ధనం పుష్కలంగా చేతికందుతుంది | Plenty of money laundered | Sakshi
Sakshi News home page

ధనం పుష్కలంగా చేతికందుతుంది

Published Fri, Jul 31 2015 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

ధనం పుష్కలంగా చేతికందుతుంది

ధనం పుష్కలంగా చేతికందుతుంది

టారో బాణి
 

ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
ఇది మీకు ధన సమృద్ధినిచ్చే వారం. అయితే మీ వస్తువుల పట్ల జాగ్రత్త వహించకపోతే మీ సొమ్ము దొంగలపాలు కావచ్చు లేదా ఇచ్చిన అప్పు వసూలు కాక మీ మూడ్ పాడైపోవచ్చు. ఈ వారం మీరు చేయవలసిందల్లా రకరకాల ప్రతిబంధకాలనూ, అవరోధాలనూ ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉండడమే. కలిసొచ్చే రంగు: ఇండిగో
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
కష్టపడి, చెమటోడ్చి మరీ పని చేయవలసి రావచ్చు. ఒక గురువును లేదా మార్గదర్శకుని కలుసుకుంటారు. శుభవార్తలు వినవచ్చు. చేస్తున్న పనులను మధ్యలోనే వదిలిపెట్టక ఓపికతో కొనసాగించడం వల్ల మీరే విజేతగా నిలవచ్చు. మీ మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచే ఒక కొత్త బంధం ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: పీచ్
 
జెమిని  (మే 21-జూన్ 21)

కష్టపడి పని చేసిన మనసుకు, శరీరానికి విశ్రాంతిని ఇవ్వవలసిన తరుణమిది. ఏ పిక్నిక్‌కో, టూర్‌కో వెళ్లి హాయిగా సేదతీరండి. కొత్త అలవాట్లు, అభిరుచులు, కొత్త బంధాలు, కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు లేదా కొత్త కోర్సులో జాయిన్ కావచ్చు. మనసును చెదరగొట్టే ఆలోచనలకు, వివాదాలకు దూరంగా ఉండండి. పాజిటివ్‌గా ఆలోచించండి. కలొసొచ్చే రంగు: వైట్
 
 క్యాన్సర్ (జూన్22-జూలై 23)
కొత్త ప్రేమ బంధం చిగురించవచ్చు. అంతా సవ్యంగా, ఏ బాదరబందీ లేకుండా హాయిగా గడిచిపోతుంది ఈ వారమంతా. అయితే బద్ధకం, ఉద్రేకం, మధ్యవర్తిత్వాలు, అనవసర జోక్యాలకు తావివ్వకండి. ధనం పుష్కలంగా చేతికందుతుంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది. కలిసొచ్చే రంగు: ఆరంజ్
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
మీ అంచనాలు ఫలిస్తాయి. గతం మిమ్మల్ని వెంటాడుతుంది. ఎప్పుడో చేసిన పొరపాట్లు, తప్పులకు ఫలితాన్ని ప్రస్తుత కాలంలో అనుభవించవలసి రావచ్చు. ఈ సమయంలో మీ ఆలోచనల నుంచి బయటపడి, మనసును సేదతీర్చడం మంచిది. ఒక సాహసోపేతమైన ప్రయాణం చేయవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: బ్రౌన్
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
మీ జీవితంలో సంభవించనున్న రెండు ముఖ్య ఘటనలకు ఈ వారమే పునాది. అనవసర విషయాలు, అప్రధానమైన పనులను వదిలేసి, చేయాల్సిన వాటిపై దృష్టి పెట్టండి. కొత్త వ్యాపారం మొదలు పెడతారు. ఇంటిలోనూ, ఆఫీసులోనూ ఆధునీకరణ అవసరం కావచ్చు. ఎంతోకాలంగా ఉన్న ఒక బంధానికి స్వస్తి చెప్పవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఎల్లో
 
 లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
 చేతినిండా డబ్బుంటుంది. లక్ష్యాలు, ఆశయాలను నెరవేరేందుకు ఉత్సాహంగా పని చేస్తారు. మంచి ఫలితాలను చవిచూస్తారు. కొత్త వాహనం లేదా వస్తువును కొనుగోలు చేస్తారు. లేదా కొత్త ప్రదేశానికి ట్రావెల్ టికెట్లు కొంటారు. మీ హితులతోనూ, శ్రేయోభిలాషులతోనూ గడపండి. పాజిటివ్‌గా ఆలోచించండి. ఆశావహంగా జీవించండి. కలిసొచ్చే రంగు: ఆరంజ్
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
మీ ఆశలు, ఆశయాలకు, మీకున్న పరిమిత వనరులు, సమస్యలు సవాళ్లకు మధ్య వైరుధ్యం ఏర్పడుతుంది. పని, ఆరోగ్యం, కెరీర్ అన్నీ సంతోషం కలిగిస్తాయి.. అంతా సవ్యంగా ఉన్నాయన్న భావన మీ మనసును ఆనందంతో నింపుతుంది. మీ ప్రేయసి లేదా ప్రేమికుడితో బంధం చెడవచ్చు. సరి చేసుకోవాలసిన అవసరం ఏర్పడుతుంది. కలిసొచ్చే రంగు: పింక్
 
 శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)

 మీ కలల సౌధంపై నీళ్లు కుమ్మరించుకోవద్దు. వాటిని నెరవేర్చుకునే మార్గ్గాన్ని అన్వేషించండి. రోజువారీ పనులతో జీవితం బోర్‌గా అనిపింవచ్చు. మీ బంధాలను పునరుద్ధరించుకోండి. బంధుమిత్రుల నుంచి అనూహ్యమైన బహుమతులు రావచ్చు. సామాజిక జీవనం మరింత కలర్‌ఫుల్‌గా, ప్రకాశ వంతంగా మారుతుంది. కలిసొచ్చే రంగు: పింక్
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
ఈ నెలంతా కలగబోయే సంతోషానికి ఈ వారమే పునాది. ఆర్థికపరమైన అభివృద్ధి కనిపిస్తోంది. మీ వ్యాపార భాగస్వామి మంచి మంచి సలహాలు ఇస్తారు. మీ అంచనాలు ఫలిస్తాయి. విజయాన్ని అందుకుంటారు. ఎదురు చూడని వ్యక్తుల నుంచి విలువైన బహుమతులు అందుకుంటారు. ప్రేమికులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: ఇండిగో
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
 ఈ వారం ఒడుదొడుకులతో కూడి ఉంటుంది. పెట్టుబడికి, రాబడికి మధ్య పొత్తు కుదరని విధంగా ఉంటుంది. ఓ బంధానికి ముగింపు పలకవలసి రావచ్చు. నిద్రలేని రాత్రులు గడుపుతారు. అర్థం లేని మీ ముక్కుసూటితనం, మొండిపట్టుదలలతో మీ సన్నిహితులను, శ్రేయోభిలాషులను దూరం చేసుకోకండి. కలిసొచ్చే రంగు: ఇటిక రాయి రంగు
 
 పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)

జీవితంలో కొత్త ప్రారంభాలకు శ్రీకారం చుడతారు. ప్రేమబంధానికి ఆహ్వానం పలుకుతారు. మీరు కావాలనుకున్న వాటిని పొందేందుకు సంసిద్ధంగా ఉండండి. ఓపికతో, లక్ష్యంపై గురిపెట్టండి. సహోద్యోగుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. అదృష్టం వరిస్తుంది. మీ లక్ష్యాలను, ఆశయాలను చేరుకుంటారు. కలిసొచ్చే రంగు: బ్లూ
 
ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
సౌర వాణి

 
ఏరిస్  (మార్చి 21- ఏప్రిల్ 20)
ఆస్తి, వాహనం, విద్యార్హతలు మొదలైన వాటికి సంబంధించిన పత్రాలని సక్రమంగా, భద్రంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోండి. రుణగ్రహీతలను ఒత్తిడి చేసి మరీ డబ్బు వసూలు చేసుకోండి, దౌర్జన్యం వద్దు. మిత్రులతోనూ, చనువుగా ఉండే వారితోనూ మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలయినంత జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరికీ రుణాన్నిచ్చే వారం కాదిది.
 
 టారస్  (ఏప్రిల్ 21-మే 20)
 మీతో ఎంతో చనువుగా ఉన్నారనే అభిప్రాయంతో ముందు వెనకలు ఆలోచించకుండా ఓ వాగ్దానాన్ని లేదా హామీని ఈయవలసి రావచ్చు. నిర్దంద్వంగా, మొహమాటం లేకుండా చెప్పండి- వాగ్దానం గాని హామీ గాని సంతకం గానీ చేయనే చేయనని. అలాగే ఇతరులకి సంబంధించిన ఓ ముఖ్యకార్యాన్ని మీరు చేయవలసిన లేదా చేయ వీలైన పరిస్థితి ఎదురు కావచ్చు.
 
జెమిని (మే 21-జూన్ 21)
పాత మొక్కుని తీర్చుకుంటారు. స్థానచలనానికి సంబంధించిన ప్రయత్నాలని ముమ్మరం చేస్తారు. అపరిష్కృతంగా ఉన్న పనుల్ని పూర్తి చేసుకోవాలన్న నిర్ణయానికి వస్తారు. మీకు ఉద్యోగంలో వస్తున్న ప్రశంసలకు పొంగిపోకండి. అధికభారం మీద పడబోతోందని గ్రహించి, చేయగలిగితేనే చేయగలననీ, లేనిపక్షంలో సాధ్యపడదని వినయంగా చెప్పండి.
 
 క్యాన్సర్ (జూన్22-జూలై 23)

 మీ శత్రువుల తాటాకు చప్పుళ్లకు బెదిరిపోకండి. ధర్మం మీ పక్షానే ఉందని గ్రహించండి. దూరపు ప్రయాణాలని శారీరక శ్రమ అనిపించే పక్షంలో మానండి. ఎక్కువ ఆలోచించకండి. ఎవరినీ విరోధం చేసుకునే దిశగా ఆలోచించకండి. మీ పనిని మీరు సకాలంలో చేసుకుపోతుంటే కీర్తిప్రతిష్ఠలూ గౌరవమూ లభిస్తాయి.
 
లియో  (జూలై 24-ఆగస్టు 23)

పాత పరిచయాలని చెడగొట్టుకునే మనస్తత్వం మీది కాకపోయినా సకాలంలో పనుల్ని చేసుకోకపోవడం మీకు ఈ గ్రహస్థితి కారణంగా అవుతూ ఉంటుంది. అయినా ప్రయత్నాన్ని విరమించకండి. మీ భార్య మీ గురించి తీవ్రంగా ఆందోళన చెందుకూ ఉండచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరించి చెప్తూ ధైర్యాన్ని కల్గించండి. పాతబకాయిలన్నీ దాదాపు తీరిపోతాయి.  
 
 వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
 మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోండి తప్ప ప్రభుత్వం నుండి కాని మరేదో మార్గం ద్వారా గాని వస్తుందని భ్రమపడకండి. ఏదో లాభిస్తుందనే ఉద్దేశ్యంతో దూరభార వ్యయప్రయాస ప్రయాణాలని చేయకండి- ముందే తగు నిర్ణయాన్ని తీసుకోండి. విద్యార్థులు చక్కగా వృద్ధిలోకి రాగలరు. అనవసర పరిచయాలూ కాలక్షేప కార్యక్రమాలూ వద్దేవద్దన్న నిర్ణయానికి రండి.
 
 లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

 సమయానికి తిండీనిద్రా లేకుండా నిర్విరామంగా పని చేస్తారు. ఫలితం అంతంతమాత్రమే అయినా ఇది రేపటి వృక్షం కోసం నేడు నాటిన విత్తనం వంటిదనుకుంటూ ఉత్సాహంగా శ్రమిస్తారు. ముందునాటికి సత్ఫలితాలుంటాయి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలోనూ, బాకీలు తీర్చడం విషయంలోనూ రాజీమార్గాన్ని ఆశ్రయించడం శ్రేయస్కరం.
 
స్కార్పియో  (అక్టోబర్ 24-నవంబర్ 22)

వ్యాపారాన్ని విస్తరింపజేయాలనే దృక్పథంతో విపరీతంగా శ్రమ పడుతూ రుణాలు చేసి మరీ పెట్టుబడులు పెట్టద్దు. పెట్టుబడీ శరీర శ్రమా కాకుండా తగుమాత్రంగా ఉండటం మంచిది సోదరులతో సత్సంబంధాలు, ఐకమత్యం ఉంటాయి. ఒకవిషయంలో నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఉంటుంది. దిగులు పడకండి. ఫలితం మీకు అనుకూలంగానే ఉంటుంది.
 
శాజిటేరియస్  (నవంబర్23-డిసెంబర్ 21)
 మిమ్మల్ని వ్యాపారంలో అణిచి వేయాలనే ఆలోచనతో కుయుక్తులు పన్నేవారికి ఏ మాత్రపు అనుకూలతా ఉండదు. మీరు ధర్మబద్ధంగానే సాగిపోండి. వారి ఈర్ష్యాద్వేషాల కారణంగా ఏ కష్టనష్టాలొస్తాయోనని ఆలోచిస్తూ కూర్చోక ధైర్యంగా ముందుకు వెళ్లండి. నష్టం ఉండదు. పెద్దల పరిచయాల వల్ల శత్రువులు మీ జోలికి రారు, వ్యాపారంలో ఒడిదుడుకులూ ఉండవు.
 
 క్యాప్రికార్న్  (డిసెంబర్ 22-జనవరి 20)
 ఉన్నచోటునే ఉండడం ఏ మాత్రమూ సరికాదని గ్రహిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి కావలసిన ప్రణాళికని తయారు చేసుకుంటారు. ఇంట్లో ఉన్న అందరినీ కూడా దీనిలో భాగస్వాముల్ని చేస్తూ శ్రమిస్తే విజయం మీదే! అనుభవజ్ఞులతో సంప్రదించి నిర్ణయం తీసుకోండి. పుణ్యక్షే త్రాలూ దైవదర్శనాలూ దానధర్మాలకీ ఓ పరిమితి ఉండాలని గుర్తుంచుకోండి.
 
 అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)

 అనవసర ఆందోళన కలగవచ్చు. అలాటి దుఃఖం కలిగే సన్నివేశమేమీ లేనే లేదు. తోటి ఉద్యోగులతో లేదా ఇరుగుపొరుగుతో వాగ్వివాదం రావచ్చు. అది సాధారణమేని భావించండి తప్ప దానిగురించే ఆలోచిస్తూ ఉండకండి.  పిల్లలకి ఆటల్లో చిరుగాయాలు గానీ తాత్కాలిక జ్వరాలు గానీ వచ్చే అవకాశముంది. ఎక్కువెక్కువ ఊహించుకోకండి. ఆధ్యాత్మిక గురువును ఎన్నుకోండి.
 
 పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
 కొంతకాలం పాటు మీరూ మీ కుటుంబం అనే వృత్తంలోనే తిరుగుతూ ఉండడం మంచిది. రుణాలు తీసుకోవడం/ ఇవ్వడం; భాగస్వాములుగా తెచ్చుకోవడం/విడిచేయడం వంటి కొత్తపనుల్నీ మార్పుల్నీ ఈ వారంలో చేయవద్దు. సంతానపు నడవడికా చదువూ ఆరోగ్యమూ వారికి చేయాల్సిన వ్యయమూ వంటివాటిమీదే కేంద్రీకరించండి. పొగడ్తలకి లొంగకండి.
మైలవరపు శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement