వారఫలాలు | Varafalalu in this week 11 nov 2018 | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Nov 11 2018 1:48 AM | Last Updated on Sun, Nov 11 2018 1:48 AM

Varafalalu in this week 11 nov 2018 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
మీ అంచనాలు, ఊహలు నిజం చేసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. రావలసిన బాకీలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నూతన ఉద్యోగయత్నాలలో సానుకూలం. వ్యాపారాలు అనుకూలించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు విజయవంతంగా ముగుస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయక స్తుతి మంచిది.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
అనుకున్న పనులు, వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి మందగించి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.  కుటుంబంలోనూ ఒత్తిడులు, బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురుకావచ్చు. కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం కావచ్చు. రాజకీయవర్గాలకు అంచనాలు తప్పుతాయి. వారం చివరిలో స్వల్ప ధనలబ్ధి. వాహనయోగం. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యస్తుతి మంచిది.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు ఏర్పడవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. భూవివాదాల పరిష్కారంపై దృష్టి పెడతారు. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి కృషి ఫలించకపోవచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. చర్చల్లో పురోగతి. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఉత్సాహంగా పనులు కొనసాగిస్తారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతారు. విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించి విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. గృహ, వాహనయోగాలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి ఆటంకాలు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో అనుకున్న ప్రమోషన్లు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. కుటుంబంలో చికాకులు, ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనుకున్న విధంగా పనులు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వాహనయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఇంటాబయటా ప్రశంసలు అధికమవుతాయి. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన రీతిలో పదవీయోగం. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. ఆకుపచ్చ, ఎరుపు రంగులు,  ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. కొత్త రుణాల కోసం యత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు సామాన్యస్థితి. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కొంత చికాకు పరుస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ముందుకు సాగక డీలా పడతారు. ఉద్యోగాలలో  ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలు అంతగా కనిపించవు. వారం చివరిలో విందువినోదాలు. వస్తులాభాలు. గులాబీ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక విషయాలు కాస్త నిరుత్సాహపరుస్తుంది. నిర్ణయాలలో కొంత నిదానం పాటించండి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం మందగిస్తుంది. కొన్ని విషయాలలో రాజీపడక తప్పదు. దూరప్రాంతాల నుంచి అందిన  సమాచారం ఊరటనిస్తుంది. ఆస్తుల వ్యవహారాలు గందరగోళంగా మారవచ్చు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. అనుకున్నంతగా డబ్బు అందక ఇబ్బందిపడతారు. పనులలో ప్రతిబంధకాలు. అనారోగ్య సూచనలు.  శ్రమ తప్పితే ఫలితం కనిపించదు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. కొన్ని వివాదాలపై కోర్టులకు హాజరుకావల్సి ఉంటుంది. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.  గృహ నిర్మాణాల్లో కొంత జాప్యం జరిగే అవకాశం. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు ఎదురవుతాయి.  ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.  సంఘంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. రావలసిన డబ్బు చేతికంది అవసరాలు తీరతాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. సన్నిహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నూతన విద్యావకాశాలు సైతం దక్కుతాయి. స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఆశించిన లాభాలతో ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. కళారంగం వారికి విశేష గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో కలహాలు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమకు ఫలితం కనిపించదు. బం«ధువులతో ఆస్తి వివాదాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రయత్నాలు నత్తనడకన  సాగుతాయి. మిత్రులతో  విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు తప్పకపోవచ్చు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు మధ్యస్థంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. విందువినోదాలు. లేత నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. అందరిలోనూ గౌరవంపెరుగుతుంది. ఆస్తుల వ్యవహారాలలో ఒక అంగీకారానికి వస్తారు. క్రీడాకారులకు శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్యసమస్య తీరుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఆశించిన లాభాలు రాగలవు. ఉద్యోగాలలో ఉన్నతహోదాలకు చేరుకుంటారు. రాజకీయవర్గాల నిరీక్షణ ఫలిస్తుంది. వారం మధ్యలో ఖర్చులు అధికం. సోదరులతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనూహ్యమైన రీతిలో వ్యవహారాలు చక్కదిద్దుతారు.ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందడుగు వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. విద్యావకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వాహనయోగం. ప్రముఖులతో  చర్చలు సఫలం. వ్యాపారాలు సజావుగా కొనసాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు చేపడతారు. కళారంగం వారికి పురస్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (11 నవంబర్‌ నుంచి  17 నవంబర్‌ 2018 వరకు )
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
అనూహ్యమైన అద్భుత సంఘటనలు జరుగుతాయి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో సంస్థాగత మార్గాల ద్వారా పురోగతి సాధిస్తారు. మీ విజయాలకు, పురోగతిలో వేగానికి ఇతరులు ఆశ్చర్యం చెందుతారు. ఆస్తుల వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కోరుకున్న కొత్త ఇంటిని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. పనికి కొంత విరామం ఇచ్చి విహారయాత్రలకు వెళతారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
శరవేగంగా మార్పులు సంభవిస్తాయి. వివాదాస్పద పరిస్థితుల నుంచి విజయవంతంగా బయటపడతారు. సమస్యలన్నీ వాటంతట అవే సద్దుమణుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు స్థిరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అతిథుల రాకతో ఇంటి వాతావరణం సందడిగా మారుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, సామాజిక సేవా కార్యక్రమాలకు విరాళాలను ఇస్తారు. ప్రేమికుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మందగించవచ్చు.
లక్కీ కలర్‌: మీగడ రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
స్వేచ్ఛను అనుభవిస్తారు. ఆత్మావలోకనం చేసుకుంటారు. ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రశాంతత పొందడానికి ప్రయత్నిస్తారు. మీ ధోరణి కొందరికి నచ్చకపోవచ్చు. అయినా మీరు మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా ఉండటమే మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరగవచ్చు. ఏకాంతాన్ని కోరుకుంటారు. సృజనాత్మక వ్యాసంగంపై దృష్టి సారిస్తారు. పెద్దలను కలుసుకుంటారు. అనుకోని మార్పులు సంభవించే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల కోసం సమయం కేటాయించలేకపోతారు. దేవాలయాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
వృత్తి ఉద్యోగాల్లో పనులు వేగం పుంజుకుంటాయి. నిలిచిపోయిన ప్రణాళికలను ఆచరణలో పెడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వారాంతంలో సన్నిహితులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో డబ్బు మదుపు చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ప్రేమికులు ఉల్లాసంగా ఉత్సాహంగా కలల్లో తేలిపోతారు. గురువులను సందర్శించుకుంటారు. కీలక విషయాలలో పెద్దల సలహాలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుతారు.
లక్కీ కలర్‌: ముదురు గోధుమ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
సంమయనం పాటించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో వివాదాలకు దూరంగా ఉండటం క్షేమం. అసూయాపరుల కారణంగా సమస్యలు తలెత్తవచ్చు. ధ్యానం ద్వారా ప్రశాంతత పొందగలరు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. వేళకు భోజనం చేసే తీరిక దొరకడం కూడా కష్టమయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. పిల్లల పురోగతి కొంత సంతృప్తినిస్తుంది. పచ్చని పరిసరాల్లో విహరించాలనుకుంటారు. విహారయాత్రల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. గురువుల ఆశీస్సులు పొందుతారు.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
విందు వినోదాలతో ఉల్లాసభరితంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో బృందానికి నాయకత్వం వహిస్తారు. లక్ష్యాలను సాధించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారాల్లో ఊహించని లాభాలను అందుకుంటారు. సాధించిన విజయాలకు ప్రచారం లభిస్తుంది. అందాన్ని కాపాడుకోవడానికి సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఇంటిని కళాత్మకంగా తీర్చిదిద్దుకుంటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: లేతనీలం

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. సన్నిహిత మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. విహారయాత్రలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు.
లక్కీ కలర్‌: లేత పసుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు.
లక్కీ కలర్‌: నారింజ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి.
లక్కీ కలర్‌: బూడిద రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది.
లక్కీ కలర్‌: గులాబి

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
తలపెట్టని పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు.
లక్కీ కలర్‌: లేత ఊదా
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement