మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
బంధువుల నుంచి ఆసక్తికరమైన సమాచారం. అవసరాలకు డబ్బు అందుతుంది. కాంట్రాక్టర్లకు అనుకూలం. కొత్త పనులు చేపడతారు. ఉన్నత విద్యావకాశాలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
బంధువులతో సంతోషంగా గడుపుతారు. మీపై అపవాదులు తొలగుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కానుకలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. ఆర్థిక లాభాలు. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. నూతన పరిచయాలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పాతజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు కొత్త అవకాశాలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. అందరిలోనూ గౌరవం పొందుతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారవర్గాలకు ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగవర్గాలకు అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు నూతన పదవులు, సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త మిత్రులు పరిచయమవుతారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. పరపతి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. సోదరులతో ఆస్తి వ్యవహారాలపై చర్చలు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యవహారాలలో విజయం సా«ధిస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం, పదోన్నతులు దక్కవచ్చు. కళాకారులకు సన్మానయోగం, విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో కలహాలు. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
బం«ధువులు, స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. వస్త్ర, వస్తులాభాలు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. ఎరుపు, లేత గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
నూతన విద్య, ఉద్యోగవకాశాలు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్థలాలు, వాహనాలు కొంటారు. దూరపు బంధువుల కలయిక. కొత్త పనులు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమం లభిస్తుంది. కొన్ని పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కోర్టు కేసులు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. , ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. రాజకీయవేత్తలకు పదవులు దక్కే అవకాశం. వారం చివరిలో వివాదాలు. మిత్రులతో విభేదాలు. పసుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణాల నుంచి విముక్తి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. బంధువిరోధాలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వీరికి అన్నింటా విజయమే. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థుల యత్నాలు సఫలం. కొత్త విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆప్తుల ద్వారా ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు ఢోకా ఉండదు. ఉద్యోగవర్గాలకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నేరేడు, బంగారు రంగులు. పశ్చిమదిశప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిచండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు. ఇంటాబయటా ఒత్తిడులు. నలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బంది కలిగించినా అవసరాలకు లోటు ఉండదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. కాంట్రాక్టర్లకు శుభదాయకంగా ఉంటుంది. వివాహాది వేడుకలలో పాల్గొంటారు. భూవివాదాలు తీరతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. లాభాలు తథ్యం. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి శ్రమ ఫలిస్తుంది. సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువిరో«ధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు
టారో (2019 నూతన సంవత్సర ఫలాలు )
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
కొత్త సంవత్సరం మీకు అనేక సవాళ్లు విసురుతుంది. అయితే, కష్టపడి పని చేసే మీ స్వభావం, అంకిత భావం, నిబద్ధత అన్నింటినీ పటాపంచలు చేస్తూ ముందుకు దూసుకు వెళ్లేలా చేస్తాయి. ఈ సంవత్సర వ్యాపారంలో మీ యుక్తిని, పద్ధతిని కొంత మార్చుకోవలసిన అవసరం ఉంది. కొత్త ప్రాజెక్టు మిమ్మల్ని వరించి వస్తుంది. అయితే దీనిపై ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు. మీకున్న శక్తియుక్తులకు పదును పెట్టండి. విజయం సాధిస్తారు. కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. మీ కుటుంబంలోకి కొత్త సభ్యుల చేరికకు ఆస్కారముంది. మార్చి, జూన్, జులై అనుకూలమైన నెలలు. ఏప్రిల్, నవంబర్‌లలో బాగా కష్టపడ వలసి ఉంటుంది.
లక్కీ కలర్: బంగారు పసిమి వన్నె, లక్కీ నంబర్: 8
వృషభం (ఏప్రిల్ 20 – మే 20)
మీ పని ఒక్కోసారి మీకు హుషారు తెచ్చిపెట్టచ్చు. ఉత్సుకతను నింపవచ్చు లేదా మిమ్మల్ని స్థబ్దుగా చేయవచ్చు. అయితే, ఇవన్నీ కూడా మీ పనిలోని భాగాలే కాబట్టి పొంగిపోవద్దు, కుంగిపోవద్దు. పనికీ, కుటుంబానికీ కొద్దిపాటి విభజన పాటించండి లేకుంటే మీ పని మూసపోసినట్లుగా తయారు కావచ్చు. సరైన తిండి, విశ్రాంతి తీసుకోక పోవడం, మానసిక ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. దూరప్రయాణాలు మీకు పునరుత్తేజం కలిగిస్తాయి. సంవత్సరంలో తొలి ఐదు నెలలూ తీవ్రమైన ఒత్తిడితో, అవిశ్రాంతంగా పని చేయాల్సి రావచ్చు. ఆందోళన పడకండి. తక్కిన నెలలలో ప్రమోషన్లు, జీతం పెంపులు ఉంటాయి.
లక్కీ కలర్: ఎరుపు, లక్కీ నంబర్లు: 5, 32
మిథునం (మే 21 – జూన్ 20)
ఈ ఏడాది మంచి మంచి పరిణామాలన్నీ సంభవిస్తుంటాయి. మీ అభిరుచులన్నింటినీ జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. భావోద్వేగపరమైన నిర్ణయాలకు, ఎంపికలకు ఇది సమయం కాదు. పెద్దల సలహాలతోనే నిర్ణయాలు తీసుకోండి. గతంలో జరిగిన చేదు సంఘటనలను తలచుకుంటూ కూర్చోవడం వల్ల నేటి తీపి అంతా చచ్చిపోతుంది! మీ ప్రతిభకు మరింత పదును పెట్టుకుంటే మరిన్ని విజయావకాశాలు మీ ఖాతాలో ఉన్నట్లేని గుర్తుంచుకోండి. మే, సెప్టెంబర్ మాసాలు చాలా బాగుంటాయి. ఏప్రిల్, జులై, ఆగస్ట్ నెలల్లో కాసింత జాగ్రత్త తప్పదు.
లక్కీ కలర్: జాతిపచ్చ రంగు, లక్కీ నంబర్: 21
కర్కాటకం (జూన్ 21 – జూలై 22)
కొత్త ఏడాది మీకు ఆశావహ సంవత్సరం. చదువులో, ఉద్యోగంలో విజయావకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, నిస్సహాయంగా మిగిలే కొన్ని సంఘటనలు ఎదురు కావచ్చు. అయితేనేం, మీరేమీ బెంబేలు పడనక్కరలేదు. చంద్రగమనం మిమ్మల్ని వ్కాలానికి గురి చేస్తే, సూర్యగమనం మీలోని శక్తులను తట్టిలేపుతుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు చాలా బాగుంటుంది. మే, ఆగస్ట్ నెలలు కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం.
లక్కీ కలర్: పసుప్పచ్చ; లక్కీ నంబర్: 1
సింహం (జూలై 23 – ఆగస్ట్ 22)
మీరు ఉంటున్న ప్రదేశాన్ని మార్చుకోవలసిన సంవత్సరమిది. నూతన స్థలాన్ని లేదా ఇంటిని కొనుక్కునేందుకు అనుకూల తరుణమిది. బంధాలు గట్టిపడతాయి. అహాన్ని అణిచిపెట్టండి. అనవసరమైన ఆందోళనలని పక్కన పెట్టండి. అవకాశాలను చక్కగా సొమ్ము చేసుకుంటారు. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యానికి, ఒప్పందాలకు ఇది తగిన సమయం. విద్యార్థులకు చాలా బాగుంటుంది. జనవరి మీకు ఈ ఏడాదిలోనే మేలిమలుపులాంటిది. అదేవిధంగా జూన్, జులై, సెప్టెంబర్ మాసాలు కూడా మీకు అనుకూలంగా ఉండి, హుషారును, విజయాలని ఇస్తాయి.
లక్కీ కలర్: వంకాయరంగు; లక్కీ నంబర్: 2
కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22)
పనిపరంగా, ఆరోగ్యపరంగా మీరు బాగా దృష్టి పెట్టాల్సిన తరుణమిది. ఈ ఏడాది చాలా బాగుంటుంది. ముందడుగు వేసేముందు కాస్త వెనకాముందు చూడడం అవసరం. అలాగని వెనకాడవద్దు. మీరు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సంఘటనలు ఈ ఏడాది జరుగుతాయి. సంపద పరంగా సమృద్ధిగా ఉంటుంది. మీరు దృష్టి పెట్టిన కొద్దీ ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. జనవరి నెల అన్ని విధాలుగా చాలా బాగుంటుంది.
లక్కీ కలర్: ఇటికరాయి రంగు; లక్కీ నంబర్: 7
తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22)
మీరు చేస్తున్న వాటినే కొనసాగించడం అవసరం. ఇప్పటివరకు మీరు అనుభవిస్తున్న ఆనందం, పొందుతున్న ఆదాయం వంటివాటికి కొత్త సంవత్సరంలో కూడా లోటేమీ ఉండదు. ముందు ముందు మరిన్ని ఆనందాలు, ఆశ్చర్యాలు పొందుతారు. అయినప్పటికీ, మీరు నూతన మార్గాన్ని, నూతన పంథాను ఎన్నుకోక తప్పదు. ఆధ్యాత్మికంగానూ, ఆచితూచి తీసుకున్న నిర్ణయాలు బాగా కలిసొచ్చేలా చేస్తాయి. మీరు గొప్ప ఎత్తులు ఎదిగేందుకు ఈ సంవత్సరం చాలా దోహదం చేస్తుంది. ఏప్రిల్, మే, సెప్టెంబర్ నెలలు మీరు రూపాంతరం చెందేందుకు అనుకూలం. అక్టోబర్ తర్వాత మరింత ఆనందంగా ఉంటారు.
లక్కీ కలర్: లేతనీలం; లక్కీ నంబర్: 3
వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21)
స్థబ్దుగా సాగిపోతున్న మీ జీవితంలో కొత్త పరిచయాలు చోటు చేసుకుని, ఆనందమయం చేస్తాయి. మీరు కలల నుంచి బయటపడి వాస్తవంలోకి రావాలి. ప్రాక్టికల్‌గా ఉండాలి. కొత్త అవకాశాలు వచ్చే సంవత్సరమిది. కొత్తగా ఆలోచన చేయడం కొత్తదనానికి ఊతమిస్తుంది. ఉదాహరణకు ఒక గొప్ప కళాఖండాన్ని సృష్టించాలనుకుంటే, దానికి ఏ రంగులు వాడితే బాగుంటుందో ఆలోచించాలి. స్వార్థంతో ఆలోచించడం మీకు మంచిది కాదు. ఫిబ్రవరి, మే, జూన్, జులై నెలల్లో బాగా కష్టపడి పని చేస్తారు. సెప్టెంబర్‌లో అన్ని రకాల ఒత్తిడుల నుంచి బయటపడి మీకు నచ్చిన హాలిడే స్పాట్‌కు వెళ్లి హాయిగా సేద తీరుతారు.
లక్కీ కలర్: ఎరుపు, లక్కీ నంబర్:3
ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21)
మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఈ నూతన సంవత్సరం తగిన వేదిక. కొత్త సంవత్సరం మీరు సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని మీరు పట్టించుకోవలసిన తరుణమిది. ప్రేమజీవితం సాఫీగా, ఎటువంటి ఒడిదుడుకులూ లేకుండా హాయిగా సాగుతుంది. మీ కుటుంబంలో ఒకరికి వివాహం జరుగుతుంది. జూన్ నుంచి ఆర్థికంగా బలం పుంజుకుంటారు. విస్తృతంగా ప్రయాణాలు చేస్తారు. ప్రస్తుతం మీరు చేస్తున్న వ్యాపారానికి అదనంగా మరోటి జత చేస్తారు. ఏడాదిలో తొలి సగం చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతుంది.
లక్కీ కలర్: పర్పుల్, లక్కీ నంబర్: 9
మకరం (డిసెంబర్ 22 – జనవరి 19)
మీ కలలను, లక్ష్యాలను సాకారం చేసుకునే తరుణం ఇది. ఈ ఏడాది మీరు స్పష్టతతో ఉంటారు. సత్యమే పలుకుతారు. ప్రేమ విషయానికి వచ్చేసరికి మీరు మీ ప్రియుడు లేదా ప్రియురాలిని మార్చడానికి ప్రయత్నించే బదులు వారి బాటలో మీరే నడిస్తే మంచిదేమో ఆలోచించండి. మార్చి తర్వాత చాలా బిజీగా ఉంటారు. జులైలో షిఫ్ట్‌లు మారడం, అనూహ్యమైన మార్పులు రావడం జరగవచ్చు. అందుకు మీరేమీ కంగారు పడవద్దు. అది ఒక దశ అనుకుని మీ పని మీరు చేసుకుపొండి చాలు.
లక్కీ కలర్: మావిచిగురు; లక్కీ నంబర్: 12
కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
మిమ్మల్ని మీరు నిశితంగా పరిశీలించుకోవలసిన తరుణం ఇది. మీ శరీరంతోబాటు మనసును కూడా లోతుగా పరిశీలించండి. మీ బంధం ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నదనుకుంటే, వారికి మీ పరిస్థితులు, సమస్యల గురించి ఓపిగ్గా చెప్పి, ఒప్పించి అప్పుడు బయట పడండి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, కొత్త ఆలోచనలు చేయండి. ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితులలోనూ కోల్పోవద్దు. సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోండి.
లక్కీకలర్: లేత ఎరుపు; లక్కీ నంబర్: 9
మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఈ సంవత్సరం ఆరంభం నుంచీ మీరు ప్రశాంతంగా ఉంటారు. గతంలో వచ్చిన భయాల నుంచి, సమస్యల నుంచి బయట పడతారు. మీరు రకరకాల దృక్పథాల నుంచి బయటకు రండి. అన్ని దృక్కోణాలను కలుపుకుని, ఒక కొత్త ఆలోచనతో ఉండండి. పాజిటివ్‌గా ఆలోచించండి. పాజిటివ్‌గా వ్యవహరించండి. సమస్యలను, సవాళ్లను తిట్టుకోవద్దు. మీరు మంచి పాఠం నేర్పినట్లుగా భావించి, కృతజ్ఞతతో ఉండండి. ఏప్రిల్ నుండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని ఆందోళనల నుంచి బయటపడి హాయిగా, ప్రశాంతంగా గడుపుతూ, ఆనందాన్ని అనుభవిస్తారు.
లక్కీ కలర్: తెలుపు; లక్కీ నంబర్: 2
- ఇన్సియా టారో అనలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment