
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆసక్తికర సమాచారం అందుతుంది. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధల నుంచి విముక్తి. సంఘంలో గౌరవం. ఆలయాలు సందర్శిస్తారు. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. అందరిలోనూ మంచి గుర్తింపు పొందుతారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వివాహాది శు“భకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నేరేడు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. సన్నిహితుల సాయం అందుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు పోటీవరీక్షల్లో విజయం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాyజ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో విజయం. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సత్కారాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. గులాyజ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మొదట్లో ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వివాహా,ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుంచి «ధనలాభం. ఓర్పు, నేర్పుతో ముందుకు సాగి వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. శ్రమాధిక్యం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. సోదరుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌కు అర్చనలు చేయండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. గులాyజ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక విషయాలలో పురోగతి. పలుకుబడి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కే సూచనలు. సోదరులు, సోదరీలతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. బంధువుల నుంచి పిలుపు రాగలదు. వాహనయోగం. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాల శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, లేతగులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందాలు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అరుదైన సన్మానాలు. వారం మధ్యలో అనారోగ్యం. శ్రమ తప్పదు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో కొన్ని విషయాలలో విభేదాలు. నిర్ణయాలలో తొందరవద్దు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ముందుకు సాగవు. అనారోగ్య సూచనలు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాల్లో బదిలీల అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం మ«ధ్యలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్య వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలను పదవులు వరిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతోకలహాలు. గులాyజ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు
టారో (13 మే నుంచి 19 మే, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
ఈవారం ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎప్పట్నుంచో మీరు కోరుకున్న ప్రపంచం వైపుకు అడుగులు వేస్తారు. వారం చివర్లో ఒక శుభవార్త వింటారు. మీకిష్టమైన వ్యక్తులతో మాటపట్టింపులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. వృత్తి జీవితంలో చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంది. ధ్యానం, పాటలు వినడం లాంటివి చేస్తూ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
కలిసివచ్చే రంగు : పర్పుల్
వృషభం (ఏప్రిల్ 20 – మే 20)
అదృష్టం ఈవారం కూడా మీ వెన్నంటే ఉంటుంది. మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడంలోని ఆనందాన్ని కోల్పోకండి. అనవసర విషయాల్లో జోక్యం వద్దు. జీవితాశయం వైపుకు అడుగులు వేయాలన్న ఆలోచన చేస్తారు. ఇందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. కొత్త వ్యాపార ఆలోచన ఒకటి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వారం చివర్లో స్వల్ప అనారోగ్యం. చెడు అలవాట్లకు దూరమయ్యే ఆలోచన చేయండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : పసుపు
మిథునం (మే 21 – జూన్ 20)
చాలాకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక సమస్యలు మెల్లిగా ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి జీవితం ఊహించనంత బాగుంటుంది. గొప్ప అవకాశం ఒకటి మీ తలుపు తడుతుంది. ఉన్నత పదవిని అలంకరిస్తారు. మీదైన ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ముందుకువెళ్లండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. కుటుంబాన్ని, ప్రేమను వేరు చేసి చూడకుండా సమన్వయానికి ప్రయత్నించండి. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురైనా వాటికి ఎదురెళ్లి నిలబడతారు.
కలిసివచ్చే రంగు : బూడిద
కర్కాటకం (జూన్ 21 – జూలై 22)
ఈవారం మీరు ఊహించనంత సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకొని సమస్యలను కొని తెచ్చుకోకండి. గతాన్ని గురించి ఎంత ఆలోచించినా లాభం లేదన్నది మీరు తెలుసుకోవాలి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. వృత్తి జీవితం చాలా బాగుంటుంది. వారం చివర్లో ఒక కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. మీకిష్టమైన వ్యక్తి నుంచి వచ్చే సలహాలు మిమ్మల్ని ఉత్సాహవంతంగా ఉంచుతాయి.
కలిసివచ్చే రంగు : గులాబి
సింహం (జూలై 23 – ఆగస్ట్ 22)
ఈవారం మీ జీవితాన్ని మలుపు తిప్పే ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి పడుతుంది. అన్నివిధాలా ఆలోచించాకే ఆ నిర్ణయాన్ని తీసుకోండి. మీకిష్టమైన వ్యక్తుల నుంచి వచ్చే సలహాలు కూడా బాగా ఉపయోగపడతాయి. వారం చివర్లో ఓ కొత్త వ్యక్తి పరిచయమవుతారు. ఆ పరిచయం మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళుతుంది. కొన్ని కీలక సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటూ వెళతారు. కొత్త జీవితం మొదలుపెట్టాలన్న ఉత్సాహం చూపిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
కలిసివచ్చే రంగు : తెలుపు
కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22)
కొత్త ప్రపంచం మనల్ని పలకరించే వేళ మనం కూడా కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలన్నది మీకు తెలియాలి. మీరు ఆ ప్రపంచం వైపుకు ఇప్పుడిప్పుడే అడుగులేస్తారు. మీకిష్టమైన వ్యక్తి అన్ని సమయాల్లోనూ మీకు తోడుగా ఉంటారు. మీరు కలలుగన్న అవకాశం ఒకటి ఈ వారమే మీ తలుపు తడుతుంది. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాయామం లాంటివి మొదలుపెట్టడానికి ఇది సరైన సమయమని నమ్మండి.
కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ
తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22)
కొంతకాలంగా మీరు చేస్తున్న పని మీకే సంతృప్తినివ్వడం లేదన్నది గ్రహిస్తారు. మీకు బాగా సంతృప్తినిచ్చే పనులు చేసుకుంటూ ముందుకెళ్లండి. ప్రేమ జీవితం కాస్తంత ఆందోళనకరంగానే ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితులు కొన్ని ఎదురయ్యాకే జీవితం నిండుగా ఉంటుందన్నది తెలుసుకోండి. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించండి. కాలం చేసిన గాయాలను మాన్చేది మళ్లీ కాలమే అన్న విషయాన్ని తెలుసుకోండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
కలిసివచ్చే రంగు : ఎరుపు
వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21)
జీవితం నేర్పిన అనుభవాలే మళ్లీ మీకు అదే జీవితాన్ని కొత్తగా పరిచయం చేస్తాయన్నది తెలుసుకోండి. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఈవారమంతా ఎప్పట్లానే ఉత్సాహంగా ఉంటారు. రానున్న రోజుల్లో ఒక శుభవార్త వింటారు. వృత్తి జీవితం చాలా బాగుంటుంది. మీరెంతో ఇష్టంగా చూసుకునే వ్యక్తి అన్ని సమయాల్లోనూ మీకు తోడుగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు.
కలిసివచ్చే రంగు : బ్రౌన్
ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21)
గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవడంలో అర్థమే లేదన్నది మీకు తెలియాలి. కొత్త అవకాశాలు మీకు దగ్గరగా వచ్చినప్పుడు ఇలా గతాన్ని పట్టుకొని భవిష్యత్‌ను పాడు చేసుకోవద్దు. మీరు నమ్మిన సిద్ధాంతం ఎవ్వరికీ హాని చెయ్యనిది అయినప్పుడు దానికోసం ఎంతదూరమైనా వెళ్లడానికి సాహసించండి. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురైనా వాటన్నింటికీ ఎదురెళ్లి నిలబడే ధైర్యాన్ని కూడగట్టుకుంటారు. మీకిష్టమైన వ్యక్తితో విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు.
కలిసివచ్చే రంగు : వయొలెట్
మకరం (డిసెంబర్ 22 – జనవరి 19)
మీ జీవితం కొద్ది రోజుల్లో ఊహించని మలుపులు తీసుకుంటుంది. అందుకు ఇప్పట్నుంచే సిద్ధంగా ఉండండి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్ని పనులూ ఒకేసారి మీద పడినట్టు భావిస్తారు. ఓపిక కూడగట్టుకొని పనిచేయండి. విజయం మీ వైపే ఉందన్న విషయాన్ని మరవకండి. కొన్ని గొప్ప విజయాలను చేరుకున్నాక ఆ విజయం కన్నా, ఆ ప్రయాణాలే బాగున్నాయని తెలుసుకోవడమే జీవితం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కలిసివచ్చే రంగు : నీలం
కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
గత కొద్దికాలంగా మిమ్మల్ని ఎంతగానో వేధిస్తున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. మీదైన ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. ఒక గొప్ప అవకాశం త్వరలోనే మీ తలుపు తడుతుంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి. ఆర్థిక పరిస్థితి ఒకేసారి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. జీవితమన్నది ఇష్టంగా చేసుకునే ఒక ప్రయాణమని తెలుసుకోండి. ఆ ప్రయాణాన్ని, అదెలా ఉన్నా ఆస్వాదిస్తూ ముందుకెళ్లండి. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : గులాబి
మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఈవారమంతా ఉత్సాహంగా గడుపుతారు. ఎప్పట్నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ ఈవారమే పరిష్కారమవుతాయి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. విహారయాత్రకు కూడా సన్నాహాలు చేసుకుంటారు. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఇందుకు కొత్తగా పరిచయమైన ఒక వ్యక్తి సలహాలు బాగా ఉపయోగపడతాయి. వృత్తి జీవితం బాగుంటుంది. త్వరలోనే ఒక గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఈ అవకాశంతో మీ ఆర్థిక సమస్యలు కూడా మెల్లిగా తగ్గిపోతాయి.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ
- ఇన్సియా టారో అనలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment