మే 16 నుంచి మే 22 వరకు | Taro the style | Sakshi
Sakshi News home page

మే 16 నుంచి మే 22 వరకు

Published Fri, May 15 2015 11:04 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

మే 16 నుంచి మే 22 వరకు

మే 16 నుంచి మే 22 వరకు

టారో బాణి
 
ఏర్పరచుకున్న లక్ష్యాలను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటారు. బాధ్యతాయుతంగా పనిచేయడం అనేది పనిలో మీ విజయసూత్రంగా పనిచేస్తుంది. ప్రేమవ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అయితే ప్రేమలో నిజాయితీగా ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోండి. కలిసి వచ్చే రంగు: రూబీ రెడ్
 
 కొత్త సవాళ్లు ఎదురవుతాయి. మొదట కాస్త ఇబ్బంది పడినా... చివరకు వాటిని చేధించడంలో విజయం సాధిస్తారు. కాస్త ఒత్తిడికి గురవుతారు. అభివృద్ధి నెమ్మదిగా సాగుతుంది. ప్రేమిస్తోన్న వ్యక్తికీ మీకూ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సమయం పట్టవచ్చు.
 కలిసి వచ్చే రంగు: నీలం
 
గత విషయాలను తలచుకోవడం వల్ల వేదనకు గురవుతారు. అయితే మీలోని అంతర్గత శక్తి, నిపుణుల సలహాల వల్ల ఉత్తేజం పొందుతారు. కొత్త శక్తిని పుంజుకుంటారు. మీకు ఉన్న పరిమితులను గుర్తించండి. ఏది ముఖ్యమో చూసుకోండి. ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా ఇతరులతో మీ  సంబంధాలను మెరుగు పరుచుకోవచ్చు. కలిసొచ్చే రంగు: ముదురు ఆకుపచ్చ
 
ఆత్మీయ అనుబంధాలు మీ జీవితంలో ముఖ్యమైన భాగం అవుతాయి. ప్రేమానందాల ఇంద్రధనుస్సు వెల్లివిరుస్తుంది. చేస్తున్న పనిలో విజయం సిద్దిస్తుంది. మీ ప్రణాళికల్ని కొన్ని సందర్భాల్లో మార్చుకోవాల్సి రావచ్చు. కొన్ని పనుల్లో కొన్ని మార్పులు అవసరమవుతాయి. ఆ మార్పులను  వేగవంతం చేస్తారు.
  కలిసి వచ్చే రంగు: బ్రౌన్
 
వ్యాపారానికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో  ధైర్యంగా ముందడుగు వేస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు దూసుకు పోతారు. బిజీగా గడుపుతారు. బిజినెస్ ట్రిప్‌లు చేస్తారు. కాస్త రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేస్తే మీరనుకున్న పనులు సాధించగలరు. కలిసివచ్చే రంగు: నీలం
 
ఎన్నాళ్లుగానో మీలో ఉన్న ఓ కోరిక నెరవేరుతుంది. ఈ వారమంతా ఆహ్లాదంగా గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. పనికి సంబంధించిన కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. చేస్తున్న పనిలో ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్లు ఎదురవుతుంటాయి. మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతికందుతాయి. కలిసివచ్చే రంగు: ఆరెంజ్
 
మీలోని సహజసిద్ధమైన ప్రతిభను మెరుగుపర్చుకుంటారు. ఆర్థికభారం పెరుగుతుంది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం వల్ల కాస్త ఉపశమనం పొందుతారు. కొన్ని పరిస్థితుల వల్ల మీ పనికి ఆటంకాలు   ఏర్పడతాయి. సంయమనం పాటించడం ద్వారా సరియైన దారిని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. లక్ష్యసిద్ధి చేకూరుతుంది. కలిసివచ్చే రంగు: పీచ్
 
ఈ వారమంతా సంతోషంగా గడుపుతారు. మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. ఆచి తూచి నిర్ణయం తీసుకోండి. పాత బకాయిలను క్లియర్ చేసుకుంటారు. ఖరీదైన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. మీ మీద మీకు ఉండే నమ్మకమే మీ విజయసూత్రంగా పనిచేస్తుంది. ఇతరులకు సహాయ పడటం ద్వారా మీకు మేలుకలుగుతుంది. కలిసివచ్చే రంగు: గులాబి
 
వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిలో నుంచి అత్యత్తమమైన ఆలోచనను ఎంచుకుంటే  లాభం చేకూరుతుంది. కొత్తగా శక్తి పుంజుకోవడానికి, ఉత్తేజితం కావడానికి ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఎదురుకావచ్చు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
 కలిసివచ్చే రంగు: ఇటుకరాయి రంగు.
 
ప్రతి పనినీ ఉత్సాహంగా చేసుకుంటూ పోతారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇతరులతో పోటీ పడతారు. అన్నింటా మెరుగైన ప్రతిభను కనబరుస్తారు. ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే వాటిని అమలుచేయడానికి ఇది కలిసొచ్చే వారం. కాబట్టి ఏమాత్రం సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి.  కలిసివచ్చే రంగు: పీచ్
 
ఇది మీకు కలిసొచ్చే సమయం. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. చేయాలనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలకు  ఈవారం బాగా కలిసొస్తుంది. పనికి సంబంధించిన అవకాశాలు వెల్లువెత్తుతాయి. కలిసివచ్చే రంగు: కాఫీ బ్రౌన్
 
ప్రయాణాలు చేస్తారు. కొత్త కోర్సు చేయడమో, కొత్త పని ప్రారంభించడమో చేస్తారు. అన్ని విషయాల్లోనూ కొత్తదనానికి ప్రయత్నిస్తారు. జ్ఞానాన్ని పెంచుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. పనికి సంబంధించి మీ పరిధిని విస్తృతం  చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ ప్రతిభ మిమ్మల్ని మరింత పాపులర్ చేస్తుంది.
 కలిసొచ్చే రంగు: లేత గోధుమరంగు
 
విద్యార్థులకి అనుకూల కాలం ఇది. ఉద్యోగస్థులు పై పదవులకి ఆశించదగిన కాలం కూడా ఇది. కలిసొచ్చే ప్రయాణ సూచనలున్నాయి. అయితే, శనిదోషం ఉన్న కారణంగా ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టమైన అవగాహన లేకుండా దిగడం అంచనాలని తలకిందులు చేస్తుంది. నీలి రంగు దుస్తుల్ని వారంలో ఒకరోజైనా ధరించండి. కలిసి వచ్చే రోజు 16వ తేదీ అంటే నేడే.
 
ఎవరికో సానుభూతి మీద సహాయాన్ని చేయదలిచి ‘అతి’కి పోయే పరిస్థితి కన్పిస్తోంది. అది సరికాదు. ముఖ్యంగా స్త్రీ విషయంలో మరింత ప్రమాదమని గ్రహించాలి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నించాలి. ఆవేశంలో మాట్లాడే మీ మాటలు వక్రీకరింపబడి మరీ వెళ్లే అవకాశముంది కాబట్టి మాటని అదుపు చేసుకోండి. తెల్లని దుస్తుల్ని వారంలో ఒకరోజైనా ధరించండి. బుధవారం అనుకూలంగా ఉంది.
 
మీకు మీరు చక్కని జీవిత పాఠాన్ని నేర్చుకునే వారం ఇది. ఒకప్పుడు చేసిన వాగ్దానం మిమ్మల్ని ఇబ్బందిలో పడేయవచ్చు. ఏ మాత్రమూ వెనుకాడకుండా ‘అది సాధ్యపడ’దనే విషయాన్ని నిజాయితీగా అంగీకరించండి. ఉద్యోగంలో సరదాతనం, అశ్రద్ధ వద్దే వద్దు. తగినంతగా ఉండండి - ఇతరుల్ని ఉంచండి. బుధవారం మంచిది. తెలుపు దుస్తులు  వారానికి రెండు రోజులు (2/7) ధరించాలి.
 
ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తారో అంత పిరికితనంతోనూ వెనక్కి రావచ్చు. వివాదాలకి దూరంగా ఉండండి. మనశ్శాంతి లభిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోనని తెగేసి చెప్పండి. సంతోషకరమైన వార్తలు వింటారు. స్థిరాస్తుల వివాదాలలో, స్థిరాస్తిని సాధించే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. వారంలో మూడురోజులపాటు నలుపు, నీలం కలిసిన దుస్తులు ధరించటం శ్రేష్ఠం. శనివారం అనుకూలం.
 
 వ్యవసాయ, వ్యాపార రంగాల వారికి ఎలా పెట్టుబడులు పెట్టాలో స్వయంగా కాలం చెప్పిన పాఠాలని ఒంటబట్టించుకునే వారం ఇది. ధైర్యంగా ముందుకి సాగండి. నిశ్చితార్థాలు, వివాహాలు వంటివి జరిగే అవకాశముంది. మీరు చేసిన ఒకప్పటి తప్పుల్ని తిరిగి చేయకండి. చేతిలో ఉన్న ధనాన్ని ఖర్చు చేయకండి. తెల్లని వస్త్రాలు ఈ వారంలో ఒకసారయినా ధరించడం మంచిది. గురువారం అనుకూలం.
 
 ఎప్పటికి సరిపోయిన ఆలోచనని అప్పుడు చేసేసి ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. శాశ్వత ప్రణాళికని మీ భార్య/ భర్తతో సంప్రదించి వేసుకోండి. సంసారంలోనికి మూడో వ్యక్తి చేరకుంటే ముక్తి - చేరితే విరక్తి అని గ్రహించి మీ ఉభయులే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీ కంటే రెండు లేదా మూడు రెట్ల వయసువారి అనుభవాల్ని తీసుకుంటూ ఉండండి. ఎరుపు రంగు దుస్తులు (2/7) వాడండి. సోమవారం అనుకూలం.
 
 మీ పట్టుదల తాత్కాలికంగా మంచిని కలిగించవచ్చు. కాని అది శ్రుతి మించిన పక్షంలో వ్యతిరేక ఫలితాన్నిస్తుందని గమనించి, అడుగుని కొద్దిగా సడలించండి. తెలివిగా వ్యవహరించండి. కుటుంబ విషయాల్లో న్యాయస్థానపు తలుపుని తట్టవద్దు. ఇప్పటికే వెళ్లి ఉన్నట్లయితే, రాజీ మార్గాన్ని అన్వేషించండి. సంతానపు చదువు విషయంలో శ్రద్ధ పెట్టండి. ఎరుపు రంగు దుస్తులు (1/7) ధరించండి. శుక్రవారం అనుకూలం.
 
 చక్కని తెగింపు మీకు లభించినందుకు సంతోషించండి. మీ సమత్వ స్థితి మీకు సత్ఫలితాన్నే ఇస్తుంది. ద్రోహం చేయాలనే ఆలోచన లేని మీకు అంతా మంచే జరుగుతుంది. పై అధికారులు చెప్పింది చెయ్యండి తప్ప సూచనలనీ సలహాలనీ ఇయ్యాలని ప్రయత్నించ వద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇది మీకు మంచి వారం. కలగలుపు రంగు దుస్తులు వాడండి. మంగళవారం తప్ప అన్ని రోజులూ అనుకూలమే.
 
 తేలికగా అయిపోయే పని చిక్కుముడులు పడి పడి శ్రమ మీద విజయవంతమౌతుంది. కొత్త ఉద్యోగం లభించవచ్చు కాని, ఆలోచించి మాత్రమే అంగీకారాన్ని తెలపండి. భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు ఈ వారంలో తొలగిపోకపోవచ్చు. నా భార్య/ నా భర్త అనుకుంటూ అభిమానాన్ని విడిచి మీరే పలకరించడానికి ప్రయత్నించండి. దుస్తుల్లో ప్రత్యేక నియమం లేదు. శుక్రవారం మంచిది.
 
 చేస్తున్న వ్యాపారం/ ఉద్యోగం/ వృత్తి ఏమంత ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. స్థలం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మార్చవద్దు ఈ వారంలో. దానంతటదే కాలానుగుణంగా ఓ నిర్ణయం దైవం ద్వారా వస్తుంది. దాన్నే ‘అ-దృష్ట’మంటారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం/ వివాహం/ సంతానం కలిగే అవకాశముంది. పక్కవారి మాటల ద్వారా రెచ్చిపోకండి. నీలిరంగు దుస్తులు (1/7) వాడండి. గురువారం అనుకూలం.
 
 ఉద్యోగమనేది కుటుంబ పోషణ కోసమనుకోండి తప్ప, ఉద్యోగమే కుటుంబమనుకోకండి. అకాలనిద్ర, అకాలభోజనం, దూర ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగపు మార్పు, ఇంటి మార్పు, వద్దే వద్దు.‘ప్రతికూలత తీవ్రంగా ఉన్నా పైచేయి నాదే కదా’ అని అనుకోకండి. అంత ప్రతికూలత ఎందుకుండాలి? అని ఆత్మపరీక్ష చేసుకోవలసిన వారం ఇదని గమనించండి. అన్ని రంగుల దుస్తులూ మంచివే. అన్ని రోజులూ అనుకూలమే.
 
 తగిన సమయానికి రుణం లభిస్తుంది. సరైన సమయంలో మీ కోరిక నెరవేరుతుంది. ఆందోళన వద్దు. దాంపత్యం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలు రావచ్చు. శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. దానాలు, ధర్మాలు, దైవ పూజలు, తీర్థయాత్రలకి ఒక హద్దుండాలని గమనించండి. పసుపు రంగు దుస్తులు (2/7) శ్రేష్ఠం. ఆదివారం అనుకూలం.
 
 ఇన్సియా కె.
 టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
 డా॥మైలవరపు శ్రీనివాసరావు
 సంస్కృత పండితులు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement