Mailavarapu Rao
-
మీ కలలు నెరవేరతాయి...
జనవరి 23 నుంచి 29 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) కొంతకాలంగా మానసిక ఒత్తిడితో, అశాంతితో బాధపడుతున్నవారికి ప్రశాంతత లభిస్తుంది. కొత్త ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. వారి ఆలోచనలను మీరు అవలంబిస్తారు. కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. బహుశ ఈ అవకాశం మీ జీవితాన్ని మలుపు తిప్పేది కావచ్చు. మీ లక్కీ నంబర్ 21. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ టారస్ (ఏప్రిల్ 21-మే 20) విజయవంతంగా, అదృష్టకరంగా నడుస్తుందీవారం. మీ బంధాలు, బంధుత్వాలు, భావోద్వేగాలే మిమ్మల్ని శాసించడం లేదా మీ మనస్సును ప్రభావితం చేయడం జరగవచ్చు. కొన్ని విషయాలలో సంప్రదాయాన్ని పాటిస్తూ, పెద్దలు చెప్పిన శాస్త్రీయవిధానాలను అనుసరించడం మంచిది. ఇతరులకిచ్చిన వాగ్దానాల విషయంలో పునరాలోచన అవసరం. మీ వాగ్ధాటి, మాటలలోని చమత్కారం మీకు బాగా ఉపయోగపడతాయి. కలిసొచ్చే రంగు: పగడపు రంగు జెమిని (మే 21-జూన్ 21) మీరు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న స్వేచ్ఛ లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగం మాని, కొత్త ప్రదేశంలో కొత్త ఉద్యోగం కోసం వెతకాలనుకుంటారు. ట్రావెల్ బిజినెస్ కోసం ఎదురు చూస్తారు. ఉన్నట్టుండి మీలో ఏదో మార్పు వచ్చి, ఆధ్యాత్మిక విషయాలవైపు మొగ్గు చూపుతారు. జీవితాన్ని సంపూర్ణంగా, స్వేచ్ఛగా జీవించాలని తెలుసుకుంటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. పని మీద దృష్టి పెట్టండి. కలిసొచ్చే రంగు: ముదురు ఊదా క్యాన్సర్(జూన్22-జూలై 23) ఈ వారమంతా మీకెంతో సామరస్యపూర్వకంగా గడుస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ సంతృప్తి లభిస్తుంది. సత్వర నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం వస్తుంది. ఎప్పటినుంచో ఉన్న ఒక ఆలోచనను అమలులో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. మీలాగే ఆలోచించే మరికొందరిని కలుపుకుని కొత్త వ్యాపారాన్ని లేదా ప్రాజెక్టును చేపడతారు. అయితే కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించాలని గుర్తుంచుకోండి. కలిసొచ్చే రంగు: లేత పసుప్పచ్చ లియో (జూలై 24-ఆగస్టు 23) జీవితంలో ముందుకు దూసుకెళతారు. ఒక కొత్త వ్యాపారాన్ని చేపట్టే ఆలోచన రావడమే కాదు, దానిని వెంటనే అమలు పరిచి, దాని విజయాన్ని, దానినుంచి మంచి లాభాలను అందుకుంటారు కూడా! దూరప్రాంతానికి ప్రయాణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారాన్ని పెంచుకోకండి. ఒక బంధం విషయంలో అభద్రతాభావాన్ని ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కలిసొచ్చే రంగు: సిల్వర్ గ్రే వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ధైర్యం అంటే మీ మనసులో ఉన్నదాన్ని నిర్భయంగా చెప్పడం, అవతలివాళ్లు చెప్పేదానిని నిర్భయంగా వినడం కూడా అని విన్స్టన్ చర్చిల్ అన్నట్లుగా ప్రశాంతంగా, నిమ్మళమైన మనస్సుతో ఉండటం, మీ ఆలోచనలను ధైర్యంగా అమలు చేయడం మంచి ఫలితాలనిస్తుంది. అయితే నిదానమే ప్రధానం అన్న సూక్తిని అన్ని విషయాల్లోనూ అమలు చేయాలనుకోవడం సబబు కాదు. ప్రేమ విషయంలో నిబ్బరంగా ఉండండి. కలిసొచ్చే రంగు: నారింజ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) పని చేసీ చేసీ అలసిపోయిన శరీరం, మనస్సు సేదతీరవలసిన సమయమిది. తగినంత విశ్రాంతి లేకపోతే రీఛార్జ్ కాలేరు కదా! డబ్బు గడించడంలో మీ తెలివితేటలను, జ్ఞానాన్ని ఉపయోగించండి. నిష్ఠుర సత్యాల విషయంలో సంయమనాన్ని పాటించండి. మీరూ, మీ ప్రియతములు కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.అవివాహితులకు వివాహసూచన ఉంది. సవాళ్లు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ధ్యానం ద్వారా సత్పలితాలను పొందవచ్చు. కలిసొచ్చే రంగు: పింక్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మన ఆలోచనలే మనం. మనం దేని గురించయితే తీవ్రంగా ఆలోచిస్తామో, చివరికి దానిని పొంది తీరుతాం అంటాడు బుద్ధభగవానుడు. అంటే ఎప్పుడూ ఏదో జరుగుతుందన్న నెగటివ్ ఆలోచనలు బుర్రలోకి రానివ్వకుండా సానుకూల ఆలోచనలతో ఉంటే అంతా మంచే జరుగుతుందని గ్రహించాలన్నమాట. ఒక కొత్త వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి ద్వారా లాభాన్ని పొందుతారు లేదా గతంలో పెట్టిన మదుపు నుంచి వడ్డీ లభిస్తుంది. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఉల్లాసకరమైన సమయం.అనూహ్యమైన అభివృద్ది... అదీ అతివేగంగా జరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి ఏదైనా వినోద, విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. మీరు ఏమి చేసినా, దానిని ఇతరులు కూడా అనుసరించేలా ఉంటుందీవారం. ఒక స్నేహితుని విషయంలో ఉదారంగా వ్యవహరించి, పెద్దమొత్తంలో డబ్బు సాయం చేస్తారు. ప్రేమ వ్యవహారం అకస్మాత్తుగా మొదలవుతుంది. అంతే వేగంగా ముగిసిపోతంంది కూడా! కలిసొచ్చే రంగు: అల్లం రంగు క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఈ వారం మీకు వినోదాత్మకంగా గడుస్తుంది. విందులు, వేడుకలు జరుగుతాయి. ఒక పార్టీకి ఆహ్వానం అందుతుంది. ఆఫీసులో ఒక పనివిషయంలో విభిన్నంగా వ్యవహరించడం వల్ల కొన్ని తీవ్రపరిణామాలను చవి చూడవలసి రావచ్చు. లాభాలు, ఆదాయాల గురించి కంగారు పడవద్దు. మెల్లగా అందుతాయి. రొమాన్స్ విషయంలో కొత్త పంథాను అనుసరిస్తారు. ఉల్లాసం, ఉత్సుకత పరవళ్లు తొక్కుతుంటాయి. కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) వ్యాపారం నుంచి మంచి లాభాలు అందుకుంటారు. కెరియర్ గురించి మీరు బంగారు కలలెన్నో కంటుండవచ్చు అయితే వాటిని కనీసం కుటుంబ సభ్యులతో కూడా పంచుకోకపోతే ఎలా? మీ ఆలోచనలను వారితో చెబితే వారు కూడా మీకు సాయం చేస్తారు కదా! మీ చిరకాల కోరిక ఒకటి ఈవారం తీరుతుంది. ఇద్దరు పరిణత వయస్కుల మధ్య కొంత కాలంగా సాగుతున్న బంధం ఒకటి దృఢపడుతుంది. కలిసొచ్చే రంగు: మెరుస్తున్న గోధుమ రంగు పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) పనికి సంబంధించిన సమాచారం లేదా సందేశం అందుతుంది. తేలికగా అయిపోతాయనుకున్న పనులకు కూడా ఎక్కువ శ్రమపడాల్సి రావడం, చిన్న పనికి కూడా పెద్ద ఎత్తున ఆలోచనలు చేయాల్సి రావడం వంటివి ఉండవచ్చు. అయినా కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వవద్దు. మనసును దృఢం చేసుకోండి. అప్పుడప్పుడు ప్రకృతిలో గడుపుతూ ఉండండి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. కలలు నెరవేరతాయి. కలిసొచ్చే రంగు: బేబీ పింక్ టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) చేస్తున్న ప్రతిపనిలోనూ ఉదాశీనతా భావం కలగవచ్చు. యంత్రనిర్మాణం, యంత్రపరికరాలతో చేసే వ్యాపారం వంటిది మీ వృత్తి అయినా, వాహనాలకి సంబంధించిన వ్యాపారమే అయినా కొద్దిగా శ్రద్ధని పాటించవలసిన వారం ఇది. శారీరకమైన ప్రమాదాలు జరక్కుండా భద్రతని గురించిన కొద్ది శ్రద్ధని వహించాలి. వాహనాలు నడపడంలో కూడా జాగ్రత్త అవసరం. ఇది ముందుజాగ్రత్త మంచినదే ఆప్తవాక్యమే. టారస్(ఏప్రిల్ 21-మే 20) శారీరకంగా మీరెంత పనిని చేయడానికైనా వెనుకాడరు. పైగా ఆ పనిలో విజయాన్ని సాధించాననే ఆనందంతో ఉండే మనస్తత్వం కూడా మీది. అయితే శారీరక శ్రమకి తట్టుకోగలిగినంత శక్తి మీకు మీ మనసులో లేని కారణంగా మానసికమైన ఒత్తిడికి గురై శ్రమపడతారు. ముఖ్యంగా మీ గొప్పదనాన్ని గుర్తించలేని, పైగా తప్పుబట్టాలనే ఈర్ష్యాదృష్టితో ఉన్న అధికారుల కారణంగా అలసటకి గురవుతారు. నిరుత్సాహ పడచ్చు. జెమిని (మే 21-జూన్ 21) ఎంతో ధనవంతులమనే అభిప్రాయంతో ఉన్న మీరు ఈ వారంలో మీ ఆదాయం వ్యయం నిల్వ గురించిన పరిశీలనని మీకు మీరే కావాలని చేసుకోవచ్చు. దాంతో కొంత అసంతృప్తికి గురవుతారు. మరింత సంపాదించాలనే అభిప్రాయానికి వస్తారు. విందువిలాసాలనీ, వ్యర్థవ్యయాలనీ ఆడంబరాలనీ దూరం చేసుకోవాలని నిర్ణయిస్తారు. ఒక మంచి అనుభవజ్ఞుణ్ణి మార్గదర్శకుడిగా ఎంచుకుంటారు. క్యాన్సర్ (జూన్22-జూలై 23) కొత్తవైన ఆస్తులని కొనాలనే బలమైన ఉద్దేశ్యంతో మీ కుటుంబ సభ్యులని రుణం అడుగుతారు. చేసేది మంచిపనే అయినప్పటికీ, సామూహికంగా మీరు కొన్న భూముల్నీ ఇళ్లనీ... అన్ని ఆస్తులనీ అప్పు, వడ్డీ మొత్తం .. ఇలా వివరాలని అద్దంలో చూసుకుంటున్న తీరుగా కుటుంబ సభ్యులందరినీ సమావేశపరచి మరీ చెప్పండి. దాంతో ఇప్పటివరకూ దాగి ఉన్న అపోహలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీకు మంచిది కూడా. లియో (జూలై 24-ఆగస్టు 23) స్పష్టమైన అవగాహనతో చెప్పదలచిన అంశాన్ని సూటిగా చెప్పగల మీరు లౌక్యంగానూ డొంక తిరుగుడుగానూ వ్యవహారాన్ని చేసే అవకాశం కనిపిస్తోంది. ఇది మీ స్వభావానికే విరుద్ధం కాబట్టి నిర్భయంగా, నిర్మొహమాటంగా ప్రవర్తించండి. ఆది నిష్ఠురం ఎప్పుడూ మంచిది తప్ప చివరికొచ్చాక మీ వ్యవహార భాగస్వాములతో అంత్యనిష్ఠురం ఏమాత్రమూ సరైన పద్ధతీ కాదు ఉపద్రవమయం కూడా. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ వ్యవహార ప్రణాళిక ముందునుండీ సరైన తీరులో ఉన్న కారణంగానూ దైవానుకూల్యం కారణంగానూ మీ పనులన్నీ అనుకున్నవి అనుకున్నట్లే పూర్తవుతాయి. స్వదేశీయులు విశేశానికి వెళ్లాలనే బలమైన ఆలోచనతో ఉన్నా కూడా విదేశాలకి వెళ్లలేరు. ఇదొక విధంగా మీకు అనుకూలమే తాత్కాలికంగా. ఉన్నంతోనే సర్దుకుని మనస్సంతోషంగా ఉండాలనే ధోరణి ప్రవేశించబోతోంది తొందరలోనే. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఆలోచన ఒక తీరుగా, ఆచరణ మరొక తీరుగా- భయం ఒక దిశగా, ధైర్యం మరొక దిశగా- ఆశ ఒక పక్కగా, నిరాశ మరొక పక్కగా సాగుతూ ఔను- కాదు, జరుగుతుంది- జరగదు అనే ఈవిధమైన రెండుతీరుల భిన్న భిన్న దృక్పథాలతో జరుగుతుంది ఈవారం. నష్టం అవమానం గర్వభంగం... వంటివేమీ ఉండనే ఉండవు కానీ ఈ అన్నీ జరిగినంత ఆందోళన మాత్రం మనసుకి కలగవచ్చు జ్యోతిషం ప్రకారం. ఇప్పటికైనా ప్రతీకార బుద్ధిని మానాలి. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ప్రభుత్వం నుండి రావలసిన అనుమతులుగానీ, ఆజ్ఞలుగానీ సకాలంలో అందుతాయి. వారి సహకారం తప్పక లభిస్తుంది. మీ కుటుంబానికి- ముఖ్యంగా దాంపత్యానికి సంబంధించిన వ్యవహారం ఎటూ తేలకుండా అలాగే ఉంటుంది. న్యాయస్థానం మధ్యవర్తి రాయబారం పూజాపురస్కారాలూ... ఇవన్నీ ఆకాశానికి గురిపెట్టి కొట్టిన బాణాల్లా నిష్ర్పయోజనాలే కావచ్చు ఈ వారంలో మాత్రం. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) అనుకోకుండా ఓ శుభకార్యం కలిసి రావచ్చు. ఆ కారణంగా ఇంటినిండుగా బంధువులూ మిత్రులూ పోగుపడొచ్చు. మీ వ్యవహారశైలీ ధర్మబద్ధ విధంగా మాట్లాడే మీ తీరూ కారణంగా మీ నిజాయితీతనం గుర్తింపబడి సక్రమంగా ముగుస్తాయి పనులన్నీ. కొత్త వ్యాపారపు ఆలోచన వద్దు. ఉద్యోగిగా ఉ ండడానికే ప్రాధాన్యమీయండి. విజయం నా సొంతమనుకుంటూ అహకరించకండి. క్యాప్రికార్న్(డిసెంబర్ 22-జనవరి 20) ఖర్చులో ఖర్చు అనుకుంటూ పుణ్యక్షేత్రాలకి ప్రయాణం కడతారు. ఉన్నంతలో ధ ర్మకార్యాలనుకుంటూ దానాలనీ ధర్మాలనీ చేస్తారు. పనిలో పని అన్నట్లుగా ఆ చుట్టుపక్కల ఉన్న బంధువుల ఇళ్ల తలుపు తడతారు. మాటలో మాట కలుపుదామనుకుంటూ నూతన వ్యాపార ఆలోచనని తెలియజేస్తారు పదిమంది మధ్యలో. దాంతో మీ నూతన వ్యాపారపు గుట్టు బయట పడే అవకాశం వస్తుంది. కొద్ది జాగ్రత్తగా వ్యవహరించండి. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) కష్టపడీ పడీ ఉద్యోగం కోసం ఎదురు చూసిన మీకు తొందర్లోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. నిచ్చెన ఎక్కేటప్పుడు మొదటి మెట్టు మీదనే కాలు పెట్టి ఎక్కాలన్నట్టు జీతం తక్కువ అనే ఆలోచన మాని చేరడం ఎంతైనా మంచిది మీకు. సంతాన లాభం ఉంది. చదువుతున్న సంతానానికి తగినంత ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఉత్తమ విద్యావంతుల్ని చేయగలుగుతారు. పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) ఎందుకో తెలియదుగానీ మనుష్యుల వల్ల కాకుండా పెంపుడు జంతువుల కారణంగానో పక్షుల కారణంగానో కొంత ఇబ్బంది పడే సూచనలు కన్పిస్తున్నాయి- తగుజాగ్రత్తలతో ఉండడం మంచిది కదా! మీ కుటంబంలోనికి చుట్టపు చూపుగా వచ్చిన బంధువు కారణంగా మనఃస్పర్ధ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవసరమైన మేరకే ఉండండి. మరీ ఎక్కువా తక్కువా వద్దు. డా" మైలవరపు శ్రీనివాసరావు -
మే 16 నుంచి మే 22 వరకు
టారో బాణి ఏర్పరచుకున్న లక్ష్యాలను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటారు. బాధ్యతాయుతంగా పనిచేయడం అనేది పనిలో మీ విజయసూత్రంగా పనిచేస్తుంది. ప్రేమవ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అయితే ప్రేమలో నిజాయితీగా ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోండి. కలిసి వచ్చే రంగు: రూబీ రెడ్ కొత్త సవాళ్లు ఎదురవుతాయి. మొదట కాస్త ఇబ్బంది పడినా... చివరకు వాటిని చేధించడంలో విజయం సాధిస్తారు. కాస్త ఒత్తిడికి గురవుతారు. అభివృద్ధి నెమ్మదిగా సాగుతుంది. ప్రేమిస్తోన్న వ్యక్తికీ మీకూ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సమయం పట్టవచ్చు. కలిసి వచ్చే రంగు: నీలం గత విషయాలను తలచుకోవడం వల్ల వేదనకు గురవుతారు. అయితే మీలోని అంతర్గత శక్తి, నిపుణుల సలహాల వల్ల ఉత్తేజం పొందుతారు. కొత్త శక్తిని పుంజుకుంటారు. మీకు ఉన్న పరిమితులను గుర్తించండి. ఏది ముఖ్యమో చూసుకోండి. ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా ఇతరులతో మీ సంబంధాలను మెరుగు పరుచుకోవచ్చు. కలిసొచ్చే రంగు: ముదురు ఆకుపచ్చ ఆత్మీయ అనుబంధాలు మీ జీవితంలో ముఖ్యమైన భాగం అవుతాయి. ప్రేమానందాల ఇంద్రధనుస్సు వెల్లివిరుస్తుంది. చేస్తున్న పనిలో విజయం సిద్దిస్తుంది. మీ ప్రణాళికల్ని కొన్ని సందర్భాల్లో మార్చుకోవాల్సి రావచ్చు. కొన్ని పనుల్లో కొన్ని మార్పులు అవసరమవుతాయి. ఆ మార్పులను వేగవంతం చేస్తారు. కలిసి వచ్చే రంగు: బ్రౌన్ వ్యాపారానికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు దూసుకు పోతారు. బిజీగా గడుపుతారు. బిజినెస్ ట్రిప్‌లు చేస్తారు. కాస్త రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేస్తే మీరనుకున్న పనులు సాధించగలరు. కలిసివచ్చే రంగు: నీలం ఎన్నాళ్లుగానో మీలో ఉన్న ఓ కోరిక నెరవేరుతుంది. ఈ వారమంతా ఆహ్లాదంగా గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. పనికి సంబంధించిన కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. చేస్తున్న పనిలో ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్లు ఎదురవుతుంటాయి. మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతికందుతాయి. కలిసివచ్చే రంగు: ఆరెంజ్ మీలోని సహజసిద్ధమైన ప్రతిభను మెరుగుపర్చుకుంటారు. ఆర్థికభారం పెరుగుతుంది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం వల్ల కాస్త ఉపశమనం పొందుతారు. కొన్ని పరిస్థితుల వల్ల మీ పనికి ఆటంకాలు ఏర్పడతాయి. సంయమనం పాటించడం ద్వారా సరియైన దారిని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. లక్ష్యసిద్ధి చేకూరుతుంది. కలిసివచ్చే రంగు: పీచ్ ఈ వారమంతా సంతోషంగా గడుపుతారు. మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. ఆచి తూచి నిర్ణయం తీసుకోండి. పాత బకాయిలను క్లియర్ చేసుకుంటారు. ఖరీదైన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. మీ మీద మీకు ఉండే నమ్మకమే మీ విజయసూత్రంగా పనిచేస్తుంది. ఇతరులకు సహాయ పడటం ద్వారా మీకు మేలుకలుగుతుంది. కలిసివచ్చే రంగు: గులాబి వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిలో నుంచి అత్యత్తమమైన ఆలోచనను ఎంచుకుంటే లాభం చేకూరుతుంది. కొత్తగా శక్తి పుంజుకోవడానికి, ఉత్తేజితం కావడానికి ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఎదురుకావచ్చు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కలిసివచ్చే రంగు: ఇటుకరాయి రంగు. ప్రతి పనినీ ఉత్సాహంగా చేసుకుంటూ పోతారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇతరులతో పోటీ పడతారు. అన్నింటా మెరుగైన ప్రతిభను కనబరుస్తారు. ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే వాటిని అమలుచేయడానికి ఇది కలిసొచ్చే వారం. కాబట్టి ఏమాత్రం సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. కలిసివచ్చే రంగు: పీచ్ ఇది మీకు కలిసొచ్చే సమయం. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. చేయాలనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలకు ఈవారం బాగా కలిసొస్తుంది. పనికి సంబంధించిన అవకాశాలు వెల్లువెత్తుతాయి. కలిసివచ్చే రంగు: కాఫీ బ్రౌన్ ప్రయాణాలు చేస్తారు. కొత్త కోర్సు చేయడమో, కొత్త పని ప్రారంభించడమో చేస్తారు. అన్ని విషయాల్లోనూ కొత్తదనానికి ప్రయత్నిస్తారు. జ్ఞానాన్ని పెంచుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. పనికి సంబంధించి మీ పరిధిని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ ప్రతిభ మిమ్మల్ని మరింత పాపులర్ చేస్తుంది. కలిసొచ్చే రంగు: లేత గోధుమరంగు విద్యార్థులకి అనుకూల కాలం ఇది. ఉద్యోగస్థులు పై పదవులకి ఆశించదగిన కాలం కూడా ఇది. కలిసొచ్చే ప్రయాణ సూచనలున్నాయి. అయితే, శనిదోషం ఉన్న కారణంగా ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టమైన అవగాహన లేకుండా దిగడం అంచనాలని తలకిందులు చేస్తుంది. నీలి రంగు దుస్తుల్ని వారంలో ఒకరోజైనా ధరించండి. కలిసి వచ్చే రోజు 16వ తేదీ అంటే నేడే. ఎవరికో సానుభూతి మీద సహాయాన్ని చేయదలిచి ‘అతి’కి పోయే పరిస్థితి కన్పిస్తోంది. అది సరికాదు. ముఖ్యంగా స్త్రీ విషయంలో మరింత ప్రమాదమని గ్రహించాలి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నించాలి. ఆవేశంలో మాట్లాడే మీ మాటలు వక్రీకరింపబడి మరీ వెళ్లే అవకాశముంది కాబట్టి మాటని అదుపు చేసుకోండి. తెల్లని దుస్తుల్ని వారంలో ఒకరోజైనా ధరించండి. బుధవారం అనుకూలంగా ఉంది. మీకు మీరు చక్కని జీవిత పాఠాన్ని నేర్చుకునే వారం ఇది. ఒకప్పుడు చేసిన వాగ్దానం మిమ్మల్ని ఇబ్బందిలో పడేయవచ్చు. ఏ మాత్రమూ వెనుకాడకుండా ‘అది సాధ్యపడ’దనే విషయాన్ని నిజాయితీగా అంగీకరించండి. ఉద్యోగంలో సరదాతనం, అశ్రద్ధ వద్దే వద్దు. తగినంతగా ఉండండి - ఇతరుల్ని ఉంచండి. బుధవారం మంచిది. తెలుపు దుస్తులు వారానికి రెండు రోజులు (2/7) ధరించాలి. ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తారో అంత పిరికితనంతోనూ వెనక్కి రావచ్చు. వివాదాలకి దూరంగా ఉండండి. మనశ్శాంతి లభిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోనని తెగేసి చెప్పండి. సంతోషకరమైన వార్తలు వింటారు. స్థిరాస్తుల వివాదాలలో, స్థిరాస్తిని సాధించే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. వారంలో మూడురోజులపాటు నలుపు, నీలం కలిసిన దుస్తులు ధరించటం శ్రేష్ఠం. శనివారం అనుకూలం. వ్యవసాయ, వ్యాపార రంగాల వారికి ఎలా పెట్టుబడులు పెట్టాలో స్వయంగా కాలం చెప్పిన పాఠాలని ఒంటబట్టించుకునే వారం ఇది. ధైర్యంగా ముందుకి సాగండి. నిశ్చితార్థాలు, వివాహాలు వంటివి జరిగే అవకాశముంది. మీరు చేసిన ఒకప్పటి తప్పుల్ని తిరిగి చేయకండి. చేతిలో ఉన్న ధనాన్ని ఖర్చు చేయకండి. తెల్లని వస్త్రాలు ఈ వారంలో ఒకసారయినా ధరించడం మంచిది. గురువారం అనుకూలం. ఎప్పటికి సరిపోయిన ఆలోచనని అప్పుడు చేసేసి ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. శాశ్వత ప్రణాళికని మీ భార్య/ భర్తతో సంప్రదించి వేసుకోండి. సంసారంలోనికి మూడో వ్యక్తి చేరకుంటే ముక్తి - చేరితే విరక్తి అని గ్రహించి మీ ఉభయులే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీ కంటే రెండు లేదా మూడు రెట్ల వయసువారి అనుభవాల్ని తీసుకుంటూ ఉండండి. ఎరుపు రంగు దుస్తులు (2/7) వాడండి. సోమవారం అనుకూలం. మీ పట్టుదల తాత్కాలికంగా మంచిని కలిగించవచ్చు. కాని అది శ్రుతి మించిన పక్షంలో వ్యతిరేక ఫలితాన్నిస్తుందని గమనించి, అడుగుని కొద్దిగా సడలించండి. తెలివిగా వ్యవహరించండి. కుటుంబ విషయాల్లో న్యాయస్థానపు తలుపుని తట్టవద్దు. ఇప్పటికే వెళ్లి ఉన్నట్లయితే, రాజీ మార్గాన్ని అన్వేషించండి. సంతానపు చదువు విషయంలో శ్రద్ధ పెట్టండి. ఎరుపు రంగు దుస్తులు (1/7) ధరించండి. శుక్రవారం అనుకూలం. చక్కని తెగింపు మీకు లభించినందుకు సంతోషించండి. మీ సమత్వ స్థితి మీకు సత్ఫలితాన్నే ఇస్తుంది. ద్రోహం చేయాలనే ఆలోచన లేని మీకు అంతా మంచే జరుగుతుంది. పై అధికారులు చెప్పింది చెయ్యండి తప్ప సూచనలనీ సలహాలనీ ఇయ్యాలని ప్రయత్నించ వద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇది మీకు మంచి వారం. కలగలుపు రంగు దుస్తులు వాడండి. మంగళవారం తప్ప అన్ని రోజులూ అనుకూలమే. తేలికగా అయిపోయే పని చిక్కుముడులు పడి పడి శ్రమ మీద విజయవంతమౌతుంది. కొత్త ఉద్యోగం లభించవచ్చు కాని, ఆలోచించి మాత్రమే అంగీకారాన్ని తెలపండి. భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు ఈ వారంలో తొలగిపోకపోవచ్చు. నా భార్య/ నా భర్త అనుకుంటూ అభిమానాన్ని విడిచి మీరే పలకరించడానికి ప్రయత్నించండి. దుస్తుల్లో ప్రత్యేక నియమం లేదు. శుక్రవారం మంచిది. చేస్తున్న వ్యాపారం/ ఉద్యోగం/ వృత్తి ఏమంత ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. స్థలం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మార్చవద్దు ఈ వారంలో. దానంతటదే కాలానుగుణంగా ఓ నిర్ణయం దైవం ద్వారా వస్తుంది. దాన్నే ‘అ-దృష్ట’మంటారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం/ వివాహం/ సంతానం కలిగే అవకాశముంది. పక్కవారి మాటల ద్వారా రెచ్చిపోకండి. నీలిరంగు దుస్తులు (1/7) వాడండి. గురువారం అనుకూలం. ఉద్యోగమనేది కుటుంబ పోషణ కోసమనుకోండి తప్ప, ఉద్యోగమే కుటుంబమనుకోకండి. అకాలనిద్ర, అకాలభోజనం, దూర ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగపు మార్పు, ఇంటి మార్పు, వద్దే వద్దు.‘ప్రతికూలత తీవ్రంగా ఉన్నా పైచేయి నాదే కదా’ అని అనుకోకండి. అంత ప్రతికూలత ఎందుకుండాలి? అని ఆత్మపరీక్ష చేసుకోవలసిన వారం ఇదని గమనించండి. అన్ని రంగుల దుస్తులూ మంచివే. అన్ని రోజులూ అనుకూలమే. తగిన సమయానికి రుణం లభిస్తుంది. సరైన సమయంలో మీ కోరిక నెరవేరుతుంది. ఆందోళన వద్దు. దాంపత్యం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలు రావచ్చు. శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. దానాలు, ధర్మాలు, దైవ పూజలు, తీర్థయాత్రలకి ఒక హద్దుండాలని గమనించండి. పసుపు రంగు దుస్తులు (2/7) శ్రేష్ఠం. ఆదివారం అనుకూలం. ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
మే 23 నుంచి మే 29 వరకు
టారో బాణి మెరుగైన విజయాలు సాధించడానికి ఇది సరైన సమయం. పనులు పూర్తి చేయడంలో గతంలో కంటే ఉత్సాహంగా ఉంటారు. ఒక వ్యక్తి నుంచి సహాయం లభిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో, వాటిని కాపాడుకునే విషయంలో ఒకింత ఒత్తిడికి గురవుతారు. చిన్నపనుల కోసం అధిక శ్రమ అక్కర్లేదు. కలిసి వచ్చే రంగు: ఎమరాల్డ్ గ్రీన్ అనుకోకుండా ఎదురయ్యే ఒక సంఘటన మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు మించిన లాభాలు అందుకుంటారు. ప్రతి సమస్యను పరిష్కరించుకుంటారు. అందరికీ మీ పనితనం తెలిసేలా చేస్తారు. ప్రేమ వ్యవహారాలు మంచి మలుపు తిరుగుతాయి. కలిసి వచ్చే రంగు: ఊదా రంగు విజయానందాలు మీ సొంతమయ్యే కాలం. ఆశావహదృక్పథంతో వ్యవహరిస్తారు. ఆర్థిక అంశాలకు సంబంధించి మీకు బాగా ఆనందం కలిగించే వార్త ఒకటి తెలుస్తుంది. ప్రతి విషయానికీ పలు ఆప్షన్లు మీ ముందు కనిపిస్తాయి. ఎంపిక విషయంలో కన్ఫ్యూజ్ అవకుండా ఆచితూచి అడుగేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కలిసి వచ్చే రంగు: లేత నీలం కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ‘విభిన్నమైన ప్రపంచంలో ఉన్నాను’ అనే భావనకు గురవుతారు. మీ జ్ఞానం, వైవిధ్యభరిత ఆలోచనల వల్ల మంచి అవకాశాలు అందుకుంటారు. సహచరులతో వాదనకు దిగే పరిస్థితి రావచ్చు. అయితే ఆ వాదనను వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఔట్‌డోర్ స్పోర్ట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: సిల్వర్ కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. ముఖ్యమైన డాక్యుమెంట్లపై సంతకాలు జరుగుతాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ప్రేమ విషయాలు కొంత ఇబ్బంది పెడతాయి. బంధుమిత్రులతో అపార్థాలను తొలగించుకోవడం మంచిది. గొంతుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. కలిసివచ్చే రంగు: ఆరెంజ్ అనుకోని అవకాశాలు మీ దరికి వస్తాయి. మీ కలలు నిజమవుతాయి. ఒక వ్యక్తి మిమ్మల్ని ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ‘రిస్క్’ అనుకొని వెనకడుగు వేయడానికి ప్రయత్నించిన పనులు సైతం అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. మీరు బాగా ప్రేమించే ఒక వ్యక్తిని కలుసుకుంటారు. కలిసి వచ్చే రంగు: లేత గోధుమ మీ కమ్యునికేషన్ స్కిల్స్ మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. పనిలో ప్రతిభ చూపి ప్రశంసలు అందుకుంటారు. సమావేశాల్లో మీ ప్రతిభ గురించి అందరూ మాట్లాడుకుంటారు. వెన్నునొప్పి, మైగ్రెయిన్స్ లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కలిసివచ్చే రంగు: గులాబి అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే మీకున్న ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యలను పరిష్కరించుకుంటారు. పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాదు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏవైనా కళల మీద మనసు పెట్టండి. తద్వారా సంతోషంగా ఉంటారు. వీలైనంత వరకూ ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు: గ్రే ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. కొత్త బంధాలు సంతోషాన్ని ఇస్తాయి. అంతరాత్మ చెప్పినదాని ప్రకారం నడుచుకోండి. పనికి సంబంధించి కొత్త అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. బయటి వాతావరణం శరీరానికి సరిపడకపోవచ్చు. కలిసి వచ్చే రంగు: బ్రైట్ గ్రీన్ మీ మనసుకు దగ్గరయ్యే వ్యక్తిని ఇప్పటి వరకు మీరు కనుక్కోలేకపోతే, ఆ వ్యక్తిని ఎంచుకోవడానికి తగిన సమయం. మీలోని సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించే సమయం కూడా. గాసిప్లను పట్టించుకోకుండా ఉండడం మంచిది. ఒకవేళ వాటికి ప్రాధాన్యత ఇస్తే, మీ పనికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కలిసివచ్చే రంగు: ఆరెంజ్ మీ చుట్టూ ప్రేమ పూరితమైన వాతావరణం కనిపిస్తుంది. జీవితం, ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఆత్మశోధన చేసుకుంటారు. మీ నిర్వహణా సామర్థ్యానికి మించి పనిలో మీకు కొత్త బాధత్యలు వచ్చి పడతాయి. కొన్నిరోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కలిసి వచ్చే రంగు: బ్రౌన్ ఈ వారమంతా సరదా మూడ్‌లో ఉంటారు. ఉల్లాసంగా గడుపుతారు. ఒక తోడు కోసం అన్వేషించేవారికి ఇది తగిన సమయం. పరిస్థితుల మార్పు గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. అయితే బ్యాక్‌పెయిన్ బాధించవచ్చు. అన్ని విషయాల్లోనూ మీ అంతరంగం చెప్పేదాన్ని వినడం ఉత్తమం. కలిసి వచ్చే రంగు: లేత నీలం ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఆర్థికంగా బాగా ఉన్నామని ఖర్చుల్ని పెంచుకోకండి. శారీరకంగా బాగున్నామనే ఆలోచనతో ఆహార విహారాదుల్లో పరిమితిని దాటకండి. ఉద్యోగపరంగా ప్రోత్సాహకరంగానే ఉంది కదా అని కింది ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ అలాగే సహోద్యోగులతోనూ వివాదం తెచ్చుకోవద్దు. వారంలో ఒక్కరోజైనా గోవులకి పచ్చగడ్డిని పెట్టించండి. ఇంటికొచ్చిన మూడోవ్యక్తి కారణంగా కుటుంబంలో అనైకమత్యం తలెత్తవచ్చు. వ్యాపారంలో భాగస్వాములతో కొద్దిగా వాదవివాదాలు వృత్తి ఉద్యోగాల్లో మనఃస్పర్థలు తలెత్తవచ్చు. ఇలాంటి సంఘటనలు రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే ముందు జాగ్రత్తతో ఉండటం మంచిది. వారంలో రెండు రోజుల పాటైనా గోవులకి చక్కని పండ్లని ఇప్పించండి. ప్రతి పనీ వాయిదా పడుతూ, భార్యాభర్తలు ఐకమత్యంతో లేకుండా, కుటుంబ రహస్యాలు పక్కవారికీ బంధువులకీ చేరుతూ ఈ వారమంతా నిర్వేదంతో నిరాసక్తతతో ఉండవచ్చు. ఇది తాత్కాలిక ఘర్షణం మాత్రమే. ఉద్యోగపు మార్పు స్థానచలనం, అద్దెఇంటి మార్పు వస్తే తప్పక మారండి. గోవులకి ఇష్టమైన కుడితిని గోశాలకి వెళ్లి పెట్టించండి. కాలం నేర్పిన అనుభవం దృష్ట్యా వేటికి దూరంగా ఉండాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు బాగా అర్థమైన కారణంగా అలాగే ప్రయాణించండి. ఎంతటి దగ్గరవారొచ్చి అడిగినా హామీలనీ వాగ్దానాలనీ రుణాలనీ పూర్తిగా మానండి. మీకు కలిగిన సంతోషాన్ని కూడ లోపలే దాచుకోవలసిన వారం ఇది. గోవులకి ఆకుకూరల్ని పెట్టించండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన అన్నింటినీ సమకూర్చుకోండి. దూర ప్రయాణాలు చేయవలసివచ్చినా నష్టమపోతామేమోననే భయం వద్దు. దాన ధర్మాలతో పాటు, పిల్లలు చదువుల్ని అశ్రద్ధ చేయకుండా చేసుకుంటూ ఉండండి. ఒక్క ఆవుకైనా ఈగ/దోమ బాధ లేకుండా దోమతెరని అందించండి. భార్యాభర్తల ఐకమత్యానికున్న గట్టిదనం ముందు ఉక్కుసౌధాలు కూడ పెళుసే అనే విశేషాన్ని స్వయంగా గమనిస్తారు. సరైన సమయానికి భోజనం, నిద్ర అనేవాటిని చూసుకుంటూ అనారోగ్యం ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. మద్యం, జూదం వంటివాటిని మానే ప్రయత్నం ప్రారంభించండి. సంతాన అభివృద్ధి కోసం గోవులకి పచ్చికూరముక్కల్ని పెట్టించండి. మిమ్మల్నీ మీ జీవితాన్నీ గురించి వ్యక్తిగతంగా మీకు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. యంత్రాలూ వాహనాల విషయంలో తగినంత జాగ్రత్తతో వ్యవహరించండి. మీవైపు నుండే కాకుండా మీరు ఎవర్ని శత్రువులుగా చూస్తున్నారో వారివైపు నుండి ఆలోచించండి ఏకాంతంలో. అంతా సవ్యమౌతుంది. గోవులకి ఆరోగ్యకరమైన నీటిని వారం రోజులపాటు అందించండి. అందరూ మీ మాట కాఠిన్యానికి భయపడి గౌరవిస్తున్నారేమో గమనించుకోండి. నిదానమైన మాట పదిమందిని దగ్గరికి రానిస్తుందని గ్రహించండి. చిన్నపాటి వైద్యపరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. తీసుకున్న రుణం ఒకపక్క నిదానంగా ఖర్చు అయిపోతోందేమో (రుణం తీసుకున్న పనికి కాక) పరిశీలించుకోండి. గోవులకి తెలకపిండిని అందించండి. ఆశించిన ఉద్యోగం ఇదుగో! అంటూ దూరదూరం జరిగిపోతూండవచ్చు. మీ ఏకపక్ష నిర్ణయం కారణంగా బంధుమిత్రులు వ్యతిరేకులయ్యే ప్రమాదమూ ఉండవచ్చు. వివాహమయ్యాక కూడ తల్లిదండ్రులకీ అలాగే అన్నదమ్ముల మాటలకే ప్రాధాన్యాన్నిస్తున్నారేమో ఆత్మపరీక్ష చేసుకుని మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. గోవులకి వైద్యపరీక్షలు యథాశక్తి చేయించండి. రోజులు దొర్లిపోతున్నాయనే సంతృప్తితో వ్యాపారాన్ని విస్తరింపజేయడం లేదేమో గమనించుకోండి. మాట పట్టుదల కారణంగా పెద్దల్ని దూరం చేసుకున్నామేమో ఆలోచించి సాన్నిహిత్యం కోసం ప్రయత్నించండి. గోవులకి ఎండ బాధ లేకుండా ఉండే నూనెకి సొమ్ముని అందించండి. మీకు మీరుగా నిర్ణయాన్ని తీసుకోకుండా పై అధికారి సూచనలు ఆజ్ఞలనే పాటించండి. మీరు ఏ పొదుపు లేదా వ్యయం చేయదలచినా భార్య/భర్తకి ముందుగా తెలియజేయండి. వివాహం కొత్త ఇంటి కొనుగోలు స్థలం మొదలైనవాటి కొనుగోలు విషయంలో ఒకరికిద్దర్ని సంప్రదించి మరీ తీసుకోండి. గోవులకి మీకు తోచిన సేవ చేయండి. పిల్లల చదువుల కారణంగా తాత్కాలికమైన ఆర్థిక భారం కలుగుతుంది. రుణాన్ని చేయడం తప్పుకాదని గ్రహించండి. ఉద్యోగంలో వచ్చిన పదవీ ఉన్నతి కారణంగా బాధ్యతలు పెరిగి కొంత పని ఒత్తిడి, అసహనం పెరుగుతాయి. రోజూ ప్రాణాయామాన్ని క్రమం తప్పక చేయండి. గోవులకి ఎండుగడ్డిని యథాశక్తి అందించండి. - డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు