Nyumaralajist
-
మీ మాటకి విలువ ఉండే కాలమిది
ఆగస్టు 22 నుంచి 28 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) వృత్తిపరమైన విషయాల్లో స్థిరత్వాన్ని. నిలకడతనాన్నీ పాటించి, అధికారాన్ని, అజమాయిషీనీ పొందుతారు. వ్యాపారం బాగా వృద్ధి అవుతుంది. ఇంతకాలంగా మీ అభివృద్ధికి చేయూతనిచ్చిన వారికి మీ కృతజ్ఞత చూపాల్సిన సమయమిది. జీవితమన్నాక ఒడిదొడుకులు సహజం. చిన్న చిన్న ఇబ్బందులకే భయపడితే ఆనందాన్ని ఆస్వాదించగలమా? కలిసొచ్చే రంగు: పింక్ టారస్ (ఏప్రిల్ 21-మే 20) వృత్తిపరమైన పనులతోటీ, ప్రాపంచిక విషయాలతోటీ వారమంతా తీరికలేకుండా గడుపుతారు. ఇల్లు కట్టుకోవాలని లేదా ఉన్న ఇంటిని ఆధునీకరించుకోవాలని ఆలోచన వస్తుంది. పనిలో ఒక కొత్త అవకాశం వస్తుంది. పనులు వెంటనే పూర్తి చేయాలని ఆతృతపడతారు. శారీరకంగా ఫిట్నెస్ పెంచుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: బ్లూ జెమిని (మే 21-జూన్ 21) ఇంటా బయటా చోటు చేసుకున్న మార్పులు మిమ్మల్ని అతలాకుతలం చేయవచ్చు. భయడపకుండా మీ బాధ్యతగా చేయగలిగిన దానిని చేయండి. అప్పుడు జీవితంలో ఏదీ ఇబ్బందిగా అనిపించదు. మీ విలువలు, ప్రాధాన్యతలు, ధోరణులలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఒక ప్రకటన లేదా వార్త మిమ్మల్ని ఆకర్షించవచ్చు. కలిసొచ్చే రంగు: గ్రీన్ క్యాన్సర్(జూన్22-జూలై 23) గతం ఎప్పుడో జరిగిపోయింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కనక గడిచిపోయిన దాన్ని గురించి, జరగబోయే దాని గురించి తలచుకుంటూ ఉండేకన్నా వర్తమానాన్ని హాయిగా గడపడం అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తు అందంగానే ఉంటుంది. మీ నిర్ణయాలలో జాప్యం వల్ల ఒక మంచి పనిని వదులకోవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: ఇటుక రాయి రంగు లియో(జూలై 24-ఆగస్టు 23) కొత్తగా ఏదైనా అవకాశం వచ్చిందంటే దానివెనకే కొత్త సవాళ్లు కూడా ఉండచ్చు. దానికి వెరవక ధైర్యంగా ఎదుర్కొని పోరాడటం వల్ల సులువుగా అధిగమించగలుగుతారు. అప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు నిర్భయంగా ముందుకెళితేకదా, మీ వెనక ఉన్న వాళ్లకు దారి చూపగలిగేది, వారు మిమ్మల్ని అనుసరించేదీ! కలిసొచ్చే రంగు: మట్టిరంగు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) సమష్టి బలము, సహకారానికి మీ సమర్థత తోడయితేనే కదా కొత్త వ్యాపార వ్యవహారాలైనా, వృత్తిపరమైన పనులైనా నెరవేరేది! టెన్షన్లు లేని జీవితం చప్పిడి తిండి వంటిది. ఏ కష్టాలూ, ఒడుదొడుకులూ, ఇబ్బందులూ లేకుండా ఉంటే జీవితం సాఫీగా నడిచిపోవచ్చేమో కానీ, అందులో మజా ఏముంటుంది? మీ పనుల్లో విజయం సాధిస్తారు. కలిసొచ్చే రంగు: సిల్వర్ వైట్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) జీవితంలో మార్పు కోరుకుంటున్న ఈ తరుణంలో ఒక అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తుంది. రేపటి కోసం ఆలోచిస్తూ నేటి గురించి విస్మరిస్తున్నారన్న విషయాన్ని మరవద్దు. ఇంటి మరమ్మతులకు ఇది సమయం. ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం. వ్యాయామం లేదా క్రీడలతో ఫిట్నెస్ పెంచుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: ఎల్లో స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) మీరు ఎంత తెలివిగలవారైనా, ఎంత ప్లానింగ్ తెలిసినా కూడా మీలోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకపోతే అన్నీ వ్యర్థమేనని మరచిపోవద్దు. ఇల్లు, సంపాదన, పేరుప్రఖ్యాతుల కోసం ఆలోచిస్తూ జీవితం గురించి పట్టించుకోకపోతే ఎలా? అన్నీ కలగలసినదే జీవితం అని గుర్తుంచుకోండి. ఈ వారమంతా చాలా శుభకరంగా ఉంటుంది. కలిసొచ్చే రంగు: ఆరంజ్ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) అనుకున్న పనులన్నీ అయిపోవడం వల్ల వారమంతా సంతోషంగా గడుపుతారు. పనిధ్యాసలో పడి తిండి, నీళ్లు, నిద్ర మరచిపోకండి. వ్యాపారపరంగా, ఆర్థికంగా ఈ వారం చాలా బాగుంటుంది. ఫలితం కోసం ఎదురు చూడకుండా మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహించండి. దేన్నైనా అతిగా ఆశిస్తున్నంతకాలం అది మనకు అందదన్నది గుర్తు తెచ్చుకోండి. కలిసొచ్చే రంగు: పీచ్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) జీవితంలో ప్రతిదీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటుందని మరచిపోకండి. ఈ కష్టాలూ, బాధలూ , బాధ్యతలూ మీ ఒక్కరికే కాదు, అందరికీ ఉంటాయని గుర్తుతెచ్చుకోండి. అహంకారాన్ని విడిచిపెట్టండి. బాధ్యతలు నెరవేర్చండి. ఒకరి స్వార్థం, అసూయ మూలంగా మీకు ఇబ్బందులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: సిల్వర్ గ్రే అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) జీవితం ప్రశ్న కాదు. సమస్యా కాదు. జీవితమంటే జీవితమే! అది ఎటు తీసుకెళితే అటు, ఎలా తీసుకెళ్తే అలా ప్రయాణించడమే మంచిది. మన చేతిలో ఏమీ ఉండదు. అలాగని మీ అలవాట్లు వదులుకొని, అభిరుచులని చంపుకోవలసిన పనిలేదు. సమర్థతను పెంచుకుంటూ, సవాళ్లను ఎదుర్కొంటూ ప్రయాణాన్ని కొనసాగించండి. కలిసొచ్చే రంగు: వయొలెట్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) వృత్తిపరమైన విషయాలలో ప్రాక్టికల్, ప్రొఫెషనల్‌గా వ్యవహరించడం నేర్చుకోండి. గతం గురించి ఆలోచిస్తూ బంగారం లాంటి భవిష్యత్తును మరచిపోకండి. ప్రతికూల భావనలూ, దిగుళ్లూ పెట్టుకోకుండా ఉండటం అలవాటు చేసుకోండి. నిర్ణయాలలో పట్టువిడుపు ధోరణితో మానవ సంబంధాల విషయంలో దృఢంగా ఉండండి. కలిసొచ్చే రంగు: లేత పసుపు రంగు. ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) చేసిన రుణాలని తీర్చవలసిందిగా వత్తిళ్లు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎప్పుడు తీర్చగలరో ప్రణాళికని వేసుకుని దానినే నిజాయితీగా మీరు ఎవరికి బాకీ ఉన్నారో వారికి తెలియజేయండి. ఈ విషయంలో లౌక్యంగాని, మధ్యవర్తి ద్వారా చెప్పించడం గాని, అసత్యమాడటంగాని చేయనే వద్దు. ఏదైనా ఓ సందర్భంలో పరాజయాన్ని మీరు చవి చూసినా మధన పడకండి. టారస్ (ఏప్రిల్ 21-మే 20) గుర్తింపు కోసమో కీర్తిప్రతిష్ఠల కోసమో లేక వేతనాభివృద్ధి కోసమో తొందరపడి స్థానచలనానికో లేక వృత్తివ్యాపారాల మార్పుకో ప్రయత్నించకండి. తాత్కాలికమైన చికాకులున్నంత మాత్రాన మార్పు అనేది శాశ్వత పరిష్కారం కాదు. మారబోతున్న ప్రదేశంలో మాత్రం సమస్యలు ఉండబోవని ఎవరూహించగలరు? తొందరపడి అదనపు భారాన్ని నెత్తిన వేసుకోకండి. జెమిని (మే 21-జూన్ 21) ప్రభుత్వం నుండి రావలసిన ద్రవ్యం అందే సూచనలు ఉంది. మీ సంతానం తోవ తప్పకుండా ఉండేలా జాగ్రత్తని పాటించండి. కీర్తి ప్రతిష్ఠలు, సన్మానాల కోసం పాకులాడే స్వభావం కాకున్నా, మిమ్మల్ని ఆశపెట్టి రంగంలోకి దించి అపకీర్తిపాలు చేసే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ప్రలోభపడకండి. మీ ఆదాయ వ్యయాలని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోండి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఊహాలోకంలో విహరిస్తూ కాలాన్ని గడిపేస్తారు. ఏ పనీ ప్రారంభించేపరిస్థితి కనిపించడం లేదు. అలాగని అది మీ అసమర్థత కాదు. మీకు తగినంత సహాయం లేకపోవడం లేదా మీకు అండగా ఉన్న వ్యక్తులకి అంత సమర్థత లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. విదేశాలకి ఆహ్వానం రావచ్చు. ఇక్కడుండే పని ఒత్తిడి, ఆదాయం చూసుకుని అంగీకారాన్ని తెల్పండి. లియో (జూలై 24-ఆగస్టు 23) తలిదండ్రుల్లో ఎవరో ఒకరి ఆరోగ్యం కొన్ని రోజులపాటు మిమ్మల్ని మీ పని చేసుకోనీయక పోవచ్చు కాబట్టి స్వల్ప వైద్యపరీక్ష లు చేయించండి లేదా వ్యాధికి లోనుకాకుండా ఉండేలా ముందు జాగ్రత్తలని పాటించేలా చేయండి. చేపట్టిన కార్యక్రమాలకి ఆటంకాలొచ్చాయని దిగులుపడకండి. మీ మానసిక స్థైర్యమే మిమ్మల్ని మరిన్ని ఎత్తులకి తీసుకెళ్తుంది నిస్సందేహంగా. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) అనవసరమైన వస్తు ఆభరణ అలంకరణ సామగ్రి కొనే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త వ్యాపారం కోసం తగు ప్రయత్నాలు చేస్తారు. ఇల్లు, పొలం వంటి వాటి గురించి కొత్త నిర్ణయమేమీ తీసుకోకపోవడం శ్రేయస్కర ం. కొత్తగా పరిచితులైన వారితో అతిచనువు వద్దు. అనారోగ్యం కలిగితే అది తాత్కాలికమేనని భావించండి, ఆందోళన వద్దు. లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) కుటుంబంలో ఐకమత్యం పెంపొందవచ్చు. ఆదాయం సంతృప్తికరంగానే ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అవివాహితులైన పక్షంలో వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారంతో కొత్త ఆలోచనలని చేసుకోగలుగుతారు. ఈ వారంలో పూర్వికుల ఆస్తులని అమ్మడం, అమ్మివేయాలనే ఆలోచనకి రావడం సరి కాదు. స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) ఆగిపోయిన పనుల్లో కదలిక ప్రారంభం అవుతుంది. దాంతో మీకు పని భారం పెరగచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించవచ్చు. సాహసకార్యాలైన కొండలెక్కడం, ఈదడం, వేటాడదలచడం... వంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. అన్నిపనుల్నీ ఒక్కసారే కాకుండా ఒకదాని తర్వాత మరొకటి చొప్పున ఎక్కువ పనులే చేసుకున్న పక్షంలో సిద్ధించవచ్చు. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ మాటకి విలువ ఉండే కాలమిది. కాబట్టి ఆ విలువని వ్యర్థపరచుకోకుండా పరిచితులైన వారికి మాత్రమే సాయపడండి. రాజకీయంగానైతే పదవులు లభించే అవకాశం ఉంది కాబట్టి పరిచయాలని చెడగొట్టుకోకండి. విద్యార్థులకి తగినంత బుద్ధివికాసం కలిగే కాలం ఇది కాబట్టి వ్యర్థ సంభాషణలతో పొద్దుపుచ్చకుండా మేధోవికాసానికి కృషి చేయడం మంచిది. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) వాహనాలూ యంత్రాల విషయంలో కొద్ది శ్రద్ధతో ఉండడం మంచిది. రుణదాతలనుండి ఒత్తిడి ఉండే అవకాశముంది కాబట్టి కొంత కొంత చొప్పున తీరుస్తూ ఒత్తిడిని తగ్గించుకోండి. అన్నింటికంటే మించి నమ్మకమనే పెట్టుబడిని తొలగించుకోకండి. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలని, వ్యాపార స్థలంలోని వస్తుసామగ్రిని పర్యవేక్షించుకుంటూ ఉండడం అవసరం. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) అధికారులతో మాట్లాడేటప్పుడు పరిస్థితిని సామరస్యంగా ఉండేలా చూసుకుని పని ముగించుకోండి తప్ప వాగ్వివాదాలకి వెళ్లకండి. కోర్టు తీర్పు ఎలా ఉన్నా మీకు రాబోయే నష్టం ఏమీ లేదని గ్రహించండి. దిగులు పడకండి. పిల్లల విషయంలో విద్యాసక్తి వాళ్లకి ఎంత ఉందనే విషయాన్ని ఉపాధ్యాయులనడిగి తెలుసుకుని తలిదండ్రుల్లో ఒకరు పూర్తి శ్రద్ధని తీసుకోక తప్పదు. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) పదోన్నతిపై లేదా ప్రభుత్వ వెసులుబాటు కారణంగా మంచి చోటుకి బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరీ అనుకూలం గాని చోటుకే వెళ్లవలసి వస్తే కాదనకండి. కొన్నాళ్లపిమ్మట తిరిగి వచ్చే అవకాశముంది మీకు. మానసికంగా అధైర్యపడవద్దు. శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దైవధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా గడపండి. మైలవరపు శ్రీనివాసరావు -
ధనం పుష్కలంగా చేతికందుతుంది
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఇది మీకు ధన సమృద్ధినిచ్చే వారం. అయితే మీ వస్తువుల పట్ల జాగ్రత్త వహించకపోతే మీ సొమ్ము దొంగలపాలు కావచ్చు లేదా ఇచ్చిన అప్పు వసూలు కాక మీ మూడ్ పాడైపోవచ్చు. ఈ వారం మీరు చేయవలసిందల్లా రకరకాల ప్రతిబంధకాలనూ, అవరోధాలనూ ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉండడమే. కలిసొచ్చే రంగు: ఇండిగో టారస్ (ఏప్రిల్ 21-మే 20) కష్టపడి, చెమటోడ్చి మరీ పని చేయవలసి రావచ్చు. ఒక గురువును లేదా మార్గదర్శకుని కలుసుకుంటారు. శుభవార్తలు వినవచ్చు. చేస్తున్న పనులను మధ్యలోనే వదిలిపెట్టక ఓపికతో కొనసాగించడం వల్ల మీరే విజేతగా నిలవచ్చు. మీ మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచే ఒక కొత్త బంధం ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: పీచ్ జెమిని (మే 21-జూన్ 21) కష్టపడి పని చేసిన మనసుకు, శరీరానికి విశ్రాంతిని ఇవ్వవలసిన తరుణమిది. ఏ పిక్నిక్కో, టూర్‌కో వెళ్లి హాయిగా సేదతీరండి. కొత్త అలవాట్లు, అభిరుచులు, కొత్త బంధాలు, కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు లేదా కొత్త కోర్సులో జాయిన్ కావచ్చు. మనసును చెదరగొట్టే ఆలోచనలకు, వివాదాలకు దూరంగా ఉండండి. పాజిటివ్‌గా ఆలోచించండి. కలొసొచ్చే రంగు: వైట్ క్యాన్సర్ (జూన్22-జూలై 23) కొత్త ప్రేమ బంధం చిగురించవచ్చు. అంతా సవ్యంగా, ఏ బాదరబందీ లేకుండా హాయిగా గడిచిపోతుంది ఈ వారమంతా. అయితే బద్ధకం, ఉద్రేకం, మధ్యవర్తిత్వాలు, అనవసర జోక్యాలకు తావివ్వకండి. ధనం పుష్కలంగా చేతికందుతుంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది. కలిసొచ్చే రంగు: ఆరంజ్ లియో (జూలై 24-ఆగస్టు 23) మీ అంచనాలు ఫలిస్తాయి. గతం మిమ్మల్ని వెంటాడుతుంది. ఎప్పుడో చేసిన పొరపాట్లు, తప్పులకు ఫలితాన్ని ప్రస్తుత కాలంలో అనుభవించవలసి రావచ్చు. ఈ సమయంలో మీ ఆలోచనల నుంచి బయటపడి, మనసును సేదతీర్చడం మంచిది. ఒక సాహసోపేతమైన ప్రయాణం చేయవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: బ్రౌన్ వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ జీవితంలో సంభవించనున్న రెండు ముఖ్య ఘటనలకు ఈ వారమే పునాది. అనవసర విషయాలు, అప్రధానమైన పనులను వదిలేసి, చేయాల్సిన వాటిపై దృష్టి పెట్టండి. కొత్త వ్యాపారం మొదలు పెడతారు. ఇంటిలోనూ, ఆఫీసులోనూ ఆధునీకరణ అవసరం కావచ్చు. ఎంతోకాలంగా ఉన్న ఒక బంధానికి స్వస్తి చెప్పవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఎల్లో లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) చేతినిండా డబ్బుంటుంది. లక్ష్యాలు, ఆశయాలను నెరవేరేందుకు ఉత్సాహంగా పని చేస్తారు. మంచి ఫలితాలను చవిచూస్తారు. కొత్త వాహనం లేదా వస్తువును కొనుగోలు చేస్తారు. లేదా కొత్త ప్రదేశానికి ట్రావెల్ టికెట్లు కొంటారు. మీ హితులతోనూ, శ్రేయోభిలాషులతోనూ గడపండి. పాజిటివ్‌గా ఆలోచించండి. ఆశావహంగా జీవించండి. కలిసొచ్చే రంగు: ఆరంజ్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీ ఆశలు, ఆశయాలకు, మీకున్న పరిమిత వనరులు, సమస్యలు సవాళ్లకు మధ్య వైరుధ్యం ఏర్పడుతుంది. పని, ఆరోగ్యం, కెరీర్ అన్నీ సంతోషం కలిగిస్తాయి.. అంతా సవ్యంగా ఉన్నాయన్న భావన మీ మనసును ఆనందంతో నింపుతుంది. మీ ప్రేయసి లేదా ప్రేమికుడితో బంధం చెడవచ్చు. సరి చేసుకోవాలసిన అవసరం ఏర్పడుతుంది. కలిసొచ్చే రంగు: పింక్ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ కలల సౌధంపై నీళ్లు కుమ్మరించుకోవద్దు. వాటిని నెరవేర్చుకునే మార్గ్గాన్ని అన్వేషించండి. రోజువారీ పనులతో జీవితం బోర్‌గా అనిపింవచ్చు. మీ బంధాలను పునరుద్ధరించుకోండి. బంధుమిత్రుల నుంచి అనూహ్యమైన బహుమతులు రావచ్చు. సామాజిక జీవనం మరింత కలర్ఫుల్గా, ప్రకాశ వంతంగా మారుతుంది. కలిసొచ్చే రంగు: పింక్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఈ నెలంతా కలగబోయే సంతోషానికి ఈ వారమే పునాది. ఆర్థికపరమైన అభివృద్ధి కనిపిస్తోంది. మీ వ్యాపార భాగస్వామి మంచి మంచి సలహాలు ఇస్తారు. మీ అంచనాలు ఫలిస్తాయి. విజయాన్ని అందుకుంటారు. ఎదురు చూడని వ్యక్తుల నుంచి విలువైన బహుమతులు అందుకుంటారు. ప్రేమికులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: ఇండిగో అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈ వారం ఒడుదొడుకులతో కూడి ఉంటుంది. పెట్టుబడికి, రాబడికి మధ్య పొత్తు కుదరని విధంగా ఉంటుంది. ఓ బంధానికి ముగింపు పలకవలసి రావచ్చు. నిద్రలేని రాత్రులు గడుపుతారు. అర్థం లేని మీ ముక్కుసూటితనం, మొండిపట్టుదలలతో మీ సన్నిహితులను, శ్రేయోభిలాషులను దూరం చేసుకోకండి. కలిసొచ్చే రంగు: ఇటిక రాయి రంగు పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) జీవితంలో కొత్త ప్రారంభాలకు శ్రీకారం చుడతారు. ప్రేమబంధానికి ఆహ్వానం పలుకుతారు. మీరు కావాలనుకున్న వాటిని పొందేందుకు సంసిద్ధంగా ఉండండి. ఓపికతో, లక్ష్యంపై గురిపెట్టండి. సహోద్యోగుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. అదృష్టం వరిస్తుంది. మీ లక్ష్యాలను, ఆశయాలను చేరుకుంటారు. కలిసొచ్చే రంగు: బ్లూ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఆస్తి, వాహనం, విద్యార్హతలు మొదలైన వాటికి సంబంధించిన పత్రాలని సక్రమంగా, భద్రంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోండి. రుణగ్రహీతలను ఒత్తిడి చేసి మరీ డబ్బు వసూలు చేసుకోండి, దౌర్జన్యం వద్దు. మిత్రులతోనూ, చనువుగా ఉండే వారితోనూ మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలయినంత జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరికీ రుణాన్నిచ్చే వారం కాదిది. టారస్ (ఏప్రిల్ 21-మే 20) మీతో ఎంతో చనువుగా ఉన్నారనే అభిప్రాయంతో ముందు వెనకలు ఆలోచించకుండా ఓ వాగ్దానాన్ని లేదా హామీని ఈయవలసి రావచ్చు. నిర్దంద్వంగా, మొహమాటం లేకుండా చెప్పండి- వాగ్దానం గాని హామీ గాని సంతకం గానీ చేయనే చేయనని. అలాగే ఇతరులకి సంబంధించిన ఓ ముఖ్యకార్యాన్ని మీరు చేయవలసిన లేదా చేయ వీలైన పరిస్థితి ఎదురు కావచ్చు. జెమిని (మే 21-జూన్ 21) పాత మొక్కుని తీర్చుకుంటారు. స్థానచలనానికి సంబంధించిన ప్రయత్నాలని ముమ్మరం చేస్తారు. అపరిష్కృతంగా ఉన్న పనుల్ని పూర్తి చేసుకోవాలన్న నిర్ణయానికి వస్తారు. మీకు ఉద్యోగంలో వస్తున్న ప్రశంసలకు పొంగిపోకండి. అధికభారం మీద పడబోతోందని గ్రహించి, చేయగలిగితేనే చేయగలననీ, లేనిపక్షంలో సాధ్యపడదని వినయంగా చెప్పండి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) మీ శత్రువుల తాటాకు చప్పుళ్లకు బెదిరిపోకండి. ధర్మం మీ పక్షానే ఉందని గ్రహించండి. దూరపు ప్రయాణాలని శారీరక శ్రమ అనిపించే పక్షంలో మానండి. ఎక్కువ ఆలోచించకండి. ఎవరినీ విరోధం చేసుకునే దిశగా ఆలోచించకండి. మీ పనిని మీరు సకాలంలో చేసుకుపోతుంటే కీర్తిప్రతిష్ఠలూ గౌరవమూ లభిస్తాయి. లియో (జూలై 24-ఆగస్టు 23) పాత పరిచయాలని చెడగొట్టుకునే మనస్తత్వం మీది కాకపోయినా సకాలంలో పనుల్ని చేసుకోకపోవడం మీకు ఈ గ్రహస్థితి కారణంగా అవుతూ ఉంటుంది. అయినా ప్రయత్నాన్ని విరమించకండి. మీ భార్య మీ గురించి తీవ్రంగా ఆందోళన చెందుకూ ఉండచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని వివరించి చెప్తూ ధైర్యాన్ని కల్గించండి. పాతబకాయిలన్నీ దాదాపు తీరిపోతాయి. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోండి తప్ప ప్రభుత్వం నుండి కాని మరేదో మార్గం ద్వారా గాని వస్తుందని భ్రమపడకండి. ఏదో లాభిస్తుందనే ఉద్దేశ్యంతో దూరభార వ్యయప్రయాస ప్రయాణాలని చేయకండి- ముందే తగు నిర్ణయాన్ని తీసుకోండి. విద్యార్థులు చక్కగా వృద్ధిలోకి రాగలరు. అనవసర పరిచయాలూ కాలక్షేప కార్యక్రమాలూ వద్దేవద్దన్న నిర్ణయానికి రండి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) సమయానికి తిండీనిద్రా లేకుండా నిర్విరామంగా పని చేస్తారు. ఫలితం అంతంతమాత్రమే అయినా ఇది రేపటి వృక్షం కోసం నేడు నాటిన విత్తనం వంటిదనుకుంటూ ఉత్సాహంగా శ్రమిస్తారు. ముందునాటికి సత్ఫలితాలుంటాయి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలోనూ, బాకీలు తీర్చడం విషయంలోనూ రాజీమార్గాన్ని ఆశ్రయించడం శ్రేయస్కరం. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) వ్యాపారాన్ని విస్తరింపజేయాలనే దృక్పథంతో విపరీతంగా శ్రమ పడుతూ రుణాలు చేసి మరీ పెట్టుబడులు పెట్టద్దు. పెట్టుబడీ శరీర శ్రమా కాకుండా తగుమాత్రంగా ఉండటం మంచిది సోదరులతో సత్సంబంధాలు, ఐకమత్యం ఉంటాయి. ఒకవిషయంలో నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఉంటుంది. దిగులు పడకండి. ఫలితం మీకు అనుకూలంగానే ఉంటుంది. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మిమ్మల్ని వ్యాపారంలో అణిచి వేయాలనే ఆలోచనతో కుయుక్తులు పన్నేవారికి ఏ మాత్రపు అనుకూలతా ఉండదు. మీరు ధర్మబద్ధంగానే సాగిపోండి. వారి ఈర్ష్యాద్వేషాల కారణంగా ఏ కష్టనష్టాలొస్తాయోనని ఆలోచిస్తూ కూర్చోక ధైర్యంగా ముందుకు వెళ్లండి. నష్టం ఉండదు. పెద్దల పరిచయాల వల్ల శత్రువులు మీ జోలికి రారు, వ్యాపారంలో ఒడిదుడుకులూ ఉండవు. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఉన్నచోటునే ఉండడం ఏ మాత్రమూ సరికాదని గ్రహిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి కావలసిన ప్రణాళికని తయారు చేసుకుంటారు. ఇంట్లో ఉన్న అందరినీ కూడా దీనిలో భాగస్వాముల్ని చేస్తూ శ్రమిస్తే విజయం మీదే! అనుభవజ్ఞులతో సంప్రదించి నిర్ణయం తీసుకోండి. పుణ్యక్షే త్రాలూ దైవదర్శనాలూ దానధర్మాలకీ ఓ పరిమితి ఉండాలని గుర్తుంచుకోండి. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) అనవసర ఆందోళన కలగవచ్చు. అలాటి దుఃఖం కలిగే సన్నివేశమేమీ లేనే లేదు. తోటి ఉద్యోగులతో లేదా ఇరుగుపొరుగుతో వాగ్వివాదం రావచ్చు. అది సాధారణమేని భావించండి తప్ప దానిగురించే ఆలోచిస్తూ ఉండకండి. పిల్లలకి ఆటల్లో చిరుగాయాలు గానీ తాత్కాలిక జ్వరాలు గానీ వచ్చే అవకాశముంది. ఎక్కువెక్కువ ఊహించుకోకండి. ఆధ్యాత్మిక గురువును ఎన్నుకోండి. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) కొంతకాలం పాటు మీరూ మీ కుటుంబం అనే వృత్తంలోనే తిరుగుతూ ఉండడం మంచిది. రుణాలు తీసుకోవడం/ ఇవ్వడం; భాగస్వాములుగా తెచ్చుకోవడం/విడిచేయడం వంటి కొత్తపనుల్నీ మార్పుల్నీ ఈ వారంలో చేయవద్దు. సంతానపు నడవడికా చదువూ ఆరోగ్యమూ వారికి చేయాల్సిన వ్యయమూ వంటివాటిమీదే కేంద్రీకరించండి. పొగడ్తలకి లొంగకండి. మైలవరపు శ్రీనివాసరావు -
మే 16 నుంచి మే 22 వరకు
టారో బాణి ఏర్పరచుకున్న లక్ష్యాలను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటారు. బాధ్యతాయుతంగా పనిచేయడం అనేది పనిలో మీ విజయసూత్రంగా పనిచేస్తుంది. ప్రేమవ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అయితే ప్రేమలో నిజాయితీగా ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోండి. కలిసి వచ్చే రంగు: రూబీ రెడ్ కొత్త సవాళ్లు ఎదురవుతాయి. మొదట కాస్త ఇబ్బంది పడినా... చివరకు వాటిని చేధించడంలో విజయం సాధిస్తారు. కాస్త ఒత్తిడికి గురవుతారు. అభివృద్ధి నెమ్మదిగా సాగుతుంది. ప్రేమిస్తోన్న వ్యక్తికీ మీకూ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సమయం పట్టవచ్చు. కలిసి వచ్చే రంగు: నీలం గత విషయాలను తలచుకోవడం వల్ల వేదనకు గురవుతారు. అయితే మీలోని అంతర్గత శక్తి, నిపుణుల సలహాల వల్ల ఉత్తేజం పొందుతారు. కొత్త శక్తిని పుంజుకుంటారు. మీకు ఉన్న పరిమితులను గుర్తించండి. ఏది ముఖ్యమో చూసుకోండి. ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా ఇతరులతో మీ సంబంధాలను మెరుగు పరుచుకోవచ్చు. కలిసొచ్చే రంగు: ముదురు ఆకుపచ్చ ఆత్మీయ అనుబంధాలు మీ జీవితంలో ముఖ్యమైన భాగం అవుతాయి. ప్రేమానందాల ఇంద్రధనుస్సు వెల్లివిరుస్తుంది. చేస్తున్న పనిలో విజయం సిద్దిస్తుంది. మీ ప్రణాళికల్ని కొన్ని సందర్భాల్లో మార్చుకోవాల్సి రావచ్చు. కొన్ని పనుల్లో కొన్ని మార్పులు అవసరమవుతాయి. ఆ మార్పులను వేగవంతం చేస్తారు. కలిసి వచ్చే రంగు: బ్రౌన్ వ్యాపారానికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు దూసుకు పోతారు. బిజీగా గడుపుతారు. బిజినెస్ ట్రిప్‌లు చేస్తారు. కాస్త రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేస్తే మీరనుకున్న పనులు సాధించగలరు. కలిసివచ్చే రంగు: నీలం ఎన్నాళ్లుగానో మీలో ఉన్న ఓ కోరిక నెరవేరుతుంది. ఈ వారమంతా ఆహ్లాదంగా గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. పనికి సంబంధించిన కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. చేస్తున్న పనిలో ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్లు ఎదురవుతుంటాయి. మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతికందుతాయి. కలిసివచ్చే రంగు: ఆరెంజ్ మీలోని సహజసిద్ధమైన ప్రతిభను మెరుగుపర్చుకుంటారు. ఆర్థికభారం పెరుగుతుంది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం వల్ల కాస్త ఉపశమనం పొందుతారు. కొన్ని పరిస్థితుల వల్ల మీ పనికి ఆటంకాలు ఏర్పడతాయి. సంయమనం పాటించడం ద్వారా సరియైన దారిని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. లక్ష్యసిద్ధి చేకూరుతుంది. కలిసివచ్చే రంగు: పీచ్ ఈ వారమంతా సంతోషంగా గడుపుతారు. మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. ఆచి తూచి నిర్ణయం తీసుకోండి. పాత బకాయిలను క్లియర్ చేసుకుంటారు. ఖరీదైన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. మీ మీద మీకు ఉండే నమ్మకమే మీ విజయసూత్రంగా పనిచేస్తుంది. ఇతరులకు సహాయ పడటం ద్వారా మీకు మేలుకలుగుతుంది. కలిసివచ్చే రంగు: గులాబి వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిలో నుంచి అత్యత్తమమైన ఆలోచనను ఎంచుకుంటే లాభం చేకూరుతుంది. కొత్తగా శక్తి పుంజుకోవడానికి, ఉత్తేజితం కావడానికి ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఎదురుకావచ్చు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కలిసివచ్చే రంగు: ఇటుకరాయి రంగు. ప్రతి పనినీ ఉత్సాహంగా చేసుకుంటూ పోతారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇతరులతో పోటీ పడతారు. అన్నింటా మెరుగైన ప్రతిభను కనబరుస్తారు. ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే వాటిని అమలుచేయడానికి ఇది కలిసొచ్చే వారం. కాబట్టి ఏమాత్రం సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. కలిసివచ్చే రంగు: పీచ్ ఇది మీకు కలిసొచ్చే సమయం. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. చేయాలనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలకు ఈవారం బాగా కలిసొస్తుంది. పనికి సంబంధించిన అవకాశాలు వెల్లువెత్తుతాయి. కలిసివచ్చే రంగు: కాఫీ బ్రౌన్ ప్రయాణాలు చేస్తారు. కొత్త కోర్సు చేయడమో, కొత్త పని ప్రారంభించడమో చేస్తారు. అన్ని విషయాల్లోనూ కొత్తదనానికి ప్రయత్నిస్తారు. జ్ఞానాన్ని పెంచుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. పనికి సంబంధించి మీ పరిధిని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ ప్రతిభ మిమ్మల్ని మరింత పాపులర్ చేస్తుంది. కలిసొచ్చే రంగు: లేత గోధుమరంగు విద్యార్థులకి అనుకూల కాలం ఇది. ఉద్యోగస్థులు పై పదవులకి ఆశించదగిన కాలం కూడా ఇది. కలిసొచ్చే ప్రయాణ సూచనలున్నాయి. అయితే, శనిదోషం ఉన్న కారణంగా ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టమైన అవగాహన లేకుండా దిగడం అంచనాలని తలకిందులు చేస్తుంది. నీలి రంగు దుస్తుల్ని వారంలో ఒకరోజైనా ధరించండి. కలిసి వచ్చే రోజు 16వ తేదీ అంటే నేడే. ఎవరికో సానుభూతి మీద సహాయాన్ని చేయదలిచి ‘అతి’కి పోయే పరిస్థితి కన్పిస్తోంది. అది సరికాదు. ముఖ్యంగా స్త్రీ విషయంలో మరింత ప్రమాదమని గ్రహించాలి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నించాలి. ఆవేశంలో మాట్లాడే మీ మాటలు వక్రీకరింపబడి మరీ వెళ్లే అవకాశముంది కాబట్టి మాటని అదుపు చేసుకోండి. తెల్లని దుస్తుల్ని వారంలో ఒకరోజైనా ధరించండి. బుధవారం అనుకూలంగా ఉంది. మీకు మీరు చక్కని జీవిత పాఠాన్ని నేర్చుకునే వారం ఇది. ఒకప్పుడు చేసిన వాగ్దానం మిమ్మల్ని ఇబ్బందిలో పడేయవచ్చు. ఏ మాత్రమూ వెనుకాడకుండా ‘అది సాధ్యపడ’దనే విషయాన్ని నిజాయితీగా అంగీకరించండి. ఉద్యోగంలో సరదాతనం, అశ్రద్ధ వద్దే వద్దు. తగినంతగా ఉండండి - ఇతరుల్ని ఉంచండి. బుధవారం మంచిది. తెలుపు దుస్తులు వారానికి రెండు రోజులు (2/7) ధరించాలి. ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తారో అంత పిరికితనంతోనూ వెనక్కి రావచ్చు. వివాదాలకి దూరంగా ఉండండి. మనశ్శాంతి లభిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోనని తెగేసి చెప్పండి. సంతోషకరమైన వార్తలు వింటారు. స్థిరాస్తుల వివాదాలలో, స్థిరాస్తిని సాధించే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. వారంలో మూడురోజులపాటు నలుపు, నీలం కలిసిన దుస్తులు ధరించటం శ్రేష్ఠం. శనివారం అనుకూలం. వ్యవసాయ, వ్యాపార రంగాల వారికి ఎలా పెట్టుబడులు పెట్టాలో స్వయంగా కాలం చెప్పిన పాఠాలని ఒంటబట్టించుకునే వారం ఇది. ధైర్యంగా ముందుకి సాగండి. నిశ్చితార్థాలు, వివాహాలు వంటివి జరిగే అవకాశముంది. మీరు చేసిన ఒకప్పటి తప్పుల్ని తిరిగి చేయకండి. చేతిలో ఉన్న ధనాన్ని ఖర్చు చేయకండి. తెల్లని వస్త్రాలు ఈ వారంలో ఒకసారయినా ధరించడం మంచిది. గురువారం అనుకూలం. ఎప్పటికి సరిపోయిన ఆలోచనని అప్పుడు చేసేసి ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. శాశ్వత ప్రణాళికని మీ భార్య/ భర్తతో సంప్రదించి వేసుకోండి. సంసారంలోనికి మూడో వ్యక్తి చేరకుంటే ముక్తి - చేరితే విరక్తి అని గ్రహించి మీ ఉభయులే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీ కంటే రెండు లేదా మూడు రెట్ల వయసువారి అనుభవాల్ని తీసుకుంటూ ఉండండి. ఎరుపు రంగు దుస్తులు (2/7) వాడండి. సోమవారం అనుకూలం. మీ పట్టుదల తాత్కాలికంగా మంచిని కలిగించవచ్చు. కాని అది శ్రుతి మించిన పక్షంలో వ్యతిరేక ఫలితాన్నిస్తుందని గమనించి, అడుగుని కొద్దిగా సడలించండి. తెలివిగా వ్యవహరించండి. కుటుంబ విషయాల్లో న్యాయస్థానపు తలుపుని తట్టవద్దు. ఇప్పటికే వెళ్లి ఉన్నట్లయితే, రాజీ మార్గాన్ని అన్వేషించండి. సంతానపు చదువు విషయంలో శ్రద్ధ పెట్టండి. ఎరుపు రంగు దుస్తులు (1/7) ధరించండి. శుక్రవారం అనుకూలం. చక్కని తెగింపు మీకు లభించినందుకు సంతోషించండి. మీ సమత్వ స్థితి మీకు సత్ఫలితాన్నే ఇస్తుంది. ద్రోహం చేయాలనే ఆలోచన లేని మీకు అంతా మంచే జరుగుతుంది. పై అధికారులు చెప్పింది చెయ్యండి తప్ప సూచనలనీ సలహాలనీ ఇయ్యాలని ప్రయత్నించ వద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇది మీకు మంచి వారం. కలగలుపు రంగు దుస్తులు వాడండి. మంగళవారం తప్ప అన్ని రోజులూ అనుకూలమే. తేలికగా అయిపోయే పని చిక్కుముడులు పడి పడి శ్రమ మీద విజయవంతమౌతుంది. కొత్త ఉద్యోగం లభించవచ్చు కాని, ఆలోచించి మాత్రమే అంగీకారాన్ని తెలపండి. భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు ఈ వారంలో తొలగిపోకపోవచ్చు. నా భార్య/ నా భర్త అనుకుంటూ అభిమానాన్ని విడిచి మీరే పలకరించడానికి ప్రయత్నించండి. దుస్తుల్లో ప్రత్యేక నియమం లేదు. శుక్రవారం మంచిది. చేస్తున్న వ్యాపారం/ ఉద్యోగం/ వృత్తి ఏమంత ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. స్థలం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మార్చవద్దు ఈ వారంలో. దానంతటదే కాలానుగుణంగా ఓ నిర్ణయం దైవం ద్వారా వస్తుంది. దాన్నే ‘అ-దృష్ట’మంటారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం/ వివాహం/ సంతానం కలిగే అవకాశముంది. పక్కవారి మాటల ద్వారా రెచ్చిపోకండి. నీలిరంగు దుస్తులు (1/7) వాడండి. గురువారం అనుకూలం. ఉద్యోగమనేది కుటుంబ పోషణ కోసమనుకోండి తప్ప, ఉద్యోగమే కుటుంబమనుకోకండి. అకాలనిద్ర, అకాలభోజనం, దూర ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగపు మార్పు, ఇంటి మార్పు, వద్దే వద్దు.‘ప్రతికూలత తీవ్రంగా ఉన్నా పైచేయి నాదే కదా’ అని అనుకోకండి. అంత ప్రతికూలత ఎందుకుండాలి? అని ఆత్మపరీక్ష చేసుకోవలసిన వారం ఇదని గమనించండి. అన్ని రంగుల దుస్తులూ మంచివే. అన్ని రోజులూ అనుకూలమే. తగిన సమయానికి రుణం లభిస్తుంది. సరైన సమయంలో మీ కోరిక నెరవేరుతుంది. ఆందోళన వద్దు. దాంపత్యం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలు రావచ్చు. శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. దానాలు, ధర్మాలు, దైవ పూజలు, తీర్థయాత్రలకి ఒక హద్దుండాలని గమనించండి. పసుపు రంగు దుస్తులు (2/7) శ్రేష్ఠం. ఆదివారం అనుకూలం. ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
మే 23 నుంచి మే 29 వరకు
టారో బాణి మెరుగైన విజయాలు సాధించడానికి ఇది సరైన సమయం. పనులు పూర్తి చేయడంలో గతంలో కంటే ఉత్సాహంగా ఉంటారు. ఒక వ్యక్తి నుంచి సహాయం లభిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో, వాటిని కాపాడుకునే విషయంలో ఒకింత ఒత్తిడికి గురవుతారు. చిన్నపనుల కోసం అధిక శ్రమ అక్కర్లేదు. కలిసి వచ్చే రంగు: ఎమరాల్డ్ గ్రీన్ అనుకోకుండా ఎదురయ్యే ఒక సంఘటన మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు మించిన లాభాలు అందుకుంటారు. ప్రతి సమస్యను పరిష్కరించుకుంటారు. అందరికీ మీ పనితనం తెలిసేలా చేస్తారు. ప్రేమ వ్యవహారాలు మంచి మలుపు తిరుగుతాయి. కలిసి వచ్చే రంగు: ఊదా రంగు విజయానందాలు మీ సొంతమయ్యే కాలం. ఆశావహదృక్పథంతో వ్యవహరిస్తారు. ఆర్థిక అంశాలకు సంబంధించి మీకు బాగా ఆనందం కలిగించే వార్త ఒకటి తెలుస్తుంది. ప్రతి విషయానికీ పలు ఆప్షన్లు మీ ముందు కనిపిస్తాయి. ఎంపిక విషయంలో కన్ఫ్యూజ్ అవకుండా ఆచితూచి అడుగేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కలిసి వచ్చే రంగు: లేత నీలం కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ‘విభిన్నమైన ప్రపంచంలో ఉన్నాను’ అనే భావనకు గురవుతారు. మీ జ్ఞానం, వైవిధ్యభరిత ఆలోచనల వల్ల మంచి అవకాశాలు అందుకుంటారు. సహచరులతో వాదనకు దిగే పరిస్థితి రావచ్చు. అయితే ఆ వాదనను వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఔట్‌డోర్ స్పోర్ట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: సిల్వర్ కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. ముఖ్యమైన డాక్యుమెంట్లపై సంతకాలు జరుగుతాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ప్రేమ విషయాలు కొంత ఇబ్బంది పెడతాయి. బంధుమిత్రులతో అపార్థాలను తొలగించుకోవడం మంచిది. గొంతుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. కలిసివచ్చే రంగు: ఆరెంజ్ అనుకోని అవకాశాలు మీ దరికి వస్తాయి. మీ కలలు నిజమవుతాయి. ఒక వ్యక్తి మిమ్మల్ని ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ‘రిస్క్’ అనుకొని వెనకడుగు వేయడానికి ప్రయత్నించిన పనులు సైతం అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. మీరు బాగా ప్రేమించే ఒక వ్యక్తిని కలుసుకుంటారు. కలిసి వచ్చే రంగు: లేత గోధుమ మీ కమ్యునికేషన్ స్కిల్స్ మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. పనిలో ప్రతిభ చూపి ప్రశంసలు అందుకుంటారు. సమావేశాల్లో మీ ప్రతిభ గురించి అందరూ మాట్లాడుకుంటారు. వెన్నునొప్పి, మైగ్రెయిన్స్ లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కలిసివచ్చే రంగు: గులాబి అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే మీకున్న ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యలను పరిష్కరించుకుంటారు. పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాదు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏవైనా కళల మీద మనసు పెట్టండి. తద్వారా సంతోషంగా ఉంటారు. వీలైనంత వరకూ ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు: గ్రే ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. కొత్త బంధాలు సంతోషాన్ని ఇస్తాయి. అంతరాత్మ చెప్పినదాని ప్రకారం నడుచుకోండి. పనికి సంబంధించి కొత్త అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. బయటి వాతావరణం శరీరానికి సరిపడకపోవచ్చు. కలిసి వచ్చే రంగు: బ్రైట్ గ్రీన్ మీ మనసుకు దగ్గరయ్యే వ్యక్తిని ఇప్పటి వరకు మీరు కనుక్కోలేకపోతే, ఆ వ్యక్తిని ఎంచుకోవడానికి తగిన సమయం. మీలోని సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించే సమయం కూడా. గాసిప్లను పట్టించుకోకుండా ఉండడం మంచిది. ఒకవేళ వాటికి ప్రాధాన్యత ఇస్తే, మీ పనికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కలిసివచ్చే రంగు: ఆరెంజ్ మీ చుట్టూ ప్రేమ పూరితమైన వాతావరణం కనిపిస్తుంది. జీవితం, ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఆత్మశోధన చేసుకుంటారు. మీ నిర్వహణా సామర్థ్యానికి మించి పనిలో మీకు కొత్త బాధత్యలు వచ్చి పడతాయి. కొన్నిరోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కలిసి వచ్చే రంగు: బ్రౌన్ ఈ వారమంతా సరదా మూడ్‌లో ఉంటారు. ఉల్లాసంగా గడుపుతారు. ఒక తోడు కోసం అన్వేషించేవారికి ఇది తగిన సమయం. పరిస్థితుల మార్పు గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. అయితే బ్యాక్‌పెయిన్ బాధించవచ్చు. అన్ని విషయాల్లోనూ మీ అంతరంగం చెప్పేదాన్ని వినడం ఉత్తమం. కలిసి వచ్చే రంగు: లేత నీలం ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఆర్థికంగా బాగా ఉన్నామని ఖర్చుల్ని పెంచుకోకండి. శారీరకంగా బాగున్నామనే ఆలోచనతో ఆహార విహారాదుల్లో పరిమితిని దాటకండి. ఉద్యోగపరంగా ప్రోత్సాహకరంగానే ఉంది కదా అని కింది ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ అలాగే సహోద్యోగులతోనూ వివాదం తెచ్చుకోవద్దు. వారంలో ఒక్కరోజైనా గోవులకి పచ్చగడ్డిని పెట్టించండి. ఇంటికొచ్చిన మూడోవ్యక్తి కారణంగా కుటుంబంలో అనైకమత్యం తలెత్తవచ్చు. వ్యాపారంలో భాగస్వాములతో కొద్దిగా వాదవివాదాలు వృత్తి ఉద్యోగాల్లో మనఃస్పర్థలు తలెత్తవచ్చు. ఇలాంటి సంఘటనలు రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే ముందు జాగ్రత్తతో ఉండటం మంచిది. వారంలో రెండు రోజుల పాటైనా గోవులకి చక్కని పండ్లని ఇప్పించండి. ప్రతి పనీ వాయిదా పడుతూ, భార్యాభర్తలు ఐకమత్యంతో లేకుండా, కుటుంబ రహస్యాలు పక్కవారికీ బంధువులకీ చేరుతూ ఈ వారమంతా నిర్వేదంతో నిరాసక్తతతో ఉండవచ్చు. ఇది తాత్కాలిక ఘర్షణం మాత్రమే. ఉద్యోగపు మార్పు స్థానచలనం, అద్దెఇంటి మార్పు వస్తే తప్పక మారండి. గోవులకి ఇష్టమైన కుడితిని గోశాలకి వెళ్లి పెట్టించండి. కాలం నేర్పిన అనుభవం దృష్ట్యా వేటికి దూరంగా ఉండాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు బాగా అర్థమైన కారణంగా అలాగే ప్రయాణించండి. ఎంతటి దగ్గరవారొచ్చి అడిగినా హామీలనీ వాగ్దానాలనీ రుణాలనీ పూర్తిగా మానండి. మీకు కలిగిన సంతోషాన్ని కూడ లోపలే దాచుకోవలసిన వారం ఇది. గోవులకి ఆకుకూరల్ని పెట్టించండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన అన్నింటినీ సమకూర్చుకోండి. దూర ప్రయాణాలు చేయవలసివచ్చినా నష్టమపోతామేమోననే భయం వద్దు. దాన ధర్మాలతో పాటు, పిల్లలు చదువుల్ని అశ్రద్ధ చేయకుండా చేసుకుంటూ ఉండండి. ఒక్క ఆవుకైనా ఈగ/దోమ బాధ లేకుండా దోమతెరని అందించండి. భార్యాభర్తల ఐకమత్యానికున్న గట్టిదనం ముందు ఉక్కుసౌధాలు కూడ పెళుసే అనే విశేషాన్ని స్వయంగా గమనిస్తారు. సరైన సమయానికి భోజనం, నిద్ర అనేవాటిని చూసుకుంటూ అనారోగ్యం ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. మద్యం, జూదం వంటివాటిని మానే ప్రయత్నం ప్రారంభించండి. సంతాన అభివృద్ధి కోసం గోవులకి పచ్చికూరముక్కల్ని పెట్టించండి. మిమ్మల్నీ మీ జీవితాన్నీ గురించి వ్యక్తిగతంగా మీకు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. యంత్రాలూ వాహనాల విషయంలో తగినంత జాగ్రత్తతో వ్యవహరించండి. మీవైపు నుండే కాకుండా మీరు ఎవర్ని శత్రువులుగా చూస్తున్నారో వారివైపు నుండి ఆలోచించండి ఏకాంతంలో. అంతా సవ్యమౌతుంది. గోవులకి ఆరోగ్యకరమైన నీటిని వారం రోజులపాటు అందించండి. అందరూ మీ మాట కాఠిన్యానికి భయపడి గౌరవిస్తున్నారేమో గమనించుకోండి. నిదానమైన మాట పదిమందిని దగ్గరికి రానిస్తుందని గ్రహించండి. చిన్నపాటి వైద్యపరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. తీసుకున్న రుణం ఒకపక్క నిదానంగా ఖర్చు అయిపోతోందేమో (రుణం తీసుకున్న పనికి కాక) పరిశీలించుకోండి. గోవులకి తెలకపిండిని అందించండి. ఆశించిన ఉద్యోగం ఇదుగో! అంటూ దూరదూరం జరిగిపోతూండవచ్చు. మీ ఏకపక్ష నిర్ణయం కారణంగా బంధుమిత్రులు వ్యతిరేకులయ్యే ప్రమాదమూ ఉండవచ్చు. వివాహమయ్యాక కూడ తల్లిదండ్రులకీ అలాగే అన్నదమ్ముల మాటలకే ప్రాధాన్యాన్నిస్తున్నారేమో ఆత్మపరీక్ష చేసుకుని మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. గోవులకి వైద్యపరీక్షలు యథాశక్తి చేయించండి. రోజులు దొర్లిపోతున్నాయనే సంతృప్తితో వ్యాపారాన్ని విస్తరింపజేయడం లేదేమో గమనించుకోండి. మాట పట్టుదల కారణంగా పెద్దల్ని దూరం చేసుకున్నామేమో ఆలోచించి సాన్నిహిత్యం కోసం ప్రయత్నించండి. గోవులకి ఎండ బాధ లేకుండా ఉండే నూనెకి సొమ్ముని అందించండి. మీకు మీరుగా నిర్ణయాన్ని తీసుకోకుండా పై అధికారి సూచనలు ఆజ్ఞలనే పాటించండి. మీరు ఏ పొదుపు లేదా వ్యయం చేయదలచినా భార్య/భర్తకి ముందుగా తెలియజేయండి. వివాహం కొత్త ఇంటి కొనుగోలు స్థలం మొదలైనవాటి కొనుగోలు విషయంలో ఒకరికిద్దర్ని సంప్రదించి మరీ తీసుకోండి. గోవులకి మీకు తోచిన సేవ చేయండి. పిల్లల చదువుల కారణంగా తాత్కాలికమైన ఆర్థిక భారం కలుగుతుంది. రుణాన్ని చేయడం తప్పుకాదని గ్రహించండి. ఉద్యోగంలో వచ్చిన పదవీ ఉన్నతి కారణంగా బాధ్యతలు పెరిగి కొంత పని ఒత్తిడి, అసహనం పెరుగుతాయి. రోజూ ప్రాణాయామాన్ని క్రమం తప్పక చేయండి. గోవులకి ఎండుగడ్డిని యథాశక్తి అందించండి. - డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు