్రానికి సంబంధించి నీటి సరఫరాలో స్థూల వ్యత్యా సాలను వివరించడానికి సాధారణంగా మనం గణాంకా లమీదే ఆధారపడాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని నగరాలు అక్కడి గ్రామాల కంటే 400 రెట్లు అధికంగా నీటిని పొందుతున్నాయని గణాంకాలు నివేదిస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా పట్టణీకరణకు గురయిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటున్నప్పటికీ మహారాష్ట్రలో గ్రామీణ-పట్టణ నిష్పత్తులు మాత్రం ఆ స్థాయి పరిమా ణంలో లేవు. నేటికీ మహారాష్ట్రలో 45 శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు.
పట్టణాల నీటి అవసరాల కోసం రిజర్వాయర్లు, సరస్సుల్లో నిల్వ చేసి ఉంచుతుంటారు కాని గ్రామీణ ప్రాంతాలకు మాత్రం అలాంటి సౌకర్యాలు ఏవీ లేవు. అంటే గ్రామాలు నేటికీ బావులు, గొట్టపుబావుల్లోని నీటిని మాత్రమే వాడుకుంటుంటారన్నది ఒక అంచనాపై ఆధారపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇదెలా ఉం టుందంటే రేషన్ షాపుల్లో నాసిరకం ధాన్యాలు మాత్రమే ఉంటున్నందున పేదలు వాటితోటే తమ కడుపు నింపు కుంటున్నారని చెబుతున్నట్లుగా ఉంటుంది.
నా దృష్టిలో అలాంటి నీటివనరులపై ఆధారప డటం అంటే భరోసా ఉన్న రక్షిత నీటి సదుపాయం అని అర్థం కాదు. ఇది ఒక విధంగా తీవ్రమైన విధానపరమైన ఉపేక్షనే సూచిస్తుంది. అడుగంటుతున్న భూగర్భ జల వనరులను విచ్చలవిడిగా తోడేయకుండా క్రమబద్ధీకరిం చడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఒక పాలసీ కూడా ఉంది. మరోవైపున ప్రజలు దానికి కట్టుబడాల్సి ఉంటుం దని భావిద్దాం. లభ్యమవుతున్న నీటి వనరులన్నింటినీ ఒక సెక్షన్ ప్రజలకే అందజేస్తూ, జనాభాలోని అతి పెద్ద విభాగం అవసరాలను తోసిపుచ్చడం ద్వారా ఇలాంటి వైరుధ్యాలను ఒక రాష్ట్రం ఎలా ఆమోదిస్తుందన్న విష యాన్ని ఇది వివరించడం లేదు.
విషాదకరమైన విషయం ఏమిటంటే,నీటి ఎద్దడితో ఎండిపోయిన గ్రామాలనుంచి ముంబై వైపుగా భారీ నీటి గొట్టాలు సాగిపోతుంటాయి. గ్రామీణులు ఈ అన్యా యంపై అభ్యంతరం చెప్ప వచ్చు. కాని పట్టణ డిమాండ్ శక్తి ముందు వీరు మౌనం పాటిస్తుంటారు. ఇది మండ టానికి సిద్ధంగా ఉంటున్న వత్తుల పెట్టెలా మారవచ్చు.
గ్రామీణ ప్రాంతం మొత్తంగా నీటికోసం అంగలా ర్చుతుండగా, ముంబై మెట్రో ప్రాంతం, పుణేతో కూడిన ఒక పరిమిత ప్రాంతం అత్యధికంగా నీటి సరఫరా పొందుతున్న స్థితిని పోల్చి చూస్తే ఈ వ్యత్యాసం స్థాయి ఏమిటో అర్థమవుతుంది. చివరకు ముంబై మెట్రోపాలి టన్ ప్రాంతం పరిధిలో కూడా తాగు నీరు తెచ్చుకోవడా నికి స్థానికులు దివా నుంచి కాల్వా ప్రాంతానికి లోకల్ రైలులో ప్రయాణిస్తుంటారు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చి చూస్తే 400 రెట్లు అధికంగా సరఫరా అవుతున్న నీటిలో సగంపైగా నీటిని ముంబై, పుణే మెట్రోపాలిటిన్ ప్రాంతాలు మాత్రమే తాగిపడేస్తున్నాయి.
హైదరాబాద్‌లో చాలావరకు శివారు ప్రాంతాల్లో నీటి ట్యాంకులతో తాగునీటిని సరఫరా చేస్తుంటారు. కరువు కాలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వేళాపాళా లేకుండా వచ్చే నీటి ట్యాంకు కోసం ప్రజలు కళ్లలో వత్తులు వేసి మరీ చూస్తుంటారు. తమ వంతు తీసుకున్న తర్వాత బకెట్ నీళ్లు ఎప్పుడు దొరుకు తాయో అక్కడ ఎవరికీ అంతుపట్టని స్థితి. అయితే ప్రభుత్వాలు రక్షిత మంచి నీటిని గ్రామీణ ప్రాంతాలకు అందించే ప్రయత్నాలు చేయలేదని దీనర్థం కాదు. ఈ ప్రాజెక్టుల నిర్వహణ పేల వంగా ఉంటున్నందున వీటి ప్రయోజనం నెరవేరటం లేదు. ఇలాంటి సందర్భాల్లో గ్రామీణులు ఎప్పుడొ స్తుందో తెలీని నీటి ట్యాంకుల కోసం ఎదురు చూస్తూ ఉండటం తప్పనిసరి అవుతోంది.
నీటి సరఫరాలోని వ్యత్యాసాలకు సంబంధించి మహారాష్ట్రలో గణాంకాలు సుస్పష్టంగా వెల్లడిస్తున్న ట్లుగా దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య కాస్త తేడా ఉండవచ్చు. ఈ సందర్భంగా శరద్‌జోషి వివరణను మళ్లీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇండియా ఉంటున్నట్లే అక్కడ భారత్ కూడా ఉంటోంది. వీటిలో ఏది మరొక దానితో సమవర్తన కలిగి ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు మరి.
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు: మహేష్ విజాపుర్కార్
ఈమెయిల్: mvijapurkar@gmail.com)