
డా॥మాడభూషి శ్రీధర్
2003 నుంచి యువతులతో అసభ్యంగా ప్రవర్తించే అలవాటు ఉన్న శివకుమార్ గొలుసుకట్టు లైంగిక అత్యాచారాలతో నేరచరిత్రను పెంచుకున్నాడు.
విశ్లేషణ
2003 నుంచి యువతులతో అసభ్యంగా ప్రవర్తించే అలవాటు ఉన్న శివకుమార్ గొలుసుకట్టు లైంగిక అత్యాచారాలతో నేరచరిత్రను పెంచుకున్నాడు. అయినా కొద్ది సంవత్సరాలుగా అతడు ట్యాక్సీ నడుపుతున్నాడు. అతనికి లెసైన్స్ ఉందో లేదో తనిఖీ చేసిన వారు లేరు. ‘అతనికి లెసైన్స్ ఉంది, మంచి వ్యక్తి అని ఒక సర్టిఫికెట్ ఉంది’, కనుక నమ్మాం అని ఉబర్ అనే నెట్‌వర్క్ వాదిస్తోంది.
రవాణా అథారిటీకి ఎన్నో అధి కారాలున్నాయి. ైలెసైన్స్ లేకుం డా వాహనాలు నడిపేందుకు అనుమతించకూడదు. కొనుగో లు చేసిన వాహనాలకు రిజిస్ట్రేష న్ ఉండాలి. పన్ను కట్టి ఉండాలి. ట్యాక్సీకి ైలెసైన్స్ తీసుకోవాలి. ఢిల్లీ వంటి మహానగరాల్లో ప్రత్యేక బాడ్జి తీసుకోవాలి. ైవైద్య పరీక్షలు తృప్తికరంగా ఉండాలి. అభ్యర్థి నేరచరిత్రను పోలీసులు తనిఖీ చేయాలి. ఆ తరు వాత ట్యాక్సీ నడపడానికి అనుమతి మంజూరు చేయాలి.
ఢిల్లీలో నలుపు పసుపు ట్యాక్సీలు, రేడియో ట్యాక్సీ లు, ఎకానమీ రేడియో ట్యాక్సీలు, టూరిస్ట్ ట్యాక్సీలు, గ్రామ సేవా వాహనాలు ఉన్నాయి. వీటి పర్మిట్ షరతులు ఏమిటో చెప్పాలని రాకేశ్ అగర్వాల్ (ఒక ఎన్జీవో అధినేత) సమాచార హక్కు చట్టం కింద అడిగాడు. రవాణాశాఖ కొంత సమాచారం ఇచ్చింది. నలుపు పసుపు ట్యాక్సీల (డి ఎల్ 1 టి టైప్)కు, టూరిస్ట్ పర్మిట్ ట్యాక్సీల (డిఎల్1 ైవై)కు ప్రత్యేకమైన పర్మిట్ నిబంధనలేవీ లేవని దాని సారాంశం. ఈ రకం ట్యాక్సీలకు బాడ్జీలు అవసరమే లేదని కూడా సమాధానం వచ్చిందని అగర్వాల్ వివరించారు.
బ్యాడ్జీ అవసరమైతే డ్రైవర్‌కు మూడురోజుల తప్పని సరి శిక్షణ ఇవ్వాలి. ఆ ్రైడైవర్ ఉండే చోటికి వెళ్లి నేర చరిత్ర ఏైదైనా ఉందా అని ఆరాతీయాలి. బ్యాడ్జీలు అవసరమే లేక పోతే పూర్వాపరాల సేకరణ ప్రక్రియ జరగదు. పోలీసులు పట్టుకుని చేసేదేమీ ఉండదు. వంద రూపాయల జరిమా నాతో సరి. కాని బ్యాడ్జీ అవసరం అయిన ట్యాక్సీ డ్రైవర్ నియమాలు ఉల్లంఘిస్తే పదివేల రూపాయల జరిమానా కట్టవలసి వస్తుంది. మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 192 కింద ఏడాది జైలు శిక్ష కూడా విధించవచ్చు.
ఢిల్లీ మహిళపై అత్యాచారం ఘటనలో ఉపయోగిం చిన ట్యాక్సీకి కూడా నిబంధనలను అమలు చేసి ఉంటే, ఓనర్, ్రైడైవర్‌ల పూర్వాపరాలను విచారించే అవకాశం లభించేది. రవాణా శాఖ సక్రమంగా తనిఖీ చేసినా నేరం జరిగేదేకాదేమో!
నడుస్తున్న బస్సులో 2012 డిసెంబర్‌లో జరిగిన మహిళ లైంగిక అత్యాచారం సంచలనం సృష్టించింది. మళ్లీ 2014 డిసెంబర్‌లో ట్యాక్సీలో ప్రయాణిస్తున్న 27 ఏళ్ల వనితపై జరిగిన అత్యాచారం ఆ నగరాన్నీ, దేశ ప్రజలను కలవరపరిచింది. ఈ నేరాలను ఆపలేమా? చట్టాలు పకడ్బందీగా అమలు చేయడం కోసం కమిటీలు వేసుకుం టున్నాం. సవరణలు చేసుకుంటున్నాం. కాని నేరాలు ఆగ డం లేదు. తాజా అత్యాచారం ఘటనలో ఆరోపణలు ఎదు ర్కొంటున్న ఢిల్లీ ట్యాక్సీ డ్రైవర్ శివకుమార్ యాదవ్ గతం లోను అనేక నేరాలకు పాల్పడ్డాడని తేలింది. పోలీసులు వ్యూహం పన్ని మధురలో అరెస్ట్ చేశారు. టాక్సీలకు అను మతినిచ్చే విధానంలో లోపం వల్ల, నియమాలు సక్రమం గా లేకపోవడం వల్ల, వాటినైనా అమలు చేసే వారే లేక పోవడం వల్ల నేరాలు జరుగుతున్నాయని ఆర్టీఐ అర్జీదారు రాకేశ్ అగర్వాల్ సమాచార కమిషన్ ముందు వాదించారు.
2003 నుంచి యువతులతో అసభ్యంగా ప్రవర్తించే అలవాటు ఉన్న శివకుమార్ గొలుసుకట్టు లైంగిక అత్యా చారాలతో నేరచరిత్రను పెంచుకున్నాడు. అయినా కొద్ది సంవత్సరాలుగా అతడు ట్యాక్సీ నడుపుతున్నాడు. అతనికి లెసైన్స్ ఉందో లేదో తనిఖీ చేసిన వారు లేరు. ‘అతనికి లెసైన్స్ ఉంది, మంచి వ్యక్తి అని ఒక సర్టిఫికెట్ ఉంది’, కనుక నమ్మాం అని ఉబర్ అనే నెట్‌వర్క్ వాదిస్తోంది. అయితే రెండు వేల రూపాయలు లంచం ఇచ్చి, ‘మంచి వాడ’నే పత్రం తెచ్చుకున్నాడన్న ఆరోపణలు రావడంతో, ఆ దొంగ సర్టిఫికెట్ ఇప్పించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.
కొనుగోలు చేసిన ట్యాక్సీలకు బ్యాడ్జీలు అవసరం లేదనే విధానం వెనుక కారణాలేమిటి అని వివరించాల్సిన బాధ్యత సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 4 (1) సి కింద రవాణా శాఖ మీద ఉంది, ప్రజల మీద తీవ్ర ప్రభా వం చూపే విధాన నిర్ణయాలకు ఆధారమైన పరిస్థితులు, కారణాను వివరించాల్సిన అవసరం ఉంది. అడగకుం డానే తమంత తామే ఈ విధాన ప్రకటన ప్రజలకు అం దించవలసిన బాధ్యత ఉంది.
నేరాలకు దోహదం చేసే లోప భూయిష్టమైన నియ మాలెందుకు తయారు చేశారు? ఢిల్లీ నగర వీధుల్లో తిరిగే ట్యాక్సీలలో మహిళలపై జరిగే నేరాలను నివారించడానికి రవాణా శాఖ ఏవిధమైన విధానం రూపొందిస్తుంది, ఇంకా కొత్త పర్మిట్ నియమాలేమైనా విధిస్తుందా అనే విష యాలను వివరించాలని సమాచార కమిషనర్ రెండో అప్పీలు ఫిర్యాదును విచారిస్తూ ఆదేశించవలసివచ్చింది. ఈ తరహా నేరాలను నివారించడానికి రవాణా అథారిటీ నిబంధనలను సక్రమంగా అమలు చేస్తే చాలా ఉపయో గం ఉంటుందనడానికీ, లేకపోతే ఎంతటి ఘోరాలనైనా ఆపలేమనడానికీ ఢిల్లీ ఉబర్ నెట్‌వర్క్ ్రైడైవర్ చేసిన నేరమే ఉదాహరణ. రవాణా శాఖ అధికారులు తమ శాఖలోని లంచగొండితనాన్ని నిరోధించకుంటే నేరాలు ఆపడం కష్టం. శివకుమార్ యాదవ్‌కు శిక్ష పడుతుందో లేదో, ఎంత శిక్ష పడుతుందో ఎవరూ చెప్పలేరు. కాని ఆ నేరాలు జరగకుండా ఆపగలిగే నియమాలను అమలుజరిపి, లం చాలు తీసుకుని నేరగాళ్లను వదిలేసే ధోరణిని అదుపు చేయడం అత్యవసరమన్న సంగతిని ఈ సంఘటన వెల్ల డించింది. ఆర్టీఏ లోపాలను ప్రతి పౌరుడు ఆర్టీఏ చట్టం తోనే ఎండగట్టవచ్చు. విధానపరమైన బలహీనతలను అడిగే పౌర శక్తి అవసరం.
(రాకేశ్ అగర్వాల్ వర్సెస్ ఢిల్లీ రవాణా శాఖ కేసులో ఆదేశం ఆధారంగా)
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com